మంచి మాట

జానపద కళారూపం వీధి నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడుపు నిండిన మనిషి మానసికానందం కోసం వెంపర్లాడాడు. ప్రకృతి వైపు పరవశించి చూశాడు. గాలికి ఆకు కదిలితే తాను తన చేయిని కదిలించాడు. గాలికి ఎండుటాకు గలగలమంటే తన గళాన్ని సరిచేసుకొని దాన్ని అనుసరించాడు. ఇలా చేస్తూ చేస్తూ మాట్లాడడం తన పూర్వీకులు గురించి తెలుసుకొన్నాడు. తాను అబ్బురం చెందాడు. తనవారు ఎంత గొప్పవారో తన ముందు తరాల వారికి చెబుదామనుకొన్నాడు. సాహిత్యవేదిక తయారు చేశాడు. సాహిత్య ప్రక్రియలెన్నింటినో వెలికి తీశాడు. పూర్వ చరిత్రనంతా వివిధ మార్గాలద్వారా భద్రం చేశాడు.
అందులో ఒకటి ఈ వీధినాటకం. టీవీలు రేడియో అంతగా ప్రాచుర్యం పొందక ముందే వీధినాటకమే వినోద వస్తువు.
తన జాతి ఔన్నత్యాన్ని పెంచే రామాయణ భారత భాగవతాలను పౌరాణిక సన్నివేశాలను ఇప్పుడు కనుల ముందు జరుగుతున్నట్టుగా చేయడానికి నాటకం ఆరంభించాడు. మైకులు కూడ లేనికాలంలో రాత్రిళ్లు వూళ్లల్లో ఉండే దిప్పలనే రంగస్థల వేదికల్లా చేసుకొని ఆ పురాణ ఘట్టాలను నాటకంగా వేయడం ఆరంభించారు. ఒక్కోసారి ఒక్కో నాటకం రాత్రంతా కూడా సాగేది. అలసిన రైతుకు ఆహ్లాదాన్ని కలిగించడానికి అనువైన మార్గం నాటకమే. అట్లా వీధుల్లో వేసే నాటకం కనుక దాన్ని వీధి నాటకం అన్నారు. ఈ వీధినాటకాల్లో పద్యాలు రసరమ్యంగా పాడేవారిని ఒన్స్ మోర్ అంటూ మళ్లీ మళ్లీ పాడించుకునేవారు. ముందుకాలంలో స్ర్తి వేషాలు కూడా పురుషులే వేసేవారు. కాలం తో నాటకమూ మారింది. ఇపుడు అనువైన రంగస్థలాలున్నాయి. నాటకం వేసేందుకు సంస్థలూ ఉన్నాయి. నటులూ స్ర్తి నటీమణులు కూడా తయారు అయ్యారు. కాకపోతే ప్రేక్షకులే కరువయ్యారు. వారికి వినోదం కేవలం వెండితెర అదీ లేదంటే బుల్లితెరే. అందుకే ఈ తెరల వాళ్లు ఈ జానపద కళారూపాలను అందులోకి చొప్పించి ఆ కళాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అపుడే ఆ జానపద అపురూప కళలను భద్రంగా ఉంటాయి.