విజయవాడ

ఆయేషా హత్య కేసులో కోర్టుకు సిట్ తొలి నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 9: రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగించిన బి ఫార్మసీ విద్యార్ధిని ఆయేషామీరా హత్య కేసు పునర్విచారణకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన తొలి నివేదికను కోర్టుకు సమర్పించింది. ఆయేషా కేసు నుంచి పిడతల సత్యంబాబు నిర్ధోషిగా విడుదలైన తర్వాత హైకోర్టు కేసు పునర్విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు నిమిత్తం డిఐజి శ్రీకాంత్ నేతృత్వంలో డిఎస్పీలు హైమావతి, శ్రీలక్ష్మీ, సిఐ సహేరాతో కూడిన ప్రత్యేక బృందాన్ని (సిట్) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సిట్ పునర్విచారణకు కొద్దిరోజుల ముందు తెర తీసింది. దీనిలో భాగంగా ఆయేషా చదివిన కళాశాల, హాస్టల్‌ను పరిశీలించి గత వారంరోజులుగా ప్రాధమిక దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి ప్రాధమిక నివేదికను సిట్ శుక్రవారం విజయవాడ నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించింది.

నీరు-చెట్టు పనుల ప్రగతిని సమీక్షిస్తున్న
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు