Others

ముప్పు తెచ్చిన అహంకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని సంపదలు, పదవులు, విద్యా సంపద, ధనం, హోదాలు ఎలా ఏవి ఉన్నా అహంకారం ఎప్పుడూ పనిచేయదు. తామే గొప్ప అనుకోవడం ఇతరులని తక్కువగా అంచనా వేయడం చిన్నచూపు చూడడం తగదు. అది అహంకారులకే ముప్పు. అందుకు నిదర్శనంగా మనకు అత్యంత భక్తుపరుడు, సంగీత విద్వాంసుడు, తాండవకృష్ణమాచార్యులు కథ తేటతెల్లం చేస్తుంది.
తాండవ కృష్ణమాచార్యులు సింహాచలం శ్రీనృసింహస్వామిని నిత్యం దర్శించి సంగీతంతో కీర్తనలు ఆలపించడంతో శ్రీనృసింహస్వామివారు పారవశ్యంతో నృత్యం చేస్తూ ఉండేవారు. ఎంతో సంతోషించిన తాండవ కృష్ణమాచార్యులలో తన సంగీతానికి స్వామివారే నృత్యత చేస్తున్నారనే అహం, తనలో గొప్పతనం పెరిగింది. ఇది ఇలా ఉండగా ఒకసారి శ్రీరామానుజులవారు బృందంతో కలిసి శ్రీస్వామివారి దర్శనానికి వచ్చారు. అందరూ ఆయనకి నమస్కరించి స్వాగత సత్కారాలు చేసి రామానుజులవారి ఆశీర్వాదం పొందుతున్నారు. అక్కడే ఉన్న తాండవ కృష్ణమాచార్యులు నేను ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటి? నా నృత్యానికి నరసింహుడే ప్రత్యక్షం అయ్యి నాట్యం చేస్తుంటే అని స్వగతంలో అనుకొని రామానుజులు వారిని కలవలేదు. సర్వజ్ఞులు అయిన రామానుజులే తాండవకృష్ణమాచార్యుల వద్దకి వచ్చి నమస్కరించి యతిరామానుజుల వారు వచ్చారని ఆయనకు మోక్షం వస్తుందోరాదో తెల్సుకొని రేపు చెప్పు అని రామానుజుల వారు వెళ్లిపోయారు. ఎప్పటిలాగే తాండవ కృష్ణమాచార్యులు సంగీత కీర్తనలు ఆలపిస్తూ శ్రీనృసింహస్వామి నృత్యం తిలకించాక స్వామీ నిన్న ఆయనెవరో యతిట రామానుజులవారట.
వారికి మోక్షం వస్తుందో రాదో మిమ్మల్ని అడిగి తెలుసుకుని చెప్పమన్నారు. రామానుజులవారికి మోక్షం వస్తుందంటారా? అని అడిగాడు తాండవకృష్ణమాచార్యులు. శ్రీస్వామివారు చిరునవ్వు నవ్వి ఎవరికి మోక్షం ఇవ్వాలో, అక్కర్లేదో గురువులైన ఆ రామానుజవారికి ఎప్పుడో ఇచ్చేసాను అనడంతో తాండవ నివ్వెరపోయాడు. మరుచటి రోజు ఆలయానికి వచ్చిన రామానుజులవారి చెంతకి తాండవ కృష్ణమాచార్యులే చేరి పాదాభివందనం చేసి విషయం చెప్పి గురుతుల్యులైన మిమ్మల్ని అహంతో చిన్నచూపు చూశాను క్షమించమని వేడుకున్నాడట.
శ్రీరామానుజులవారు తాండవ కృష్ణమాచార్యుల్ని దగ్గరికి తీసుకుని ఎన్ని విద్యలున్నా అహంకారం ఎప్పుడూ చేటే తెస్తుందని విశే్లషించి వివరించడంతో కృష్ణమాచార్యులు తన తప్పు తెల్సుకొని ప్రవర్తన మార్చుకున్నారు.

-డి.యస్.మూర్తి