ఉత్తరాయణం

ఉపశమనం ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపన్న వర్గానికి చెందిన విద్యావంతుడు అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్న బడ్జెట్ల వల్ల సామాన్య ప్రజానీకానికి ఎలాంటి మేలు జరగడం లేదు. బడ్జెట్ ప్రవేశ పెట్టినపుడు ఆయన చెబుతున్న మాటలు దీర్ఘకాలిక ప్రయోజనాలకు సంబంధించినవే తప్ప అత్యధిక సంఖ్యలో ఉన్న పేదలకు తక్షణ ఉపశమనం దక్కడం లేదు. గొంతెండి పోయిన వాడికి వెంటనే గుక్కెడు నీళ్లిస్తే ప్రాణం నిలుస్తుంది కానీ ఎప్పుడో నోట్లో అమృతం పోస్తానంటే ఎలా? సంస్కరణల పుణ్యమాని దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయే తప్ప కనీస సౌకర్యాలు లేక అల్పాదాయ వర్గాలవారు నానా అవస్థలు పడుతున్నారు. కేంద్రంలో ఎన్‌డిఏ సర్కారు చేపట్టిన చర్యలతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరిగినా సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సగటు జీవులపై పన్నుల భారం తగ్గించకుండా విమానయానం, బుల్లెట్ రైళ్లు, భారీ రహదారుల పేరిట అవసరానికి మించి ఖర్చు చేస్తున్నారు. అవినీతి, అక్రమాల వల్ల సంక్షేమ పథకాలు సరైన ఫలితాలను ఇవ్వడం లేదు. రెండంకెల వృద్ధిరేటు, తలసరి ఆదాయం, స్టాక్ మార్కెట్ల వైభవం అంటూ సంబరపడితే చాలదు. ప్రధాని పిలుపు మేరకు సంపన్నులే కాదు కొందరు సామాన్యులు సైతం వంటగ్యాస్‌పై సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకుంటుండగా, పెట్రో కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. చిన్న మొత్తాలపై వడ్డీ శాతం తగ్గించడం దారుణం. తలసరి ఆదాయం భారీగా పెరగకున్నా, జీవన వ్యయం మితిమీరకుండా పెట్రోధరలను, నిత్యావసర సరకుల ధరలను తగ్గించేలా బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు లేవు. ప్రజారవాణా వ్యవస్థ సామాన్యుడికి నానాటికీ కష్టమవుతోంది. రైతులకు మేలు చేసేలా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. అభివృద్ధి కేవలం నినాదాలకే పరిమితం కాకుండా ప్రజల స్థితిగతులను వాస్తవ దృక్పథంతో అంచనా వేసి, పేదలకు ప్రయోజనం కలిగేలా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాలి.
- తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట
వేతనజీవులకు నిరాశే
2018-19 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం కలిగే అవకాశం లేదు. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మరోవైపు సామాన్య వర్గాలవారు సైతం బడ్జెట్ పట్ల నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి పథకాలు, రైల్వే ప్రాజెక్టులకు, జాతీయస్థాయి విద్యాసంస్థలకు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడం దారుణం. రైతులకు కొన్ని వరాలను ప్రకటించినప్పటికీ ఆచరణలో నిధుల కేటాయింపు ఎలా ఉంటుందో చెప్పలేం. కొద్దినెలల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులో వివక్ష చూపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
- కామిడి సతీష్‌రెడ్డి, పరకాల