రంగారెడ్డి

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 24: పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్థాపంతో ఓ బీ-టెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్ల, రాంరెడ్డినగర్‌లో నివాసముండే కే.బాల్‌రాజ్ వ్యాపారస్థుడు. బాల్‌రాజ్ కుమారుడు కే.మణిదీప్‌కుమార్ (19) దుందిగల్‌లోని మర్రిలక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీ-టెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 23న సాయంత్రం 4.30 గంటలకు బీ-టెక్ ఫలితాలు వచ్చాయి. ఆరు సబ్జెక్ట్‌లలో మూడు సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయ్యాడు. మనస్థాపానికి గురైన మణిదీప్‌కుమార్ శుక్రవారం రాత్రి వరకు బాగానే ఉన్నాడు. ఆ తరువాత కనిపించకుండా పోయాడు. దీంతో చుట్టుపక్కల తల్లిదండ్రులు వెతకగా జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ కట్టపై మణిదీప్ బైక్ దొరికింది. తూము పక్కన చెప్పులు వదిలేసి కనిపించాయి. చెరువులో వెతకగా మణిదీప్ మృతదేహం లభించింది. ఫాక్స్‌సాగర్ చెరువులో మణిదీప్ దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దైవచింతనతోనే మానసిక ప్రశాంతత
షాద్‌నగర్, ఫిబ్రవరి 24: దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరు దైవభక్తి కలిగి ఉండాలని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూర్ గ్రామంలో నూతనంగా శ్రీ హనుమాన్, శివలింగం, ధ్వజస్థంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎంపీ జితేందర్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ ముఖ్యఅతిధిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఇరువురిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంతో పరుగులు తీస్తున్న ప్రజలకు మానసిక ప్రశాంతత అనేది లేకుండా పోయిందని, ప్రతి ఒక్కరు దైవభక్తి కలిగి ఉన్నప్పుడే మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ప్రతిరోజు సమీపంలో ఉన్న దేవాలయాలకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే దైవానుగ్రహం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే దైవానుగ్రహం లభిస్తుందని అన్నారు. న్కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత వీర్లపల్లి శంకర్, ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షుడు పి.వెంకట్‌రాంరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, సర్పంచ్ జ్యోతిరంగయ్యగౌడ్, ఎంపీటీసీ సభ్యురాలు పి.రజితవెంకట్‌రాంరెడ్డి, గ్రామస్తులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బతుకుతెరువు కోసం వస్తే .. గెంటేస్తారా?
20 కుటుంబాల ఆవేదన
శంషాబాద్, ఫిబ్రవరి 24 గత ఇరవై సంవత్సరాల క్రితం వివిధ జిల్లాల నుంచి పొట్ట కూటి కోసం మండల పరిధిలోని పాల్మాకుల గ్రామ సమీపంలో వుంటూ కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నామని మాకు ఓటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వున్న మాపై కొందరూ వ్యక్తుల వత్తిడి మేరకు రెవెన్యూ అధికారులు శనివారం గుడిసెలను తొలగించారని ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన కొందరు పెద్దలు ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలంలో గుడిసెలు వేసుకొమని చెప్పడంతో అట్టి స్థలంలో గుడిసెలు వేసుకుని వున్నామని బాధితులు అండాలు, యాదయ్య, అనిత, పార్వతమ్మతో పాటు ఇరవై కుటుంబాలు తమ ఆవేదన వెల్లబోసుకున్నారు. గత మూడు రోజులుగా అదే గ్రామానికి చెందిన అరేందర్‌గౌడ్, కోటీ కలిసి గుడిసెలను కుల్చివేస్తూ.. బూతు మాటాలు తిట్టారని మీడియాతో కంటతడి పెట్టారు. వీరి వత్తిడి మేరకే మమ్మల్ని రెవెన్యూ అధికారులు వచ్చి గుడిసెలు తొలిగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సర్పంచ్ సరిత రవినాయక్‌లు మాకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. గత ఇరవై ఏళ్ల క్రితం నుంచి వీరూ గ్రామ సమీపంలో వున్న మాట వాస్తవమే. వీరికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు వున్నాయి. అలాంటి కూలీలపై కక్ష సాధించడం దారుణమని ఈ విషయాన్ని ఎమ్మె ల్యే దృష్టికి తీసుకువెల్లి న్యాయం చేస్తానని టీఆర్‌ఎస్ సీనియర్ నేత గూడల కృష్ణగౌడ్ అన్నారు.
నర్సరీలను పరిశీలించిన
డీఆర్‌డీఏ పీడీ
మేడ్చల్, ఫిబ్రవరి 24: జిల్లా గ్రామిణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) పీడీ కౌటిల్యరెడ్డి శనివారం మేడ్చల్ మండలంలోని బర్మాజిగూడ, మైసిరెడ్డిపల్లి, కొణాయిపల్లి గ్రామాలలోని నర్సరీలను పరిశీలించారు. హరితహారంలో భాగంగా నాటే మొక్కలను ఈ యేడాది ప్రైవేట్ నర్సరీల నుంచి కాకుండా నేరుగా ప్రభుత్వమే తయారు చేసే విధం గా చర్యలు చేపట్టినట్లు పీడీ పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లాకు 32 లక్షల టేకు మొక్కలు నాటే విధంగా ప్రణాళిక రూపొందించినట్టు వివరించారు. మేడ్చల్ మండలానికి మూడు లక్షల టేకు మొక్కలు తయారు చేస్తామన్నారు. జిల్లాలో ఏ మండలంలో తయారు చేసే మొక్కలను ఆ మండలానికే ఉపయోగిస్తామని పీడీ స్పష్టం చేశారు. టేకు మొక్కలు నాటేందుకు రైతులు అసక్తి చూపుతున్నందున నర్సరీల్లో పెద్ద సంఖ్యలో టేకు మొక్కలనే సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అవసరమైతే వేరే జిల్లాలకు కూడా అందిస్తామని పేర్కొన్నారు. పీడీ ఈ సందర్భంగా ఉపాధిహమీ కూలీలతో మాట్లాడారు. తమకు నాలుగు నెలలుగా డబ్బులు రావడం లేదని కూలీలు పీడీ ఎదుట వాపోయారు. కూలీల ఖాతాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో సాంకేతిక ఇబ్బందులతోనే డబ్బులు రాలేదని, త్వరలోనే తప్పకుండా అందరికి డబ్బులు వస్తాయని కూలీలకు నచ్చజెప్పారు. ఎంపీడీఓ దేవసహాయం, ఈఓపీఆర్డీ రమేశ్, స్థానిక సర్పంచ్ రాజమల్లారెడ్డి పాల్గొన్నారు.