Others

ధోరణే మారాల్సింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి స్ర్తిల్లో చాలామంది చదువు, ఉద్యోగం ఆ తరువాత పెళ్లి వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ పెళ్లి కూడా అయిపోయింది అనుకోండి ఇక జీవితం లోని ప్రముఖ ఘట్టాలన్నీ అయిపోయాయి అనుకొని హాయిగా రోజూ ఆఫీసుకు వెళ్లడం సాయంత్రమో లేక రాత్రో రావడం తినడం పడుకోవడం అసలు మాకు టైము ఎక్కడ ఉంది అనేస్తారు. ఎవరైనా ఏదైనా అడిగిన వెంటనే.
మరికొందరున్నారు. వారు ఉద్యోగం చేయకుండా గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తుంటారు. వారు కూడా వారి భర్తలకు, పిల్లలకు వండి పెట్టడం టీవీ సీరియల్స్ చూడడం లాంటివి చూస్తూ అలసిపోయాము. ఇంకా ఎంత చేస్తాం అనేస్తారు.
ఇలా గైతే గొప్పవారు అయ్యేదెలా చాలామంది అగ్రస్థానానికి వెళ్లిన స్ర్తిలు ఉన్నారు. ఏ రంగంలో చూసినా వారు ఉన్నత స్థానానికి వెళ్లినవారున్నారు. మరి వాళ్లు వీళ్లు చేస్తున్న పనులు చేస్తూనే కదా అవి చేసారు.
కనుక నేటి మహిమామణులంతా ఒక్కసారి ఆలోచించండి. మనకు ఈ జన్మ వచ్చింది కేవలం సాధారణమైన పనులు చేయడానికేనా?
కాదుకదా
పరిధులు దాటి పరిపక్వతకై పాటుపడాలి. మగువన్నాక ఏదో ఒక సృజనాత్మకత అంతర్లీనంగా నిక్షిప్తమై వుండే వుంటుంది. ఆసక్తులవల్ల అభిరుచులవల్ల బహిర్గతమవుతుంది. అందుకే అభిరుచి పెంచుకోవాలి. ఆసక్తి చూపాలి. నచ్చిందే ఎన్నుకొని మెచ్చినదాంట్లోనే మిన్నగా ఎదగడానికి కృషిచేయాలి. దేన్నైనా చాలెంజ్‌గా తీసుకొని చరిత్ర సృష్టించవచ్చు. మొదట అప్యాయత పంచినా అదిమిమ్మల్ను అందరిలో ప్రత్యేకంగానే నిలబెడుతుంది.
వృక్షాలన్నీ కాయలు,పండ్లు, ఆకులు, కొమ్మలు, వేర్లు ఇవే కాదు ఆఖరికి చెట్టు ఎండిపోయినా వాటి కాండంతో అంటే కొన్నింటినే అనుకోండి గృహ నిర్మాణానికి కూడా వాడుతున్నారు. అదికాకపోతే వంటచెరుకుగా వాడుతారు. ఇలా జీవితపు చివరి నిముషం వరకు పరుల సేవకోసమే తమ జీవితాన్ని వ్యయం చేస్తున్నాయి. గాలి, నీరు ఇవి అన్నీ కూడా పరుల కోసమే ఉన్నాయి.
మరి మనుషులుగా పుట్టిన మనం మాత్రం కేవలం మన కడుపు నిండడానికే పని చేస్తామా. మహాఅయితే మనకు పుట్టిన పిల్లలకోసం శ్రమిస్తాం. ఈ మధ్య అయితే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ మరింత కుంచించుకుని పోయి చుట్టాలను కూడా బరువుగా తలుస్తున్నారు. తల్లీదండ్రులను కూడా బరువుఅనుకొనేవారు ఈ సమాజంలో ఎక్కువగానే ఉన్నారు.
ఈ ధోరణి మారాల్సిందే కదా. మన భారతదేశం అతిథిదేవో భవా వాకిట తిథి వార నక్షత్రాలు లేకుండా ఆకలితో వచ్చినవారిని కూడా భగవంతునిలాగా చూడమని చెప్పింది. మరి అట్లాంటపుడు ఈ వృద్ధాశ్రమాలు , అనాథాశ్రమాలు ఎందుకు మనం వృద్ధి చేయాలి ఒక్కసారి ఆలోచించండి. మనలో ఒకరిగా ఉంటే వృద్ధులైనా అనాథలైనా ఒంటరిగా బతకాల్సిన అవసరం వారికి ఎందుకు వస్తుంది. కాలగమనంలో ఒంటరిగా మిగిలిపోయినా వారినీ అక్కున చేర్చుకుని మీకు మేమున్నాం అనే ఆపన్నహస్తం మనం ఇవ్వలేమా?

- నిర్మల