వీరాజీయం

ధోనీకి ‘చెడ్డ’రోజులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ మహేంద్రసింగ్ ధోనీ- ‘‘ఏమి లేకా!’’ కాగా- విరాట్ కొహ్లీ ‘యమకేకా!’గా ఆరీ, వెలిగీ చేస్తున్నది. 2015 ఏం మిగిల్చింది మహేంద్రుడికి? విష్ణుమూర్తి వేషం కట్టినందుకు అరెస్ట్ వారెంట్ పలకరించింది.
చెన్నై సూపర్ కింగ్స్‌కి ‘కింగ్’అయిన ధోనీకి బద్నామీ మిగిలింది. టెస్ట్ పోటీలకి ‘రామ్‌రామ్’ కొట్టినా ఒక రోజు అంతర్జాతీయ పోటీలకి ‘‘ఇరవై- ఇరవై’’ క్రికెట్ వరల్డ్‌కప్‌కీ కూడా మహేంద్రుణ్నే ఎంచుకున్నాం. 2015లో ధోనీ ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. అది వేరే సంగతి.
14 మాసాలయి పోయింది- ‘్ధనీ’ ‘‘హిప్ హిప్ హుర్రే!’’ కేకలు విని నిజంగా అరివీర భయంకరులు అనుకుంటున్న ఆస్ట్రేలియన్ ‘‘ఏకదివసీయ అంతర్జాతీయ క్రికెట్ టీముని’’- వాళ్ల సొంత కాంక్రీట్ పిచ్‌ల మీద ఎదిరించడానికి మన కుర్రాళ్లు- బల్‌బీర్‌సింగ్ సరన్, స్పిన్నర్ ధావన్ లాంటి కొత్త కుర్రాళ్లకి, ప్రాక్టీస్ యిప్పిద్దామని కూడా సత్‌సంకల్పం పెట్టుకున్నాడు ధోనీ భాయ్. కాని కూల్‌గా వుండే ధోనీ- కాన్‌బెర్రా వోటమి తర్వాత ‘‘కోల్డ్‌గా’’అయిపోయాడు. నాలుగోసారి కూడా ప్రత్యర్థి క్యాప్టెన్ స్మిత్‌కి కంగ్రాట్స్ చెప్పిన మన హీరో ‘‘జీరో’’ అయిపోడం చివరికి ప్రత్యర్థులకి కూడా బాధ కలిగించింది. కానీ వెనక్కి తిరిగి చూస్తే, ఇండియన్ బ్యాట్స్‌మన్ రోహిత్, విరాట్, రెహానా చివరికి శిఖర్‌లు కూడా మీసాలు మెలివేసుకునేటన్ని పరుగులు చేశారు. వాళ్లకి క్యాప్టెన్ వెనుకనుంచి ప్రోత్సాహకర చప్పట్లు- ‘కమాన్... కమాన్!’ హెచ్చరికలు సైతం అక్కరలేక పోయాయ్.
ఐతే, ఈ బ్యాటింగ్‌కి దీటుగా బౌలర్లని వికెట్‌ల వెనుక నిలబడ్డ మహేంద్రుడు- నయానా, భయానా, రయాన సాధించి బౌలింగ్ చేయించాల్సింది. ప్చ్....
నాలుగవ ఒన్‌డే మ్యాచ్‌ని క్రికెట్ ఫ్యాన్స్- నేత్ర పర్వంగా చూశారు. నల్లేరు మీద బండిలాగా- విరాట్, శిఖర్‌లు ఎడాపెడా వాయించేముందు- రోహిత్ దానికి పునాది వేశాడు.
సునీల్ మనోహర్ గావస్కర్ ఇండియన్ బ్యాటింగ్- ఫీల్డింగూ చూసి మురిసిపోయి- మనవాళ్లు మొత్తం అన్ని ‘మ్యాచు’ల్లోనూ- ఏరంతా రుూది - చివర గట్టెక్కడం యిష్టం లేనట్లు బుడుంగుమని మునిగిపోయారు’’- అం టూ బాధపడ్డాడు గవీ.
