రాష్ట్రీయం

దేశ సైనికులకు లేని గౌరవం నకిలీ దళితుడికి అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 23: దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణ త్యాగాలు చేస్తున్న భరతమాత ముద్దుబిడ్డలకు ఇవ్వని గౌరవం ఒక నకిలీ దళితుడికి ఇవ్వడం అవసరమా అని హిందూ ధర్మ పరిరక్షణ సమస్వయ సమితి గుంటూరు జిల్లా అధ్యక్షుడు దర్శనపు శ్రీనివాస్ ప్రశ్నించారు. దేశ ప్రజలంతా గుండెలపై చేయి వేసుకుని నిబ్బరంగా నిద్రించేందుకు దేశ సరిహద్దుల్లో నిరంతరం కాపు కాసే సైనికులనే విస్మరిస్తున్న కొందరు పాలక, ప్రజాపక్షాల నాయకులు కేవలం తన వ్యక్తిగత, కుల సంబంధ అంశాలతో బలవన్మరణానికి పాల్పడిన ఒక యువకుడి పట్ల స్పందించడం మూర్ఖత్వంగా భావించాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్రీనివాస్ శనివారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థి వేముల రోహిత్, అతని కుటుంబం దళితులకు రావాల్సిన రిజర్వేషన్లు, అక్రమంగా దొంగ సర్ట్ఫికెట్లు పొంది ఎస్సీలుగా చలామణి అవుతుంటే అతను ఎస్సీ వర్గీయుడేనని కొందరు ప్రచారం చేయడం సరికాదన్నారు. దళితుల్లో ఒక వర్గం వారు మాత్రమే ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని, దీనికి మాదిగ సోదరులంతా దూరంగా ఉండాలని కోరారు.