హైదరాబాద్

దూర విద్య కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఫిబ్రవరి 26: ఆచార్య నాగర్జున విశ్వవిద్యాలయం దూరవిద్య ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి బిఎస్సీ, బికాం, బిఏ, బిహెచ్‌ఎం, బిఎఫ్‌టి కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు జాగృతి డిగ్రి, పిజి కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ జయపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నారాయణగూడలోని స్టడీ సెంటర్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబిఏ, లైబ్రరి కోర్సుల కోసం డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 29లోగా దరఖాస్తులను అందజేయాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మేనెలలో జరిగే వార్షిక పరీక్షలకు అర్హులని తెలిపారు. సెల్ 9849144925, 9550975288ను సంప్రదించాలని కోరారు.
వాసా ప్రభావతికి బంగారు పతకం
కాచిగూడ, ఫిబ్రవరి 26: రాగ సప్తస్వరమ్ సాంస్కృతిక సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో డా. వాసా ప్రభావతికి రాగ సప్తస్వరమ్ సాహిత్య బంగారు పతక ప్రదానోత్సవం శుక్రవారం చిక్కడపల్లి గానసభలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సమాచారహక్కు కమిషనర్ పి.విజయబాబు పాల్గొని ప్రభావతికి బంగారు పతకాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభావతి రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతిని సంపాదించుకున్నారని అన్నారు. ఆమె రచనలు ఎంతో పేరు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. రచయితలను ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమన్నారు. సభకు ముందు డా. డి.రాజశ్రీ ప్రదర్శించిన భరతనాట్యం అందరినీ అలరించింది. కార్యక్రమంలో రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి, సర్వమంగళ గౌరి, బిఆర్‌వి.సుశీల్ కుమార్, రాజ్యలక్ష్మి, రాఘవేంద్రరావు దేశాయ్ పాల్గొన్నారు.