కృష్ణ

వేసవిలో గొంతు ఎండనివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 14: రానున్న వేసవి సీజన్‌లో మైలవరం పట్టణంతోపాటు గ్రామాలలో మంచినీటి ఎద్దడి నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీపీ బాణావతు లక్ష్మి సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడికి ఇప్పటి నుండే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మైలవరం పట్టణంలో ఇటీవల కాలంలో అవకాశం ఉన్నంత వరకూ తాగునీటి సరఫరాను పెంచటం జరిగిందని, పైప్‌లైన్‌లు వేయటం జరిగిందని, ప్రజల నిర్లక్ష్యం కారణంగా కొన్ని వార్డులలో తాగునీరు వృధా అవుతోందన్నారు. పంపులను వదిలి వేసి నీటి వృధాకు కారణమవుతున్నారని అన్నారు. పంచాయితీ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా గ్రామాలలో మంచినీటి ఎద్దడి రాకుండా ప్రజాప్రతినిధులు, గ్రామకార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపిడిఓ శ్రీనాధ్ స్వామి మాట్లాడుతూ ప్రాధాన్యతాక్రమంలో మండలంలోని పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించటం జరుగుతుందన్నారు. ఇప్పటికే మండలం అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందన్నారు. మండల స్పెషలాఫీసర్ ప్రభాకరరావు మాట్లాడుతూ ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకుని నీరు, చెట్టు పధకం మళ్ళీ ప్రారంభమైందని, అధికారులు, ప్రజాప్రతినిధులు నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఇంకుడుగుంతలు తవ్వాలని, చెరువుపూడిక తీత, జలసంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో పనికి ఆహార పధకం కింద ముమ్మరంగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంకా ఈకార్యక్రమంలో జడ్పీటిసి దొండపాటి రాము, వైఎస్ ఎంపిపి ఇనుగంటి శోభన్‌బాబు, వ్యవసాయాధికారి రంగారావు, ఉద్యానవనాధికారి ఎన్ అశోక్, సూపరింటెండెంట్ రవిశంకర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.