డైలీ సీరియల్

వ్యూహం 41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజంగా సమద్రంలో చిన్న పడవలో ప్రయాణం చేస్తున్నట్లు వుంది లోహితకు. చుట్టూ పెద్ద పెద్ద అలలు.. మింగెయ్యడానికి నోరు తెరచుకున్న తిమింగలాలు, షార్క్ చేపలు...
ఎలా బయటపడాలి?
‘‘నేను రిజైన్ చేసి హైదరాబాద్ వెళ్లిపోతాను’’ అందామె.
‘‘అది సాధ్యం కాని పని.. ఒక్కసారి మా గ్రూప్ ఆరిఫ్ హాస్పిటల్లో చేరేక మధ్యలో రిజైన్ చేసి వెళ్ళటం అంటూ కుదరదు. రిటైరయ్యాక బయటకు వెళ్లాలి లేది మాధ్యలోనే తనువు చాలించి నిష్క్రమించాలి!’’ అన్నాడు అరవింద్ కొంచెం కటువుగా.
వాళ్ళ మైండ్ సెట్ అర్థం అయ్యింది లోహితకు.
సముద్రంలో నౌకలో ప్రయాణం తప్పదు.. షార్క్స్, వేల్స్ సచేపలకు భయపడకుండా తీరాన్ని చేరుకోవాలి! ప్రాప్తమున్న తీరానికి చేరుకోవడం కాదు, తాను అనుకున్న తీరానికి చేరాలి! స్కంద సహకారం తనకు వుంది. భయపడకూడదు తను.
‘‘మీరు చెప్పినట్లే చేస్తాను సార్’’ అంది లోహిత.
‘‘దట్స్ గుడ్’’ అన్నాడతను.
అక్కడనుంచి బయటకు వచ్చిందామె.
***
రాజమండ్రికి దగ్గరలోనే వుంది కడియం.
ఆ ప్రాంతంలో ఎటువైపు వెళ్లినా నర్సరీలు వున్నాయి.
కొన్నివేల పూల మొక్కలు, డెకరేషన్ ప్లాంట్స్ భూమిమీద కొలువుతీరి ముచ్చట్లు చెప్పుకుంటున్నట్లు కన్పించేయి.
కారు నిశాంత్ ఇంటి దగ్గరకు రాగానే భయపడింది సావేరి.
పెళ్లి కాకముందే ఇంటికి తనను నిశాంత్ తీసుకువెళ్తున్నాడు. అతని తల్లిదండ్రులు ఏమనుకుంటారో! బరితెగించి వచ్చేసింది పిల్ల. అమెరికా అబ్బాయిని ఎగరేసుకుపోవాలని వెంటబడి వచ్చింది’ అనుకోరూ!
‘‘వెంటనే ఆ అమ్మాయిని వాళ్ళింటికి పంపించెయ్యి! పెళ్లికాకముందే నువ్వు అమ్మాయిలను వెంటేసుకుని తిరుగుతుంటే నలుగురు నవ్వరూ!’’ అని నిశాంత్ తల్లి అంటుందేమో!
నిశాంత్ తండ్రి మందలిస్తాడేమో!
‘‘మీ నాన్నగారికి చెప్పారా మనం వస్తున్నట్లు’’ అడిగింది సావేరి, కారు డ్రైవ్ చేస్తున్న నిశాంత్ వైపుచూస్తూ.
‘‘మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోబోతున్నాం ముందే చెబితే థ్రిల్ ఏముంటుంది?’’ అన్నాడతను.
అతని మనసులో ఎటువంటి ఆందోళన లేదు. ప్రశాంతంగా డ్రైవ్ చేస్తున్నాడు. సావేరిని పక్కన కూర్చోబెట్టుకుని కారునడపడం అతనికి ఉత్తేజాన్ని కల్గిస్తూ వుంది.
‘‘మీ నాన్నగారు మిమ్మల్ని కోప్పడితే?’’
‘‘తిరిగి హైద్రాబాద్ వెళ్ళిపోదాం! మళ్లీ నీతో కారులో లాంగ్ డ్రైవ్’’ సమాధానమిచ్చాడు, నవ్వుతూ.
నిశాంత్ ఇంటిముందు కారు ఆపాడు.
విశాలమైన ఆవరణలో పచ్చని చెట్లమధ్య ఉంది ఆకు పచ్చ రంగు పెయింట్ వేసిన మేడ. ఇంటిముందు రకరకాల పూల మొక్కలు. ఆ మొక్కల్ని చూస్తూ పులకించిపోయింది.
‘‘ఈ రంగు రంగుల గులాబీలు, చేమంతులు ఎంత ముద్దొస్తున్నాయో!’’ అంది సావేరి పూలకుండీల దగ్గర కూర్చుని.
‘‘పూల మొక్కల మధ్య ముద్దబంతిపూవులా ఒదిగిపోయి కూర్చుంది.. ఎవరా అమ్మాయి?’’ అంటూ పోర్టికో దగ్గరనుంచి వాళ్ళున్న చోటికి వచ్చింది నిశాంత్ తల్లి రాధమ్మ.
‘‘నా ఫ్రెండ్ సావేరి అమ్మా! మన స్కందకి బాగా దగ్గరివాళ్ళు.. మన ఊరు చూస్తానంటే తీసుకువచ్చాను.. నెల రోజులు వుంటుంది మన ఇంట్లో గెస్ట్‌గా’’ అన్నాడతను.
‘‘చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ చూడాలంటే నెల రోజులు ఏం సరిపోతుంది? మన ఊరి అందచందాలు చూడటానికే నెలరోజులకుపైగా పడుతుంది.. లోపలికిరా తల్లీ!’’ అంది రాధమ్మ సావేరి చెయ్యి పట్టుకుని.
‘‘యాభైఏళ్ల వయసులో కూడా ఎంత అందంగా వుంది!’’ అనుకుంది సావేరి రాధమ్మను చూడగానే. ఆకుపచ్చ రంగు చేనేత చీర, పసుపు పచ్చ జాకెట్టులో వనదేవతలా కన్పించింది. ఆమె వెనుకే అడుగులు వేసింది.
‘‘ప్రయాణం చేసి అలసిపోయినట్లున్నావ్.. స్నానం చెయ్యి ఫ్రెష్‌గా వుంటుంది! ఈలోపు నేను కాఫీ పట్టుకొస్తాను’’ అందామె.
లోపలికి వెళ్లబోయిన ఆమె ఆగి ‘నీ బ్యాగ్ ఏది?’ అని అడిగింది రాధమ్మ.
‘‘కారు డిల్లీలో వుంది.. తెచ్చుకుంటాను’’ అంటూ వెనక్కి తిరిగింది సావేరి.

- ఇంకాఉంది

అలపర్తి రామకృష్ణ