జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా గట్టి భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: గణతంత్ర వేడుకలకు యావద్భారతం సన్నద్ధమైంది. ఐసిస్ హెచ్చరికల నేపథ్యంలో భద్రతాపరంగా ఎలాంటి లోపాలకు తావులేకుండా విస్తృతస్థాయి నిఘా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీపై భద్రతా దళాలు డేగకన్ను వేశాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ ముఖ్య అతిధిగా హాజరవుతున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను కనీవినీ ఎరుగని రీతిలో ముమ్మరం చేశారు. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని నగరం నిఘా నీడలోనే ఉంది. ఇప్పటికే పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన మిలిటెంట్లు ఢిల్లీలో ప్రవేశించారన్న హెచ్చరికలతో నిఘా, పోలీసు వర్గాలు మరింతగా అప్రమత్తమయ్యాయి. గణతంత్ర వేడుకలకు కేంద్రమైన రాజ్‌పథ్ చుట్టుపక్కల ఉన్న 71 ఆకాశ హర్మ్యాలను మంగళవారం పాక్షికంగా లేదా పూర్తిగా మూసేసే అవకాశం ఉంది. డ్రోన్ దాడులతో ముప్పు ఉన్నందున ఢిల్లీతోపాటు చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల క్రితం ఇక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఓ యుఎవి కనిపించడంతో ‘డ్రోన్’ దాడులపై దళాలు అప్రమత్తమయ్యాయి. ఇందుకు సంబంధించి సమాచారం ఇచ్చిన వారికి లక్ష రూపాయల పారితోషికం ఇస్తామని గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం భద్రతాపరంగా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. అన్ని కీలక స్థావరాల వద్ద అదనపు బలగాలను మోహరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్ముకాశ్మీర్, హర్యానా సహా అన్ని రాష్ట్రాల్లోనూ, ప్రధాన నగరాల్లోనూ విస్తృతస్థాయి నిఘా కొనసాగుతోంది. అలాగే అన్ని రాష్ట్రాల సరిహద్దుల్లోనూ అదనపు బలగాలను మోహరించారు.