కృష్ణ

థర్మల్ విద్యుత్ కేంద్రం సీఈగా సుబ్రహ్మణ్యరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 12: డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ (సీఈ)గా కె సుబ్రహ్మణ్యరాజు పదవీ బాధ్యతలు చేపట్టారు. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్‌లో పనిచేస్తూ ఆయన పదవీ విరమణ చేయగా సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి పోస్టింగ్ ఇస్తూ తిరిగి ఇక్కడ చీఫ్ ఇంజనీర్‌గా నియమిస్తూ ఎండీ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు సోమవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న ఎం పద్మసుజాతను ఏడాది కాలానికే విద్యుత్ సౌధకు బదిలీ చేశారు.
అందరూ సహకరించాలి
థర్మల్ విద్యుత్ కేంద్రం ఐదో యూనిట్‌లో పర్యవేక్షణ ఇంజనీర్‌గా ఉద్యోగులు, కార్మికులందరితో కలిసి పనిచేశానని, ఆ అనుభవంతో, ఉద్యోగుల సమష్టి కృషితో అధిక విద్యుత్ ఉత్పాదన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తానని సుబ్రహ్మణ్యరాజు అన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కార్మిక, ఉద్యోగ సంఘాలు, ఇంజనీర్లతో ఐఆర్ మేనేజర్ డి లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెరుగైన పారిశ్రామిక సంబంధాల ద్వారా అధిక ఉత్పాదనకు అందరూ సహకరించాలని కోరారు. మీ అందరి శ్రమ, కృషితో రాష్ట్రానికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. ఇంజనీర్లు, కార్మికులు, ఒప్పంద కార్మికులందరి సహకారంతో పనిచేస్తానని ఆయన వివరించారు. కృష్ణ, నవీన్, గౌతమ్, రమేష్‌బాబు, జవహర్, తదితరులు పాల్గొన్నారు.