ఆంధ్రప్రదేశ్‌

దక్షిణ కోస్తాకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 23: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇదిలా ఉండగా తెలంగాణ, ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 5 డిగ్రీల మేర ఉష్ణోత్రలు తగ్గినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రామగుండంలో అత్యధికంగా 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గి శనివారం 11 డిగ్రీలుగా నమోదైంది. అలాగే నిజామాబాద్, హైదరాబాద్‌లో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర కోస్తాలో కూడా ఉష్ణోగ్రతల క్షీణత మొదలైంది. పలు పట్టణాల్లో 1 నుంచి 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు చోటుచేసుకుంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో మాత్రం సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.