ధోనీని అంతా - ‘్ధడాలా’ (ఉతికేశాడు) అంటారు. కానీ రుూసారి- ‘్ధగయా’ (ఉతికి ఆరవేయబడ్డాడు) అంటూ ఫ్యాన్స్ వాపోతున్నారు. ఆస్ట్రేలియన్స్ - నాలుగో వన్‌డేలో- ‘కంగారూగాళ్లు’ అనిపించుకున్నారు. ‘‘348 పరుగులు చేసినా సరిపోలేదు జీసస్!’’ అనుకుంటూ విరాట్ కొహ్లీని నిరోధించడానికి సతమతమైపోయారు. అఫ్‌కోర్స్ వాళ్లు బంతి వీరులు కూడా. ఈసారి సిరీస్‌లో - ఇండియన్ బంతులతో వాళ్ల బ్యాట్స్‌మెన్ చెండాడుకున్నారు. ఆమాటకొస్తే గత పనె్నండు ఓ.డి.ఐ. మ్యాచ్‌ల స్కోరుచూస్తే వాళ్ల వరుస యిలా వుంది.- 304/359/304/295/350/326/ 269/ 328/ 310/309/ 296/ 348. కానీ వాళ్ల సొంత గడ్డమీద- కుర్రాడు రెహానా సహా మన బ్యాటింగ్ వీరులు కూడా దీటుగా బ్యాటింగ్ చెయ్యడం క్రిటిక్స్‌కి మృష్టాన్నభోజనం అయింది. గానీ- ఘోర ఓటమి మనం చవిచూశాం.
మన ఇషాంత్, యాదవ్; భువీల బంతులు లడ్డూల్లాగా వున్నాయ్ వాళ్లకి మన ఫీల్డర్స్ అంతా ‘ఆఫ్‌సైడు’వుంటే- ఆన్‌సైడుకి త్రుళ్లుకుంటూ పడ్డాయ్ బంతులు- వాళ్లు బ్యాటింగ్ చేసి 348కి పెవిలియన్ వేపు తిరిగేసరికి- మన బౌలర్లు- ‘‘అమ్మయ్య! బ్రతికి పోయాంరా దేవుఁడా!’’ అనుకున్నారు. ధోనీ స్కోరు బోర్డువేపు చూస్తూ - ‘‘అయింది. నా క్యాప్టెన్సీ పని యిక ఫినిష్!’’ అనుకున్నాడు (కాని కూల్ కూల్ కదా). 8000 ఒన్‌డే పరుగులు యాభైకన్నా ఎక్కువ సరాసరి వున్న రుూ ‘గ్లామర్ బోయ్’- హతాశుడైపోయాడు. ‘రోహిత్ విరాట్‌లు, శిఖర్ ధావనుడు కూడా సెంచురీలు లాగించి తీరాలి’ అనుకుంటూ బోరవిరుచుకుని పిచ్ మీదికి బ్యాట్‌తో వడివడిగా పరుగులు తీయడం ఇండియన్ ఫ్యాన్స్ కనులారా చూసి మన ‘ఆబోరు’ దక్కుతుంది. మనవాళ్లు 350 రన్స్ బాదేస్తారు’’- అనుకుని, కేరింతలు కొట్టారు.
