జాతీయ వార్తలు

దాడికి కుట్ర పన్నిన అల్‌ఖైదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 12: దేశ వాణిజ్య రాజధాని ముంబయిపై 26/11 దాడి తరువాత కూడా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా భారత్‌పై దాడులకు కుట్ర పన్నింది. దీనిపై ఆల్‌ఖైదా తనతో సంప్రదింపులు జరిపినట్టు 26/11 ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ వెల్లడించాడు. అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉగ్రవాది హెడ్లీ నుంచి ప్రత్యేక న్యాయమూర్తి జిఎ సనప్ వాంగ్మూలం నమోదు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీపై దాడికి వ్యూహరచన జరిగిందన్నారు. అలాగే ముంబయి విమానాశ్రయం, బిఏఆర్‌సి, నావల్ ఎయిర్ స్టేషన్లను లష్కరె తొయిబా, ఐఎస్‌ఐ ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేసుకున్నాయని హెడ్లీ చెప్పాడు. ముంబయిలో శివసేన భవన్ లేదా సేన అధినేత బాల్‌థాకరే హత్యకు పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరె కుట్ర పన్నిందన్నాడు. దీన్లో భాగంగా శివసేన సభ్యుడితో సంబంధాలు పెట్టుకోవాలని ప్రయత్నించిన విషయాన్ని హెడ్లీ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. న్యాయమూర్తి సనప్ నాలుగోరోజు శుక్రవారం హెడ్లీని విచారించారు. అయితే నావల్ ఎయిర్ స్టేషన్, సిద్ధివినాయక ఆలయంపై దాడి చేయాలని లష్కరె తొయిబా నిర్ణయించిందన్న హెడ్లీ‘ఆ రెండు చోట్ల భారీ భద్రత ఉన్నందున దాడి వద్దని ఉగ్రవాద సంస్థకు చెప్పాను’అని వివరించాడు. ముంబయి విమానాశ్రయం, నేవీ ఎయిర్ స్టేషన్‌లపై 2008లోనే దాడికి పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ, లష్కరె తొయిబాలు టార్గెట్ చేశాయని వెల్లడించాడు. 26/11 ఉగ్రవాదకి సంబంధించి అనేక అంశాలను వాంగ్మూలంలో తెలిపాడు.‘26/11 ఉగ్రవాద దాడి తరువాత ఇలియాస్ కాశ్మీరీ(ఆల్‌ఖైదా)ను 2009 ఫిబ్రవరిలో నేను కలిశాను. భారత్‌లో మరిన్ని కీలక ప్రాంతాల్లో దాడులు చేయాల్సి ఉంది కాబట్టి మరోసారి అక్కడ పర్యటించాలని నన్ను అడిగాడు’అని అతడు వివరించాడు. నేషనల్ డిఫెన్స్ కాలేజీ(ఎన్‌డిసి)ని టార్గెట్ చేసుకుని దాడి చేయాలని భావించినట్టు హెడ్లీ చెప్పాడు. ఎన్‌డిసి అత్యంత కీలకమైన ప్రాంతమేకాకుండా బ్రిగేడియర్ జనరల్ స్థాయి గల అనేక మంది సీనియర్ సైనిక అధికారులు అక్కడ ఉంటారని ఉగ్రవాద సంస్థ భావించింది. అలాంటి చోట దాడి విజయవంతంగా పూర్తిచేస్తే బ్రిగేడియర్ ర్యాంకు అధికారులు మట్టుబెట్టవచ్చని ఆల్‌ఖైదా సభ్యుడు అబ్దుల్ రెహ్మాన్ పాషా తనతో చెప్పాడని అతడు పేర్కొన్నాడు. 26/11 ముంబయిపై దాడి కేసులో ప్రధాని నిందితుడిగా ఉన్న హెడ్లీ అప్రూవర్‌గా మారి అనేక విషయాలు వెల్లడించాడు. కాశ్మీరీ ఆదేశం మేరకు పుష్కర్‌లోని ఛాబాద్ హౌస్, గోవా, పూణేల్లో పర్యటించినట్టు న్యాయమూర్తికి చెప్పాడు. దాడుల కోసం కేడర్‌ను రిక్రూట్ చేసుకోమని మెజర్ ఇక్బాల్ సూచించినట్టు హెడ్లీ తెలిపాడు. అంతేకాదు దాదర్‌లోని శివసేన భవన్‌లో ఉద్ధవ్ థాకరే పిఆర్‌ఓ రాజారామ్ రాగేను తాను కలుసుకున్నట్టు వెల్లడించాడు. శివసేన భవన్‌పై భవిష్యత్‌లో దాడికి ఆస్కారం ఉన్నందున లష్కరె ఆదేశాల మేరకు సేన సభ్యుడిని కలిసినట్టు కోర్టుకు తెలిపాడు.