Others

ధ్యాన ప్రజ్ఞోదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రోజు వైశాఖ పూర్ణిమ. ముందు రోజు గౌతముడు అయిదు మహా స్వప్నాలను పొందాడు. తప్పక ఈ రోజు నేను ‘బుద్ధుడను కాగలను’ అని నిశ్చయం పొందాడు. తెల్లవారి బిక్షా సమయం కోసం వేచి ఉన్నాడు.
అభీష్ఠసిద్ధి పొంది పుత్రజననం కల్గిన ఉత్తమ ఇల్లాలు ‘సుజాత’ తన అభీష్ఠాన్ని నెరవేర్చిన ‘దేవతా వృక్షానికి’ అపూర్వమైన నైవేద్యం సమర్పణ చేయాలని నిశ్చయించింది. వారికి వేలాది ఆవులుండేవి. వాటిలో ఉత్తమమైన వేయి ఆవులను ఎన్నుకుని ఆ వేయి ఆవులను ‘మధువనం’లో మేపించింది. ఆ వేయి ఆవుల పాడితో తయారైన ఆహారాన్ని అందులోని అయిదు వందల శ్రేష్ఠమైన ఆవులకు, అయిదు వందల శ్రేష్ఠ గోవుల పాడిలో తయారుచేయించిన ఆహారాన్ని రెండు వందల యాభై అతిశ్రేష్ఠ గోవులకు, రెండు వందల యాభై ఆవుల పాడితో తయారైన ఆహారాన్ని నూట ఇరవై అయిదు ఆవులకు ఇలా మరీ మరీ తాపుతూ చివరికి పదహారు ఆవుల పాడితో తయారైన ఆహారాన్ని కామధేనువులతో సమానమైన ఎనిమిది ఆవులకు పెట్టింది.
పాలు అతి చిక్కవిగానూ, తీపిగానూ, బలకరంగానూ పరిణమించేట్లు క్షీర పరివర్తనం చేసి, ఆ కామధేను సమానమైన అష్ట ఆవుల పాలతో వైశాఖ పూర్ణిమ రోజున వేకువనే లేచి కొత్త బంగారు పాత్రలో స్వయంగా పోసి ‘అమృత సమానం’ అయిన ‘క్షీర పాయసాన్ని’ తయారుచేసింది.
తన పరిచారిక అయిన పూర్ణతో కలిసి, ఆ బంగారు పాయస పాత్రను నెత్తిపై ఉంచుకుని గౌతముడు కూర్చున్న చెట్టు కింద ఉంచింది. ఆ వృక్షం సుజాత పూజించిన దేవతా వృక్షమే. ఆ వృక్షం కింద కూర్చుని ఉన్న గౌతముడిని చూసి ఆయనను వృక్షాధిదేవతగా భావించి తాను తెచ్చిన అమృత సమానమైన పాయస పాత్రను గౌతముడికి అందించింది.
ఆర్యా! మీరు దేవతాసములు. మీకీ అపూర్వ నైవేద్యం సమర్పిస్తున్నాను. యధేచ్ఛగా ఆరగించండి. నాకులాగా మీ ‘ఇష్టార్థప్రాప్తి కూడ సఫలమగుగాక’ అని సప్రమాణంగా పలికి ఆ సువర్ణ పాత్రను అతడి చేతలి ఉంచి తన గృహానికి వెళ్లిపోయింది. బుద్ధుడికి ఆ రోజు ఆహారం సమర్పించిన ఆ సుజాత చరితార్థురాలయింది.
ఆ విధంగా ఆ అమృత నైవేద్యాన్ని స్వీకరించి ఆ ‘వైశాఖ పూర్ణమి’ రోజు సిద్దార్థ గౌతముడు ధ్యానం చేసి మూడు ఝాముల్లో జీవిత కాలపు జ్ఞానాన్ని, వందలాది జన్మల పుణ్యఫలంగా పొంది ‘దివ్య జ్ఞాన ప్రకాశం’ పొందాడు. ఆపై నలభై రెండు సంవత్సరాలపాటు నిరంతర సంచారియై ధ్యాన అహింసా ప్రచారం చేశాడు. అష్టాంగ మార్గాన్ని కనుగొని ఈ ప్రపంచానికి సమర్పించాడు గౌతమ బుద్ధుడు.
ఏదైనా సాధనతోనే సాధ్యం. బుద్ధునికైనా, బ్రహ్మర్షి పత్రీజీకైనా, మీకైనా, నాకైనా మరెవరికైనా. సాధన చేయుమురా నరుడా సాధ్యం కానిది లేదురా అన్నాడు తుకారాం. సాధనతో సమకూరు పనులు ధరణిలోన అని చెప్పారు యోగి వేమన.
‘్ధ్యన సాధన’ అనేది మనలోకి మనం చేసే ప్రయాణం. బయటచేసే ప్రయాణం గురించి బయటి వారినడిగి మార్గం తెలుసుకుని ప్రయాణించాలి. ‘్ధ్యనం’ అంటే లోపల చేసే ప్రయాణం కనుక ‘లోపల వున్నవాడిని’ అడగాలి. లోపల ఉన్న మన ప్రాణశక్తి అంటే మన ప్రాణాధార శ్వాస... కచ్చితంగా బయటి నుండి లోపలకి.. నిశ్వాస లోపలి నుండి బయటకు వస్తోందనీ మనకు తెలుసు.
‘మన శ్వాసే మన గురువు’ - మన శ్వాస అనే మన గురువుని పట్టుకుని, ఈ వర్తమాన జన్మలో, దినచర్యలో భాగంగా రోజూ రెండుసార్లు లేదా కనీసం ఒక్కసారి దీక్షాయుతంగా ధ్యానాభ్యాసం చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.

(బ్రహ్మర్షి పత్రీజీ ప్రవచనాల సంకలనం మరియు శ్రీ బుద్ధ చర్య గ్రంథ సౌజన్యం)

-మారం శివప్రసాద్