కృష్ణ

ఎన్టీఆర్ స్ఫూర్తితో 6 లక్షల గృహాల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: సమాజంలో నిరుపేదలకు గూడు, కూడు, గుడ్డ అందించాలని స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్రంలో 6 లక్షల గృహాలను నిర్మించాలనే మహా సంకల్పాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం జక్కంపూడి వద్ద ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం శంకుస్థాపన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బలహీనవర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డా బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు ఎన్టీఆర్ గృహ నిర్మాణంకు శ్రీకారం చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో రూ. 16,300 కోట్లతో 6 లక్షల మంది లబ్ధిదారులకు పక్కా గృహాలను నిర్మించనున్నామన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి సంబంధించిన పైలాన్‌ను ముఖ్యమంత్రి జక్కంపూడి వద్ద ఆవిష్కరించనున్నారని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో 166 నియోజకవర్గాల్లో 774 గ్రామాల్లో ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి సబంధించిన కార్యక్రమాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 290 ఎస్‌ఎఫ్‌టి, పట్టణ ప్రాంతాల్లో 400 ఎస్‌ఎఫ్‌టితో డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్‌లను నిర్మించనున్నామన్నారు. గృహ నిర్మాణ పథకంలో గతంలో జరిగిన అవకతవకలు పునరావృతం కాకుండా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసామన్నారు. గతంలో మంజూరై నిర్మాణంలో ఆగి అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు చెందిన లబ్ధిదారుల అర్హతలను పరిశీలించి వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. శంకుస్థాపన ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి వెంట గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ సిహెచ్ మల్లిఖార్జునరావు, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శరత్‌బాబు, డిఆర్‌డిఏ పిడి చంద్రశేఖరరాజు, స్తానిక తహశీల్దార్ మధన్‌మోహన్ తదితరులు ఉన్నారు.

18 నుంచి జాతీయ గిరిజన మహిళా సర్పంచ్‌ల సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 13: ఈ నెల 18 నుండి నగరంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి గిరిజన మహిళా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల సమావేశ నిర్వహణకు అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతతం చేయాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19న జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా నగరంలో నిర్వహించ నున్న జాతీయ స్థాయి గిరిజన మహిళా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల సమావేశం ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్ బాబు ఎ నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 19 నుండి 3రోజులపాటు నిర్వహించే ఎస్టీ, మహిళా సర్పంచ్‌ల సమావేశానికి 10 రాష్ట్రాల నుండి 1050 మంది గిరిజన మహిళా సర్పంచ్‌లతో పాటు 100 మంది ప్రముఖులు హాజరు కానున్నారన్నారు. సమావేశంలో పాల్గొనే మహిళా సర్పంచ్‌లకు ప్రముఖులకు నగరంలోని 28 హోటళ్లలో 630 రూములలో వసతి కల్పించడం జరిగిందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సబ్ కలెక్టర్, జిల్లా పౌర సరఫరాల అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. ఎ కనె్వన్షన్ హాలు నందు వేదిక ఏర్పాట్లను డిఆర్‌డిఎ పిడి పర్యవేక్షించాలన్నారు. మహిళా సర్పంచ్‌లు, ప్రముఖులను వారికి కేటాయించిన విడిది నుండి సమావేశానికి తీసుకువచ్చేందుకు 40 ఎసి బస్సులను, 50 కార్లను కేటాయించడం జరిగిందని వాహనాల పర్యవేక్షణ బాధ్యతలను డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, వ్యవసాయ శాఖ డిడి ఎస్సీ కార్పొరేషన్ ఇడిలు పర్యవేక్షించాలన్నారు. ఎ.కనె్వన్షన్ సమావేశపు హాలు వద్ద నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ వంటకాలతో భోజన సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ సూచించారు. సౌత్ జోన్ కల్చరల్ సెంటరు ఆధ్వర్యంలో ఒరిసా, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణా, మధ్యప్రదేశ్‌కు చెందిన కళాకారులు గిరిజన సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించనున్నారని, మన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కూచిపూడి నృత్యాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర సంబంధాల అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి సమావేశంలో పాల్గొనే మహిళా సర్పంచ్‌లకు నగరం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను సందర్శించేందుకు తగిన ఏర్పాట్లను టూరిజం అధికారి మరియు అర్బన్ తహశీల్దారు చేపట్టాలన్నారు. రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టు, బస్టాండ్‌ల వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి హాజరయ్యే మహిళా సర్పంచ్‌లకు తగిన సూచనలను సలహాలను అందించేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా జిల్లా కీర్తి ప్రతిష్ఠలను మరింత ఇనుమడింపచేయాలని టీమ్ కృష్ణా అధికారులకు కలెక్టర్ సూచించారు.
సమావేశంలో సబ్ కలెక్టర్ డా.జి.సృజన, అదనపు మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారిణి కృష్ణకుమారి, డిఆర్‌డిఎ పిడి డి.చంద్రశేఖర్ రాజు, డిఎస్‌ఓ వి.రవికిరణ్, వ్యవసాయ శాఖ డిడి ఎన్‌సిహెచ్ బాలునాయక్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి ఎ.సునీల్‌రాజ్‌కుమార్ జిల్లా పౌర సంబంధాల అధికారి జి.గోవిందరాజులు, అసిస్టెంట్ టూరిజం అధికారి జి.రామలక్ష్మణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.