డైలీ సీరియల్

బంగారు కల 11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మరుసు మంత్రి వాళ్ళిద్దరికీ ఆశీఃపూర్వకంగా సంభావనలిచ్చాడు. రాయలు మహాదానాలు చేశాడు.
దక్షిణాపథాన విజయప్ప నాయకుడి దండయాత్రవల్ల చేర, చోళ, పాండ్యరాజులు విజయనగరానికి సామంతులు కావటం రాయల కిరీటంలో మరిన్ని మణులు చేరినట్లయింది.
కృష్ణరాయలకోసం బంగారంతో రత్నాలు, వజ్రాలు తాపడం చేసిన కళాత్మక సింహాసనం ఏర్పాటయింది. చక్రవర్తి కోశాగారం నిండింది. లక్షకిపైగా నివాస గృహాలున్న విజయనగరం లక్ష్మీశోభతో కళకళలాడుతోంది. బహుభాషాకోవిదులు, చాకచక్యంగల చారుల సేనలవల్ల విజయనగరం మరింత భద్రంగా శోభిల్లుతున్నది.

3
తూర్పు దిక్కు సౌర్యభగవానునికి స్వాగతం పలుకుతూ వేయి రేకుల వెండి పద్మాలను సమర్పిస్తున్నది. విద్యారణ్యస్వామి ఆశీస్సుల్లా విజయనగరం శిరస్సుపై వేల వేల వెలుగు అక్షింతలు వర్షిస్తున్నాయి. విజయనగరంలోని దేవాలయాలనుండి సుప్రభాత సమయాన జరిపే పూజాదికాల మంత్రోచ్ఛాటనా తరంగాలు పంపానదీ జలాలను తాకి పవిత్రమొనర్చి మరల విరూపాక్షుని చరణాలను అభిషేకిస్తున్నాయి.
విరూపాక్షస్వామి దేవాలయం బయట తుంగభద్ర కృష్ణరాయని కీర్తివాహినిలా ప్రవహిస్తుంది. విరూపాక్ష ఆలయ గాలిగోపురం శిల్పకళాశోభితమై అనేక స్తంభాలు కిటికీలతో విరాజిల్లుతోంది. ప్రాకారంద్వారం నుండి వశిష్టతీర్థమనే తుంగభద్రానదీ భాగం పవిత్ర ఘట్టంగా విరాజిల్లుతోంది.
హంపీ విరూపాక్ష దేవాలయం హేమకూట పర్వతపాదం దగ్గర హంపీ పట్టణం నడిబొడ్డున వుంది. దీనినే పంపాపతి దేవాలయం అని కూడా అంటారు. హంపీలోని అన్ని దేవాలయాలకన్నా పరమ పవిత్రంగా భావించబడే ఈ దేవాలయం ఏడవ శతాబ్దకాలం నాటిదని చెప్తుంటారు. శివ, పంప, భువనేశ్వరీ ఆరాధన జరిగే ఈ గుడి గర్భగుడి, మూడు అంతర్భాగాలు, స్తంభాల మండపం, శ్రీకృష్ణదేవరాయ నిర్మిత రంగ మండపంతో అలరారుతున్నది. ఈ దేవాలయం చుట్టూ అనేక స్తంభాల మండపాలు, ద్వారాలు సమావేశ మందిరాలున్నాయి.
రంగమండపం అనేక శిల్పాకృతులతో ముప్ఫై రాతి స్తంభాలతో నిర్మితమైంది. ప్రతిస్తంభం రెండు నిలువు భాగాలుగా కన్పిస్తుంది. మొదటిది మకర శరీరంతో సింహాకృతిలో కన్పిస్తే రెండవది శైవ సంబంధిత అంశాలతో అలరారుతున్నది. రంగరాయ మండపంలోపల పైభాగం దూలాలన్నింటిమీదా మహాభారతం, రామాయణం, శివపురాణాలు చిత్రీకరించబడినాయి. విరూపాక్ష గుడి వద్ద తొమ్మిది అంతస్థులతో అత్యంత ఎత్తులో వుండే బృహద్గోపురాన్ని అనుసరించి విపణివీధి ఉంది. విరూపాక్ష గుడి ప్రధాన గోపురాన్ని బిష్టప్ప గోపురం అంటారు. దీనికి మరో చివర మహానంది వుంది.
భువనేశ్వరీ దేవాలయ మహాద్వార కళాత్మకత, రాతిస్తంభాలు, పైకప్పు లోపలి భాగ చిత్రాలు చాలా ఆకర్షణీయంగా వున్నాయి.
