జాతీయ వార్తలు

దేశ వ్యతిరేకులకు నిరసనగా లాయర్ల ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది లాయర్లు శుక్రవారం ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరసన ప్రదర్శనలో గత సోమ, బుధవారాల్లో జర్నలిస్టులు, జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపకులపై దాడి చేసిన లాయర్లు కూడా ఉండడం విశేషం. నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారిలో పాటియాలా హౌస్‌కు చెందిన లాయర్లతో పాటు జిల్లా కోర్టులకు చెందిన వారు కూడా ఉన్నారు. భారీ ఎత్తున పోలీసులను మోహరించినప్పటికీ వీరంతా ఇండియా గేట్ సర్కిల్ చుట్టూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ ప్రదర్శన నిర్వహించడం గమనార్హం. గత సోమ, బుధవారాల్లో జర్నలిస్టులు, జెఎన్‌యు విద్యార్థులపై దాడులు చేస్తూ కెమెరాల కంటికి చిక్కిన కొంతమంది లాయర్లు కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాలు పంచుకోవడం చూస్తే వారి చర్యల పట్ల దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలను వారు బేఖాతరు చేస్తున్నారనిపిస్తోంది. ‘ఎవరేమనుకున్నా సరే దేశ వ్యతిరేకులపై మేము దాడులు చేస్తూనే ఉంటాం. మాతృభూమిని అవమానిస్తే మేము సహించం. పోలీసులు సమన్లు జారీ చేస్తే చేసుకోనివ్వండి’ అని దాడుల్లో పాల్గొన్న ఓ లాయరు వ్యాఖ్యానించారు. కాగా, దాడులు చేసిన వారు బయిటివారై ఉంటారని, లాయర్లు హద్దు మీరి ప్రవర్తించరని మరో లాయరు అం టూ, మీడియా తమని అప్రతిష్ఠ పాలు చేస్తోందని ఆరోపించారు.