క్రైమ్/లీగల్

ఢెట్ రిలీఫ్ కమిషన్ ఏర్పాటు చేయలేథేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర డెట్ రిలీఫ్ కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. మూడు నెలల్లో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలియచేసిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. ఈ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ గత ఏడాది బీజేపీ సీనియర్ నేత ఎన్ ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. 2017 ఆగస్టు 21వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఈ కమిషన్‌ను మూడు నెలల్లో ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు తెలిపింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోనందు వల్ల కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టుప్రశ్నించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వై బాలాజీ వాదనలు వినిపిస్తూ గత ఏడాది నవంబర్‌తో మూడు నెలల వ్యవధి ముగిసిందన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ సమస్యలు పెరిగాయని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ, ఈ కమిషన్ ఏర్పాటు ప్రక్రియ పురోగతిలో ఉందని కోర్టుకు తెలిపారు. ఈ విషయమై రెండు వారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్‌ను దాఖలుచేయాలని హైకోర్టు ఆదేశించింది.