హంపీ విరూపాక్ష స్వామిని దర్శించుకొన్న మంజరి చంద్రప్పలు స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కాసేపు దేవాలయం మెట్లమీద కూర్చున్నారు.
‘‘మంజూ! ఈ విజయనగర ప్రజలు ఎంత అదృష్టవంతులో కదా! ఇంతటి మహనీయుడైన ప్రభువు పాలనలో జీవించటానికి అర్హులయారు. విరూపాక్ష స్వామి దయవల్ల ఆ తిరుమలేశుని కృపవల్ల కృష్ణరాయ ప్రభువు కీర్తిచంద్రికలు దశదిశలా వ్యాపిస్తున్నాయి’’
‘‘అవును చంద్రా! రాయలవారు ప్రతి విజయయాత్ర తర్వాత దేవేరులతో తిరుమల సందర్శించి తులలేని కానుకలను సమర్పించడం ప్రభువు భక్తికి నిదర్శనం.
‘‘మంజూ! చెప్పటం మరిచాను. తిమ్మరుసులవారు నాకో పని అప్పగించారు.’’
‘‘వారికి నీవు నమ్మినబంటువు కదా. ఏం చెప్పారేంటి?’’
‘‘నిర్మాణం కొనసాగిస్తున్న విఠల మండపం, ఏకశిలారథం నిర్మాణ పర్యవేక్షణ నాకప్పగించారు’’
‘‘ఇంకేం! ఇక రాత్రింబవళ్ళు ఆ శిల్ప కన్యల ధ్యాసే!’’ ఉడుక్కుంది మంజరి.
‘‘ఆ శిల్పాలకి మించిన సజీవ శిల్పమే నాకోసం ఉంది మంజూ! ప్రధాన శిల్పాచార్యుడు ఎంపిక చేసిన శిల్ప విన్నాణాలన్నింటిలో నీవే కన్పిస్తున్నావు. ఆయన నిన్ను, నీ నృత్యాన్ని ఎప్పుడైనా చూశారా అని నా అనుమానం’’.
‘‘చాలులే చంద్రా! అతిశయోక్తి వద్దుగానీ వారు నా నాట్యాన్ని రాయలవారి పట్ట్భాషేకోత్సవ సందర్భంలో చూశారు అంతే’’ నవ్విందామె చిన్నగా.
‘‘కళాహృదయుల కళాతపస్సుకు కాలమే బందీ అవుతుంది. విఠల మందిరంలో నిర్మితమవుతున్న సప్తస్వర స్తంభాలని మీటుతుంటే వివిధ వాయిద్యాల సందడి. నువ్వయితే పరశవంతో నర్తిస్తావు.
‘‘ఎల్లుండి పున్నమిరాత్రి నన్నక్కడికి తీసుకుపో చంద్రా’’ తమకంగా అడిగింది.
‘‘పరులకు ప్రవేశం నిషిద్ధం. అయినా ఆచార్యుల అనుమతి అడిగి తీసుకెళ్తాను.’’
‘‘పద! చిన్నాదేవిగారి పూజకు వేళకాకముందే నేను మందిరానికి చేరాలి’’.
‘‘ఉండుండు! ఇవ్వాళ విద్యారణ్యస్వామి జయంతి. వారి ఆశీస్సులు ప్రత్యేకంగా తీసుకోవాలి. ఈ గుడి వెనుక వారి ఆలయానికి వెళదాం’’
మంజరి చంద్రప్ప వెంట విద్యారణ్యుల గుడిలోకి ప్రవేశించింది.
విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి ప్రేరణగా నిలిచిన ఆ మహనీయుని మూర్తి చూడగానే చంద్రప్ప పరమ భావుకుడయ్యాడు. అతని కళ్లు ఆనందంతో చెమర్చాయి.
‘‘మంజూ! స్వామి ఎంతటి శక్తిసంపన్నుడో చూడు! పాడయిన ఓరుగల్లు సౌభాగ్యాన్ని విద్యానగర రాజవీధిలో నిలిపిన ఘనుడీయన. క్షీణిస్తున్న హిందూ మత ప్రాభవాన్ని తిరిగి నిలబెట్టిన తపస్వి. రాజకీయ తంత్రజ్ఞుడు. ఇహానికి పరానికి నిలిచిన నిస్సంగి. ఎప్పుడో వశిష్టుని గురించి విన్నాము. ఈ విద్యారణ్యుల దివ్య ఋషిత్వము వారి విగ్రహంలో ఎంతగా ప్రస్ఫుటిస్తున్నదో చూడు’’.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి