తెలంగాణ

బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను వెంటనే చేర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. గత 45 ఏళ్లుగా బీసీ జాబితాలో ఉన్న శెట్టి బలిజ, గవర, తూర్పుకారు, కొప్పుల వెలమ, గాజుల బలిజ, నాగావంశ, దేవాంగ, పొలినాటి వెలమ, కళింగ, అరవ, బైరీ వైశ్య, నాగ వడ్డీ తదితర కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించడంతో ఆయా కులాల వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బీసీ హోదాను కోల్పోవడంతో ప్రభుత్వం నుంచి అందుకోవాల్సిన సంక్షేమ పథకాలకు దూరమై వారు విద్య, ఉద్యోగాల్లో అన్యాయాలకు గురి కావాల్సి వస్తుందని వివరించారు. కేంద్ర జాబితాలో బీసీలుగా ఉద్యోగాలు పొందుతున్న వారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని దుస్థితి నెలకొందన్నారు. చివరకు విద్యా సంస్థల్లో సైతం అడ్మిషన్లు పొందలేక చదువుకు దూరం అవుతున్నారని, ఇది సహజ న్యాయ సూత్రాలకు పూర్తి విరుద్దమని అన్నారు. ఒకే కుటుంబంలో ఉన్న వారు తెలంగాణ ఏర్పడక ముందు బీసీ కోటా క్రింద లబ్దిపొందితే ప్రస్తుతం ఆ అవకాశం లేకుండా పోయిందని వివరించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్న నేపథ్యంలో ఆయా కుటుంబాల భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. ఏదైనా కులాలను జాబితాలో తొలగించాలన్న, చేర్చాలన్న బీసీ కమిషన్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా ప్రభుత్వం కక్ష్యపూరితంగా బీసీ కమిషన్ సిఫార్సులను తీసుకోకుండానే తొలగించిందన్నారు. ఇటీవల ఈ అంశంపై నిర్వహించిన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల, పార్లమెంట్ సభ్యుల సమావేశంలో ఈ కులాలను తిరిగి బీసీ జాబితాలో కలపాలని ఏకగ్రీవంగా తీర్మానించాయని, 70 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారిని ప్రాంతీయ బేదం చూపుతూ బీసీ జాబితా నుంచి తొలగిస్తూ జారీ చేసిన జీ ఓ ను ఉపసంహరించుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.