తెలంగాణ

తరగని కృషి మనది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖనిజ తవ్వకాల్లో భారత్ ముందంజ అనే్వషణకు త్వరలో సమగ్ర చట్టం కేంద్ర మంత్రి ఎన్‌ఎస్ తోమర్ ప్రకటన
ప్రారంభమైన మైనింగ్ కాంగ్రెస్ పెద్దఎత్తున పారిశ్రామికవేత్తల హాజరు ఐటీ సరే.. పారదర్శకత ఏదీ?: గవర్నర్
గనుల పర్యవేక్షణకు డ్రోన్‌లు: కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 14: గనుల తవ్వకాల్లో భారత్ ముందంజలో ఉందని, గనుల కేటాయింపు, తవ్వకాలు, నిర్వహణ, పర్యవేక్షణ అంశాల్లో పూర్తిగా పారదర్శకతను తీసుకువచ్చామని దీంతో రాష్ట్రాలకూ కేంద్రానికి ఆదాయం పెరిగిందని కేంద్ర గనుల మంత్రి నరేందర్ సింగ్ తోమర్ చెప్పారు. అత్యాధునిక పరికరాలను వినియోగిస్తూ పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా గనుల తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. ఖనిజాల అనే్వషణను మరింత కట్టుదిట్టం చేసేందుకు సమగ్ర చట్టాన్ని తెస్తున్నామని పేర్కొన్నారు. మైనింగ్ జరిగే ప్రాంతాల అభివృద్ధికి జిల్లా మైనింగ్ ప్రాంతాల అభివృద్ధి నిధి కింద 13,600 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. 1.80 లక్షల కోట్ల విలువైన గనుల వేలం వేస్తే వాటి ద్వారా 1.35 లక్షల కోట్ల ఆదాయం లభించిందని ఆయన చెప్పారు. నాలుగు రోజుల పాటు జరిగే మైనింగ్ టుడే-2018 అంతర్జాతీయ సదస్సును బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రి తోమర్ హైటెక్స్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, రాష్ట్ర ఐటి మంత్రి కె తారకరామారావుతో పాటు ఫిక్కీ, మైనింగ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, కేంద్ర గనుల శాఖ అధికారులు, దేశ విదేశాల నుండి పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ మైనింగ్ రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. దేశ జీడీపీలో మైనింగ్‌దే అగ్రస్థానమని అన్నారు. ఎక్కువ ఖనిజాలున్న చోట పేదరికం కూడా ఉందని, వారిని ఆదుకోవల్సి ఉందని చెప్పారు. ఈ అసమానతలను తొలగించాల్సిన అవసరముందని తోమర్ పేర్కొన్నారు. మైనింగ్ శాఖ 2014 నుండి పారదర్శకంగా పనిచేస్తోందని, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మైనింగ్ తవ్వకాల్లో ఎలాంటి సమస్య వచ్చినా కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. కేంద్ర రాష్ట్రాలు కలిపి మైనింగ్ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. తెలంగాణలో ఉన్న ఖనిజ సంపద వివరాలతో గనులు, భూగర్భ వనరుల శాఖ ప్రత్యేకంగా రూపొందించిన నివేదికను సదస్సులో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆవిష్కరించారు.
ఐటీ సరే, పారదర్శకత ఏదీ?: గవర్నర్
ఈ సందర్భంగా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మాట్లాడుతూ టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుతున్నా, అందులో పారదర్శకత లోపిస్తోందని, అన్ని వివరాలూ దేశ ప్రజలు తెలుసుకునేలా అందుబాటులో ఉంచాలని అన్నారు. మైనింగ్‌లో పనిచేసే వారి ఆరోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మైనింగ్ వల్ల ప్రభావితం అయ్యే గ్రామాల్లోని ప్రజలకు సరైన పరిహారం ఇవ్వాలని, ఎవరెవరికి ఎంత పరిహారం ఇచ్చామో, అందరూ తెలుసుకునేలా ఆ వివరాలను మైనింగ్ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచాలని అన్నారు. మైనింగ్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా చూడాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మాదిరి మైనింగ్ రంగంలో టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు.
గనుల పర్యవేక్షణకు ద్రోణులు: కేటీఆర్
దక్షిణ భారతదేశంలోనే తెలంగాణలో బొగ్గు గనులు ఎక్కువగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. గనుల అక్రమాల పర్యవేక్షణకు ద్రోణులను వినియోగిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం గనుల రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ చెప్పారు. ఖనిజాల అనే్వషణ, తవ్వకాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలోనూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణలో గ్రానైట్ గనులు ఉన్నాయని, గ్రానైట్ పరిశ్రమ వృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణలో అత్యుత్తమ శాండ్ పాలసీని తీసుకువచ్చామని, కొత్త ఇసుక విధానం ద్వారా పర్యావరణాన్ని కాపాడుతున్నామని అన్నారు. అవసరమైన వారికి తక్షణమే ఇసుక అందేలా శాండ్ టాక్సీలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. టిఎస్‌ఐపాస్ ద్వారా మైనింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, గనుల్లో కార్మికుల రక్షణకు కొత్త టెక్నాలజీ వినియోగిస్తున్నామని వివరించారు. అంతకుముందు మైనింగ్ ఇంజనీర్స్ అధ్యక్షుడు ఎ కె కొఠారీ, ఫిక్కీ డైరెక్టర్ జనరల్ దిలీప్, సదస్సు చైర్‌పర్సన్ సుశీల్‌కుమార్, కేంద్ర గనుల కార్యదర్శి అరుణ్‌కుమార్, తెలంగాణ ఐటి కార్యదర్శి జయేష్‌రంజన్, టిఎస్‌ఎండిసి చైర్మన్ ఎస్ సుభాష్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.
chitram...
హైటెక్స్‌లో ప్రారంభమైన మైనింగ్ టు డే-2018 అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నరేందర్ సింగ్ తోమర్