జాతీయ వార్తలు

మాది తిరుగులేని నిబద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: పర్యావరణ సమతూకాన్ని పరిరక్షించేందుకు ఆ విధంగా వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు భారతదేశం నిబద్ధతాయుతంగా కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అయితే, ఇందుకు బాధ్యులైన ఇతర దేశాలు కూడా తమవంతు కర్తవ్యాన్ని నిష్పాక్షికంగా నిర్వహించగలిగితే భావితరాలకు సమతుల్యతో కూడిన పర్యావరణాన్ని అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్యారిస్‌లో జరిగిన పర్యావరణ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న దేశాలు తమ హామీలను నిలబెట్టుకోవాలని, భూగోళం ప్రతికూల పర్యావరణ పరిస్థితులకు గురికాకుండా పర్యవేక్షించుకునేందుకు ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లోనూ ప్రగతిని సాధించాలన్న పట్టుదల భారత్‌కు ఉన్నప్పటికీ, దాని కారణంగా పర్యావరణ సమతూకానికి ఎలాంటి విఘాతం కలగకూడదన్న దృఢసంకల్పంతో ఉందని మోదీ తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ప్రపంచ సుస్థిర శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన మోదీ పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన ఐఎన్‌డీసీ లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించగలిగితే పర్యావరణ న్యాయం, సమానత్వం సుసాధ్యమవుతాయని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. ఈ విషయంలో భారత్ తన బాధ్యతను లోపరహితంగా నిర్వర్తిస్తోందని, ఇతర దేశాలు కూడా ఇదే తరహాలో వ్యవహరించాలని ఆశిస్తోందనీ వెల్లడించారు. తన ప్రసంగంలో ఏ దేశం పేరునూ ప్రస్తావించని మోదీ పర్యావరణ ప్రతికూల మార్పుల నిరోధన అందరి బాధ్యత అని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ ప్రవచనాలను ఉటంకించిన మోదీ ఈ సృష్టిలో ప్రతి సంపద ప్రకృతిదే, ఆ భగవంతుడిదేనని, ఈ భూమీదున్న ప్రతి ఒక్కరూ ఆ సంపదకు సంరక్షకులేనని తెలిపారు. ప్రకృతి వనరుల పరిరక్షణ సిద్ధాంతాన్ని మహాత్ముడు చాలా బలంగానే చాటి చెప్పారని పేర్కొన్న మోదీ, భూగోళాన్ని సురక్షితంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. మనిషి -ప్రకృతి మధ్య సహజీవన సంప్రదాయం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని తెలిపిన మోదీ, జల వనరులు హరించుకుపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సృష్టిలో ప్రతి జీవికీ నీటి అవసరం ఎంతో ఉందన్న ఆయన, నీరే కొరవడితే తిండి గింజలే అందవని హెచ్చరించారు. దేశంలోని ప్రతి ఇంటికీ విద్యుత్‌ను అందించేందుకు తమప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పట్టణీకరణ పెరిగిపోతుందన్న అంశాన్ని ప్రస్తావించిన మోదీ, ఈ డిమాండ్ తట్టుకోవడానికి రవాణా అవసరాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. దీని దృష్ట్యానే తమ ప్రభుత్వం మెట్రో వ్యవస్థను విస్తరిస్తోందన్నారు. ఈ శిఖరాగ్ర సదస్సులో దాదాపు 2వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో వర్దమాన ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలన్న దానిపై ఈ సదస్సు చర్చిస్తుంది.