వీళ్లకేమయినా దెయ్యం పట్టిందా? అన్నట్లు చూస్తూ- కాళ్లు పడిపోయేలా ఫీల్డింగ్ చేస్తున్నారు వాళ్లు. ‘విరాట్’ నిన్నటి ‘కొహ్లీ’కాదు. మారిపోయాడు. బుసలు,- బూకరింపులూ లేవు. మంచి బాలుడు అయిపోయి, ఫాస్టెస్ట్ 7వేల రికార్డుకోసం బంతుల్ని తరిమాడు. శిఖర్‌కి వెనుకటి ‘‘జోష్’’వచ్చింది. ఆ జంట జెట్ ప్లేయర్స్ ఐనారు వాళ్లు. అవుట్ అయ్యేసరికి మన లక్ టాప్‌జెడ్‌గా వుంది. రన్‌రేటు 7.5 స్కోరు 277/2. ఆ టైములో చాకులాగా వున్న కుర్రాడు-పైగా క్యాప్టెన్‌గా కూడా యిటీవల జింబాబ్వేని చిత్తుచేసినవాడు- లాస్ట్‌టెస్ట్ మ్యాచ్‌లో ఎడాపెడా సెంచురీలు లాగినవాడు- రెహానా వుండగా- తాను దిగాడు ధోనీ భాయ్. ఓ.కే.- గ్రేట్ ఫినిషర్‌గా పేరుంది అతనికి. విన్నింగ్ షాట్ కొట్టాలనిపించడం సహజం కానీ- అతను మూడో బంతికే అవుట్ అవంగానే, తానే చెప్పినట్లు- ‘ఆట’మలుపు తిరిగింది. జడేజాకి తోడుగా రెహానా రావాలా? అబ్బే! కొత్తముఖాలని పిలిచాడు- తోడేళ్లముందు మేకపిల్లని వేసినట్లుగా వుంది. 72 బంతుల్లో 71 పరుగులు చేయలేక చతికిలబడ్డది ఇండియా- పిటీ! అది రిఛర్డ్‌సన్ బౌలింగ్ ప్రతిభకాదు మన బ్యాట్స్‌మన్‌కి పెవిలియన్ మీద మక్కువ పెరిగి- టపటపా ప్రేలిపోయారు.. ‘్ధనీ ది గ్రేట్ ఫినిషర్’అన్నది ఉత్త‘‘మిత్’’గానే మిగిలింది. అంకెలు, వాస్తవాలు అతని పక్షాన లేవు.
‘బోర్డూ’ రుూ క్రీడని కమ్మర్షియల్‌గా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్న స్పాన్సర్స్, క్రికెట్ సూపర్ స్టార్స్- రుూ ‘త్రయం’ కూడబలుక్కొని- ఇండియన్ క్రికెట్‌ని పతనం దిశగా నడిపిస్తున్నారని క్రిటిక్స్ గోలెడుతున్నారు- ఆడేది దేశ ప్రతిష్ఠకోసం. పైసలెలాగూ కనకవర్షం రూపంలో వస్తూనే వున్నాయ్. కాని, యిలా బంగారంలాంటి అవకాశాన్ని మట్టిపాలు చేసుకుంటారని అభిమానులు అనుకోలేదు. అన్నిరకాల క్రికెట్‌ల లోనూ నిన్నగాకమొన్న నెంబర్‌వన్‌గా ఎంపికయిన స్పిన్ మాంత్రికుడు అశ్విన్‌ని రెండు మ్యాచ్‌లు కూర్చోబెట్టలా??
‘‘మా నాయకుడు’’ చావరా!’’అని ఆజ్ఞాపిస్తే, నేను చచ్చిపోతానంతే. అదీ, ధోనీ మీద నా స్వామిభక్తి. అంతే!’’ అన్న అశ్విన్ పాపం గోళ్లుకొరుక్కుంటూ కూర్చోవలసి వచ్చిందేం? ముమ్మారు వోడిపోయాకా ప్రయోగాలా? ధోనీ ది గ్లామర్ బోయ్ డాషింగ్ డ్రయివర్ వగైరాలు కాదు మనకి కావల్సింది. అలాగే - బౌలర్స్‌ని వెనకేసుకొచ్చిన రవిశాస్ర్తీ చేత గుంజీళ్లు తీయించాలి’-అన్నదో అందాల క్రికెట్ అభిమాని.
మన ‘‘్థంక్ టాంక్’’ తక్షణం తలలు ఏకం చేసుకుని సమీక్షించాలి.
ఇట్స్ ధోనీ హూ ఫాల్టర్డ్ ఆల్ ద వే!