తెలంగాణ

పేథలకే ఆసైన్డ్భూములు కటాఫ్ తేదీ 2014 జూన్ 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: అసైన్డ్భూములను సాగుచేసుకుంటున్న నిరుపేదలకు న్యాయం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం త్వరలో ఆర్డినెన్సును జారీ చేయనున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన 2014 జూన్ 2వ తేదీ నాటికి పేదల స్వాధీనంలో ఉన్న అసైన్డ్భూములను వారికే దక్కేటట్లుగా ప్రభుత్వం ఆర్డినెన్సును జారీ చేయవచ్చని సమాచారం. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో కటాఫ్ తేదీ 2007 జూన్ 29గా నిర్ణయించారు. ఐదు ఎకరాలు మెట్ట లేదా రెండున్నర ఎకరాల మాగాణి అసైన్డ్భూములు పేదల ఆధీనంలో ఉంటే వారికే దక్కేటట్లుగా చేయాలని, దీని వల్ల సామాజిక న్యాయం చేసినట్లుగా ఉంటుందని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో 22.63 లక్షల ఎకరాల అసైన్డ్భూములను 15.83 లక్షల లబ్ధిదారులకు అప్పగించారు. కాగా 16 లక్షల ఎకరాల అసైన్డ్భూములు ఆక్రమణదారులు, గుర్తింపులేనివ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం ఈ అంశంపై ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలోకేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు కడియం శ్రీహరి, కెటి రామారావు, టి హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జి జగదీష్‌రెడ్డి, ఎ ఇంద్రకరణ్ రెడ్డి, సి లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు ఉన్నారు. ఈ విషయమై న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ప్రభుత్వం తుది నివేదిక తీసుకుని ఆర్డినెన్సు విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.