హైదరాబాద్

బిఎస్సీ ఫారెస్ట్రీకీ ఎమ్సెట్ రాయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. బీఎస్సీ (్ఫరెస్ట్రీ) కోర్సుకు ఎంసెట్ పరీక్షను తప్పని సరి చేస్తూ నిబంధనలను సవరించింది. దీంతో ఇంజనీరింగ్, మెడికల్, వెటర్నిటీ కోర్సుల్లో చేరేవారు ఏవిధంగానైతే ఎంసెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుందో అదేవిధంగా ఫారెస్ట్రీ కోర్సులో చేరేవారూ అర్హత సాధించాల్సి ఉంటుంది. ధరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆ సంవత్సరం డిసెంబర్ నెలఖరుకు 17 ఏళ్లు పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. జనరల్, బీసీ విద్యార్థులకు గరిష్ట వయో పరిమితి 22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లుగా నిర్థారించారు. అదేవిధంగా జనరల్, బీసీ విద్యార్థులు ఇంటర్‌లో 45శాతం మార్కులు కలిగి ఉండాలని, ఎస్సీ, ఎస్టీలు 40శాతం మార్కులు కలిగి ఉండాలని నిబంధన విధించారు.