ఆంధ్రప్రదేశ్‌

5న ఢిల్లీలో ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మార్చి 5 నుంచి పార్లమెంట్ సమావేశాల్లో ప్రణాళికాబద్ధంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అప్పటికీ కేంద్రం దిగిరాకుంటే ఏప్రిల్ 6న వైకాపా ఎంపీలు రాజీనామాలు చేస్తారని హెచ్చరించారు. మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి బహిరంగ సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా విభజనలో నష్టపోయిన రాష్ట్రానికి సంజీవని అన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు చెబుతున్నారని, మరి నాలుగేళ్ల బాబు పాలనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే పెట్రోలు, డీజల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. నాలుగేళ్ల క్రితం బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు, కిరోసిన్ రూ.18లకే రేషన్ షాపుల ద్వారా ఇచ్చేవారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ లేకపోయినా మద్యం బెల్టు దుకాణాలు దర్శనమిస్తున్నాయని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే బాబు అధికారంలోకి రావాలని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారని, ప్రస్తుతం వ్యవసాయ రుణాలు మాఫీ కాలేదని, బ్యాంకుల్లోని బంగారం ఇంటికి వచ్చిందా? అంటూ రైతుల్ని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి నోటీసులు మాత్రం ఇంటికి వస్తున్నాయన్నారు. రుణమాఫీ సొమ్ము వడ్డీలకు చాలడం లేదని, అమలు చేయలేని వాగ్దానాలతో చంద్రబాబు రైతుల్ని మోసం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎం కాక ముందు రైతులకు వడ్డీ లేని రుణాలు వచ్చేవని, ప్రభుత్వాలు రైతులకు సంబంధించి వడ్డీ సొమ్మును బ్యాంకులకు కట్టేవని, ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని రైతులు వాపోతున్నట్లు పేర్కొన్నారు. పొదుపు సంఘాల మహిళలను చంద్రబాబు మోసం చేశారన్నారు. సంఘాలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. యువతను కూడా బాబు మోసం చేశారని, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలు మెట్టప్రాంతాలనీ, ఈ ప్రాంతాలకు నీరు అవసరమని తపనపడ్డది దివంగత సీఎం వైఎస్సారేనని, ఆయన హయాంలో సోమశిల హైలెవెల్ కాలువ తీసుకురావాలని చెప్పి ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు మేలు జరగుతుందని ఆకాంక్షించారన్నారు. ఈ పనులు పూర్తయితే 90వేల ఎకరాలకు మేలు జరిగేదన్నారు. టొబాకో బోర్డు బ్యారెల్ రూ.10లక్షలిచ్చి కొనుగోలు చేయాలని, లేకపోతే గిట్టుబాటు ధర కేజీకి రూ.150 ఇచ్చి కొనుగోలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టకముందే ‘మనమే ఎక్కువ సాధించాం’ అని చంద్రబాబు అనడమే కాకుండా ప్రతిపక్షాలకు ఆనాడు సవాల్ విసిరారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారని, ప్యాకేజీ కోసం తన కమీషన్ల కోసం హోదాను చంద్రబాబు అమ్మేశారని జగన్ విరుచుకుపడ్డారు. ప్యాకేజీకంటే హోదావల్ల జరిగే మేలు ఏంటని ఆనాడు చంద్రబాబుని తాను ప్రశ్నించినట్లు జగన్ తెలిపారు. బహిరంగ సభకు జిల్లాలో గత పక్షం రోజులుగా జరుగుతున్న సభల కంటే ఎక్కువగా భారీ సంఖ్యలో జనం హాజరుకావడం విశేషం. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, ఉదయగిరి ఇన్‌చార్జ్ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
chitram...
కలిగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న వైకాపా అధ్యక్షుడు జగన్