రాష్ట్రీయం

డిండి టెండర్లపై రాద్ధాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 27: నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ పక్షాల మధ్య డిండి టెండర్ల రగడ మరింత ముదురుతోంది. డిండి ఎత్తిపోతల పథకం టెండర్ల జాప్యాన్ని విపక్షాలు రాజకీయ అస్త్రంగా మలుచుకుంటుండం ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతుంది. కరువు, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ, రంగారెడ్డి జిల్లా వాసులకు తాగుసాగు నీరందించే లక్ష్యంతో తలపెట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలువకుండా కుట్ర చేస్తున్నారంటూ నల్లగొండ జిల్లా సిపిఎం నేత, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నంద్యాల నరసింహరెడ్డి చేసిన ఆరోపణలు ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపాయి. డిండి ఎత్తిపోతల టెండర్ల జాప్యం వివాదంపై నంద్యాల శుక్రవారం తెలంగాణ రైతుసంఘం పేరుతో సీఎం కెసిఆర్‌కు బహిరంగ లేఖ విడుదల చేయడం చర్చనీయాంశమైంది.
మార్పులు చేసిన డిండి ఎత్తిపోతల ప్రతిపాదనలను జనవరి 4వ తేది సమావేశంలో సీఎం కెసిఆర్ ఆమోదించగా ఫిబ్రవరి 12న ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావు, డిండి లిఫ్ట్ స్కీం ఇంజనీర్లతో సమావేశమై ఐదు రిజర్వాయర్లకు ఈ నెల 17న టెండర్లు పిలవాలని ఆదేశించారు. అయితే ఈనెల 16న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఒఎస్‌డి రంగారెడ్డిలు డిండి లిఫ్ట్ చీఫ్ ఇంజనీర్, ఎస్‌ఈలను పిలిచి టెండర్లు ఆపాలని లేనట్లయితే జైలుకు పోవలసివస్తుందంటూ హెచ్చరించినట్లుగా నంద్యాల ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ వివాదంతో ఈ నెల 17న పిలువాల్సిన డిండి టెండర్ల ప్రక్రియ ఆగిపోవడంతో పాటు మిగతా కాలువలు, రిజర్వాయర్ల సర్వే పనులు ఆగాయని నంద్యాల ఆరోపించారు. కెసిఆర్‌కు సైతం తెలువకుండా వారు డిండి టెండర్లు ఆపాలంటూ ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చారని రెండు జిల్లాల మధ్య వివాదాలు రేపేలా వారు వ్యవహరిస్తున్నారని నంద్యాల లేఖలో పేర్కొన్నారు. కాగా డిండి టెండర్ల వెనుక జాప్యంపై నంద్యాల బహిర్గతం చేసిన విషయాలను విపక్ష కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు సైతం అందిపుచ్చుకుని డిండి టెండర్ల సమస్యపై ప్రభుత్వంపైకి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టేందుకు సిద్ధమవుతుండటంతో ఈ వివాదం రాజకీయంగా మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.