బిజినెస్

డిజిటల్ నేవీ దిశగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: ప్రపంచ దేశాలకు ధీటుగా, భారత నౌకాదళాన్ని శాస్త్ర, సాంకేతికంగా విస్తరించడానికి కేం ద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. భవిష్యత్‌లో కఠినమైన సవాళ్ళను అవలీలగా ఛేదించేందుకు నేవీ చేపట్టే వివిధ ఆపరేషన్స్‌ను మరింత మెరుగ్గా, సమర్థవంతంగా ఉండేలా డిజిటల్ నేవీగా రూపకల్పన చేయడానికి నిర్ణయించింది. ఆధునిక శాస్త్ర, సాంకేతికను అందిపుచ్చుకున్న భారత నావికా దళం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా భద్రత పరమైన ఉత్పత్తులు, సమగ్ర వ్యూహాత్మక యాజమాన్య విధానానికి మార్గం సుగమమం చేసింది. అలాగే మానవ వనరుల అభివృద్ధికి భారత నౌకాదళం పెద్దపీట వేసింది. నేవీ ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమచారాన్ని అందిస్తూ నేవీ అధికారులు, సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంది. అలాగే, పరిపాలన, ఆర్థిక సమాచార వ్యవస్థలో పారదర్శకానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని జోడించింది. అంతేకాకుండా సమాచార వ్యవస్థను మరింత మెరుగుపరిచింది. సముద్ర జలాల్లో యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లు ఎక్కడ ఉన్నా నిరంతరం అత్యంత వేగంగా సమాచారాన్ని చేరవేసేందుకు చర్యలు తీసుకుంది. భారత నౌకాదళ సొంత సమాచార వ్యవస్థ కోసం రుక్మిణి ఉపగ్రహాన్ని కూడా రూపొందించుకుంది. నౌకాదళం వివిధ సమయాల్లో చేపడుతున్న కార్యకలాపాలకు ఈ వ్యవస్థ ఎంతగానో తోడ్పడుతోంది. అలాగే నేవీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కేవలం ఆపరేషన్స్ కోసమే కాదు, పరిపాలనా రంగంలో కూడా విరివిగా వినియోగించుకుంటోంది. కాగిత రహిత పాలనలో భారత నౌకాదళం ఇప్పటికే చాలా అడుగులు ముందుకు వేసింది. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటి, నేవీ అధికారులు, సిబ్బంది అందరికీ డిజిటల్ ఐడెంటిటి, అంతర్గత పరిపాలనను నేవీ సమర్థవంతంగా అందచేస్తోంది. నౌకాదళ సిబ్బందికి అందాల్సిన అన్ని రకాల సేవలు చివరి వ్యక్తికి కూడా అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదంతో ముందుకు వెళుతోంది. ఆ నినాదాన్ని అందిపుచ్చుకున్న నేవీ.. సమాచార, శాస్త్ర, సాంకేతిక వ్యవస్థలను ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటూ ముందు కు సాగుతోంది. అలాగే డిజిటల్ ఇండియాకు భారత నౌకాదళం స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సాంకేతికంగా ఎన్నో మైలు రాళ్ళు దాటిన భారత నౌకాదళం అనేక అంశాల్లో స్వయం సమృద్ధి సాధించింది. సాంకేతికతపై ఇతర దేశాలపై ఆధారపడడం అంత శ్రేయస్కరం కాదని భావించిన భారత నౌకాదళం స్వయం సమృద్ధి, స్వదేశీ పరిజ్ఞానానికి పెద్ద పీట వేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా 1961లో తొలిసారిగా ఒక చిన్న యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ అజయ్‌ను కోల్‌కత్తాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. స్వదేశీ పరిజ్ఞానానికి ఆనాడు పడిన పునాది, నేడు మరింత బలపడింది. భారత దేశంలోని వివిధ నౌకా నిర్మాణ కేంద్రాల్లో ఇప్పటి వరకూ 130 యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌ల నిర్మాణం విజయవంతంగా సాగింది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిన తరువాత 47 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటురంగ నౌకా నిర్మాణ కేంద్రాల్లో నిర్మిస్తున్నారు.