ఆంధ్రప్రదేశ్‌

దీక్ష వెనక జగన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష వెనుక వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హస్తం ఉందని తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నాయకులు మండిపడ్డారు. ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షను తిప్పికొట్టేందుకు తెలుగుదేశం వ్యూహ రచన చేస్తోంది. దీనిలో భాగంగా తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాపు కార్పొరేషన్ ఎర్పాటు చేశామని, కాపుల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు కమిషన్ నియామకం తదితర అంశాలను ప్రచారం చేస్తూనే, ఉద్యమాలు, దీక్షల వెనుక విపక్ష నేత జగన్ హస్తం ఉందంటూ విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. రెండు రోజులుగా విశాఖలోనే ఉన్న ముఖ్యమంత్రి సొంత పార్టీకి చెందిన కాపు వర్గీయులను మీడియా ముందుకు తోస్తున్నారు. కాపులకు రిజర్వేషన్ అంటూనే బిసిలను ఎగదోస్తున్నారంటూ జగన్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టేలా వ్యూహరచన చేస్తున్నారు. కాగా కాపులను బిసిల్లో చేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష వల్ల కాపు కులస్థులే నష్టపోతారని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ఆరోపించారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులను బిసిల్లో చేర్చడంతో పాటు వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశం న్యాయబద్ధంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాపులను బిసిల్లో చేర్చడంతో పాటు కాపు కార్పొరేషన్‌కు నిధుల కేటాయింపు అంశంలో తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇప్పటికే కాపులను బిసిల్లో చేర్చే అంశంపై మంజునాథ కమిటీని ప్రభుత్వం నియమించిందని, 9 నెలల గడువులోగా కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.