రివ్యూ

ప్రేమలో పడేస్తుంది! ** తొలిప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
వరుణ్‌తేజ్, రాశీఖన్నా,
సుహాసిని, స్వప్న పబ్బి,
ప్రియదర్శి, హైపర్ ఆది,
విద్యుల్లేఖా రామన్ తదితరులు
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
సంగీతం: ఎస్.ఎస్ థమన్
కెమెరా: జార్జి సి.విలియమ్స్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ, కథనం, దర్శకత్వం:
వెంకీ అట్లూరి

మెగా వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌తేజ్.. మొదటినుండి కొత్తగా ప్రయత్నం చేస్తూ తనదైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంటున్నాడు. తనకున్న మాస్ ఇమేజ్‌ని పక్కన పెట్టి భిన్నమైన కథలను ఎంచుకుంటూ ‘ఇలా కొత్తగా మనం ఎందుకు చేయకూడదు’ అన్న ఆసక్తితో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ‘్ఫదా’ లాంటి సంచలన విజయం అందుకున్న వరుణ్‌తేజ్.. తాజాగా తన ‘తొలిప్రేమ’ జ్ఞాపకాలను పంచుకునేందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పవన్ కెరీర్‌నే టర్న్ చేసిన తొలిప్రేమ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా మొదటి నుండి పెద్దగా అంచనాలు కూడా లేకుండా విడుదల కావడం విశేషం. మరి వరుణ్ ‘తొలిప్రేమ’ సంగతులు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
ప్రతి మనిషి జీవితంలో జరిగే సంఘటన ఎన్నటికీ మరచిపోని అందమైన జ్ఞాపకం తొలిప్రేమ. అది ఎక్కడ.. ఎప్పుడు.. ఎవ్వరిపై పుడుతుందో చెప్పలేం. అలాంటి తొలిప్రేమలు అందరికీ దక్కవు. జీవితంలో కొత్త ఉత్సాహాన్ని.. సరికొత్త అనుభూతిని మిగిల్చే ఈ తొలిప్రేమ మన కథానాయకుడి విషయంలో కూడా జరిగింది. ఈ కథలో హీరో ఆదిత్య (వరుణ్‌తేజ్) మంచి తెలివైన కుర్రాడు.. పైగా చదువులో ఫస్ట్, తాను కరెక్టుగానే ఆలోచించి ఏ పనైనా చేస్తాను. అందులో ఏ తప్పు ఉండదనుకునే యువకుడు. ఇక హీరోయిన్ వర్ష (రాశీఖన్నా) ఏ విషయాన్నైనా పలు విధాలుగా జోడించి నిర్ణయం తీసుకునే అమ్మాయి. వీరిద్దరూ అనుకోకుండా ఓ రైలు ప్రయాణంలో కలుసుకుంటారు. వర్షను చూసిన ఆదిత్యకు బాగా నచ్చేస్తుంది. మనసులో ఏదైనా అనుకొంటే ఎలాంటి జంకూ బొంకూ లేకుండా చెప్పేసే ఆదిత్య పరిచయమైన గంటలోనే వర్షకి ఐ లవ్ యు చెబుతాడు. దాంతో షాక్ అయిన ఆమె మాత్రం ‘‘ముందు కలిసి ప్రయాణం మొదలెడదాం’’ అంటూ తన ఇష్టాన్ని మనసులోనే దాచుకొంటుంది. అలా మొదలైన ఆదిత్య-వర్షల ప్రయాణగాథ ఎన్నో ఎమోషన్స్‌ని దాటుకుని ఎక్కడికి చేరింది.. ఆ తరువాత విడిపోయి మళ్లీ ఆరేళ్ల తర్వాత ఒకే కంపెనీలో ఇద్దరూ కలుస్తారు. అప్పుడు వారి మానసిక సంఘర్షణ ఏంటి? అసలు వీరిద్దరూ ఒక్కటయ్యారా? లేదా అన్నదే మిగతా కథ..
వరుణ్, రాశీల మధ్య తొలిప్రేమ రైల్లో పుట్టడం ద్వారా వారి జీవితం ప్రారంభమవుతుంది. ఒకే కాలేజ్‌లో సీనియర్ల ర్యాగింగ్, సహచరుల మధ్య ఆట పట్టించే సన్నివేశాలతో చకచకా కథ సాగిపోతుంటుంది. ప్రేమలో ఇష్టాయిష్టాలను, ప్రేమానురాగాలను చిన్న సంఘటనలు, సన్నివేశాల ద్వారా సినిమా ఆసక్తిగా మారుతుంది. ‘్ఫదా’లో ఎన్నారై యువకుడిగా, పరిణతితో కూడుకున్న పాత్రలో కనపడ్డ వరుణ్ తేజ్ ఈ సినిమా లవర్ బాయ్‌గా భిన్నంగా కనపడ్డాడు. ప్రేమ, విడిపోవడం అనే సందర్భాల్లో వచ్చే బాధను, ఆ ఎమోషన్‌ను తన పాత్రలో చక్కగా చూపించాడు. వర్ష పాత్రలో రాశీఖన్నా చక్కగా చేసింది. పాత్ర కోసం సన్నబడటం.. మళ్లీ కొంతలావు అవ్వడం లాంటి ఫిజికల్ మార్పును బాగా చూపించింది. తన హావభావాలు, కారులోని రొమాంటిక్ సీన్ అన్నీ ఆకట్టుకుంటాయి. స్వప్న పబ్బి పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో మెప్పించింది. ప్రియదర్శి, జబర్దస్త్ ఆది, సుహాసిని, విద్యుల్లేఖారామన్ తదితరులు వారి వారి పాత్రలతో మెప్పించారు. దర్శకుడు వెంకీ అట్లూరి తొలి సినిమా ఇది. మంచి ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ. ప్రేమకథ అంటే ప్రేమికులు కలుసుకోవడం.. విడిపోవడం.. మళ్లీ కలుసుకోవడం అనే పాయింట్ కామన్‌గానే ఉంటుంది. ఇలాంటి ప్రేమ కథల్లో ఎమోషన్స్, ఫీల్ అనేది ముఖ్యం. ఈ సినిమాలో అవి మిస్ కాకుండా చూసుకున్నాడు దర్శకుడు. ప్రేమికుల మధ్య జరిగే సంఘటనలకు బలమైన సన్నివేశాలు, వాటికి మాటల పవర్ తోడవ్వడంతో సినిమా మరో స్థాయికి వెళ్లింది. ప్రథమార్థంలో రైల్వే స్టేషన్, కాలేజీ సీన్లు చక్కగా డీల్ చేశాడు. ప్రేమికుల మధ్య వుండే పరిస్థితులతో చక్కటి భావోద్వేగ చిత్రంగా తొలిప్రేమను మలచడంలో వెంకీ అట్లూరి పూర్తిగా సఫలమయ్యాడు. చాలా రోజుల తరువాత సంగీత దర్శకుడు థమన్ మంచి సంగీతం ఇచ్చాడు. మెలోడీ సాంగ్స్, నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా చేశాడు. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. యూత్ మూడ్‌ను ఆకట్టుకొనే విధంగా సినిమాను అందంగా తీర్చిదిద్దాడు జార్జ్. కాలేజీ సన్నివేశాలు, లండన్ ఎపిసోడ్స్‌కు అందించిన సినిమాటోగ్రఫీతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు. జార్జి సి. విలియమ్స్ కెమెరా వర్క్ ఈ సినిమాకు ఎస్సెట్ అని చెప్పవచ్చు. నవీన్ నూలి లీనియర్ స్క్రీన్ ప్లేతో నడిచే సినిమాని ప్రతి ప్రేక్షకుడికి అర్థమయ్యే రీతిలో ఎడిట్ చేసిన విధానం కూడా ప్లస్ అయింది. సి.జి. వర్క్ పరంగా ఇంకాస్త ఎక్కువ ఎపర్ట్ పెట్టి ఉంటే బాగుండేది. ఒక కొత్త దర్శకుడి కథను నమ్మి ఖర్చుకి వెనుకాడకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల నిర్మాణ విలువలు బాగున్నాయి.
వరుసగా వస్తున్న రొటీన్ సినిమాలతో సతమతమవుతున్న సగటు ప్రేక్షకుడిని ఊహాలోకంలో విహరించేలా చేసిన సినిమా తొలిప్రేమ. ఒక స్వచ్ఛమైన సినిమా చూశామన్న అనుభూతి కలుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలోని తొలిప్రేమ జ్ఞాపకాలను తడుముతుంది. ఈ కథలో వరుణ్‌తేజ్, రాశీఖన్నాల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. వీరిద్దరూ పోటాపోటీగా నటించడంవల్ల సినిమా స్థాయి మారింది. ఫస్ట్‌హాఫ్ అంతా ఓ ఫీల్‌తో రన్ అవుతుంది. కానీ సెకెండాఫ్ విషయానికి వస్తే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు కన్పిస్తాయి. సెకండాఫ్‌లో ఎమోషన్‌గా సరైన విధంగా కనెక్ట్ చేయకపోవడం.. కామెడీ పెద్దగా లేకపోవడంతో కాస్త దిగాలుగా అనిపిస్తుంది. మొత్తానికి ఒక మంచి సినిమా చూశామన్న ఫీల్‌తో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటికి వస్తాడు.

-త్రివేది