భక్తి కథలు

సర్వకాలాల్లోనూ సమవర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవులు మననశీలురు. ఆలోచించి చక్కగా విచారించి కార్యాన్ని సాధించడమే మానవుని సహజ స్వభావ గుణంగా ఉండాలి. దానాది ధర్మ కార్యాలతో పేదలకూ, దీనులకు, దుఃఖితులకు సాయపడాలి. మంచి జ్ఞానం- సుచరిత్ర- సుశీలంతో నీతివంతమైన జీవనం సాగించాలి. ధైర్యాన్ని ధరించి సత్యభాషణా ధర్మాచరణను పాటించాలి. మానవులు తమ కోసం జీవించడం విశేషం కాదు. పరుల కోసం జీవించడమే శ్లాఘనీయం. ప్రశంసనీయం. ఇతరులకు మేలు చేయడంలోనే ఆనంద ముందని గమనించాలి. మంచి గ్రంథాలను చదువుతూ, మహనీయుల-త్యాగమూర్తుల చరిత్రలను పరిశీలించాలి. ధార్మిక గ్రంథాలను చదవాలి.
కఠోపనిషత్తులో ‘ఉత్తిష్ఠ-జాగ్రత-ప్రాప్యవరాన్ని బోధిత’ అనగా లెమ్ము- మేల్కొనుము. మంచి వారివద్దకేగి జ్ఞానము నార్జింపుమని సందేశమిచ్చింది. దాన్ని స్మరించుకోవాలి. ఆర్య చాణక్యుడు తన నీతి సందేశంలో మనుష్యుల ధర్మాన్ని పేర్కొన్నాడు. మనుష్యుడంటే దానశీలి, శీలసంపన్నుడు- సుగుణ భూషణుడు, సదాచార సంపన్నుడని తెలిపినాడు. ధర్మాత్ములు అనాథలు, నిర్బలులను రక్షించు వాడనీ, సత్యం, న్యాయం, ధర్మం కొరకు ప్రాణత్యాగానికైనా వెఱువడనీ అన్నాడు. అతడే నిజమైన మనుష్యుడని అన్నాడు.
ఋగ్వేదంలో ‘‘మినుర్భవ జనయా దైవ్యం జనమ్’’ అని తెలిపింది. స్ర్తి పురుషులు ఏ మార్గాన్ననుసరించినా సర్వమానవ కల్యాణానికి సహకరించేదిగా వుండాలనీ, తనవలె పరుల కష్టాలను, హాని, లాభాలను తెలుసుకున్నవాడే మనుష్యుడని భావం. ధర్మార్థ కామముల సంపూర్ణత్వమే మోక్షం. వాల్మీకి మహాకవి రామాయణ రచనలో ‘‘రామో విగ్రహవాన్ ధర్మః’’ అంటూ రూపుకట్టిన ధర్మమే శ్రీరామచంద్రుడన్నాడు. సమాజానికి మహాభారతం అందించిన ధర్మం ఎంతో విశిష్టమైనదంటూ-
‘‘ఒరులే యని యొనరించిన- నవరరతనమనంబున కగునవిదానొరులకు సేయకునికి పరాయణము- పరమధర్మపథముల కెల్లన్’’ అని వివరించినది. ధర్మానికి హాని కలిగితే పలు కష్టాలు కల్గుతాయి, ధర్మం కూడా యుగయుగానికీ మారుతూ వుంటుంది. ధర్మ స్వరూపమే లోపిస్తుంది. కలియుగంలో ధర్మస్వరూపం మారి ఆపద్ధర్మం అనే ఒక అవకాశం వచ్చింది. అసలైన ధర్మాన్ని ఆచరించని వారి జీవితం వాసనలేని పువ్వులాగా తీపిలేని పండులాగ, భక్తి లేని పూజలాగా ఉంటుంది. కొరవి గోపరాజు తన రచనలో అభ్యుదయాన్ని, శ్రేయస్సునూ కలిగించేదే ధర్మం అంటూ జనులకు మేలు కలిగించే ప్రవర్తన కలిగి ఉంటాడో వానికి సర్వవేళలా ధర్మం తోడుగా వుండి రక్షిస్తుంది అన్నాడు.
మన మహర్షులు వేదం ద్వారానే మనకి ధర్మాన్ని ప్రబోధించారు. సర్వకాలాల్లో వర్తించేది, ఆచరణ సాధ్యమైంది ధర్మం. ధర్మం దృష్టిలో అందరూ సమానులే. ధర్మానికి ఎవరూ అతీతులు కారు. ధర్మం భగవత్ స్వరూపం. ప్రజలకు హితం కల్గించేది. జీవి మరణించిన పిదప కూడా వెంట వుండి రక్షించేది ధర్మమని పరమాత్మా గీత ద్వారా సందేశం అందించాడు.
ధర్మాన్ని గురించి ఎన్ని గ్రంథాలు చదివినా సజ్జనుల నడవడికను బట్టే ధర్మ స్వరూపాన్ని గ్రహించమని భీష్ముడు తెలిపాడు. ధర్మాన్ని బోధించడమే గాదు, ఆచరించడం కూడా ముఖ్యమే. దేనివల్ల అందరి ప్రేమ లభిస్తుందో అదియే ధర్మం. దేనివలన అందరి ద్వేషం లభిస్తుందో అది అధర్మం అని శాస్త్రం. ధర్మపరుడైన వ్యక్తికి దైవం కూడా నమస్కరిస్తాడని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. నిస్వార్థ చింతనే ధర్మం నల్గురికీ సాయం చేయడమే అమృతయోగం. కావున అతిసూక్ష్మమైన ధర్మాన్ని అందరూ ఆచరించి తరించాలి. పరులకు తెలియజేయాలి. ఇదే సనాతన ధర్మ లక్షణం. సత్పురుషుల ధర్మం. ధర్మాచరణలో ఓర్పు-నేర్పు-పట్టుదల- న్యాయం కావాలి. ఇవే ధర్మ లక్షణాలు. ధర్మంగల వారినే విజయం వరిస్తుంది. తరింపజేస్తుంది.
‘‘జ్ఞానం-శమో-దయా-్ధ్యనం ఏష ధర్మస్సనాతనః’’

- పి.వి.సీతారామమూర్తి 9490386015