అంతర్జాతీయం

మళ్లీ షట్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబియా, ఫిబ్రవరి 9: అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్ అయింది. ప్రభుత్వ ఖర్చుకు సంబంధించి వినిమయ బిల్లుకు ఈసారీ సెనెట్ ఆమోదం లభించలేదు. గత నెల 20న బిల్లుకు రిపబ్లికన్ పార్టీ సెనెటర్లు మద్దతు ఇవ్వకపోవడంతో ఆమోదం లభించలేదు. వాస్తవానికి బిల్లుకు గురువారం రాత్రికి ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే నిధులు కేటాయింపుపై సంతృప్తి చెందని కెంటకీ రిపబ్లికన్ పార్టీ సెనెటర్ రాండ్‌పౌల్ ఆమోదానికి అంగీకరించలేదు. దీంతో మూడువారాల వ్యవధిలో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దేశంలో పాలనను గాడిలోపెట్టాలన్న ఉద్దేశంతో డెమోక్రటిట్‌పార్టీ కృషి చేసి ఓ ఒప్పందానికి వచ్చింది. ఈనెల 8 తేదీవరకు ఖర్చుచేయాల్సిన నిధులకు సంబంధించి అంగీకారం కుదిరింది. బిల్లుకు ఆమోదం లభించడంతో శుక్రవారం వరకూ నిధులు విడుదల అయ్యాయి. కానీ ఓ సెనేటర్ వల్ల ఆమోదం పొందలేకపోయారు. బిల్లుకు సెనెట్ ఆమోదం తెలిపిన మరుక్షణమే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం పంపించాల్సి ఉంది.