కృష్ణ

పిహెచ్‌సీల్లో పోస్టులు భర్తీ చేస్తాం....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 27: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న సిబ్బంది కొరతను భర్తీచేయాలని కోరుతూ బందరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గోపు సత్యనారాయణ రాష్ట్ర వైద్యవిద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. బందరు మండలం తాళ్లపాలెం, చిన్నాపురం గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని, వాటికి నూతనంగా భవనాలు నిర్మించి ఆధునిక వైద్య పరికరాలు మంజూరు చేసినా సిబ్బంది మాత్రం భర్తీకావటం లేదని, భర్తీ చేయాలని వినతిపత్రంలో కోరారు. ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్ట్ఫా నర్సు, ఒక ఫార్మసిస్ట్, ఒక లాబ్ టెక్నీషియన్, ఒక సీనియర్ అసిస్టెంట్, రెండు ఎంపిహెచ్‌ఎ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అలాగే గోపువానిపాలెం, పోతేపల్లి, హుస్సేన్‌పాలెం సబ్ సెంటర్లు పెడన పరిధిలో ఉన్నాయని, దీంతో ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లటానికి ఇబ్బంది పడుతున్నారన్నారు. మూడు సబ్ సెంటర్లను తాళ్లపాలెం, చిన్నాపురం పిహెచ్‌సిలలోకి చేర్చాలని కోరారు. అందుకు స్పందించిన మంత్రి శ్రీనివాస్ వెంటనే పోస్టుల భర్తీకి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఏకగ్రీవ ఎన్నికలు సత్సంప్రదాయం..
మచిలీపట్నం (లీగల్), ఏప్రిల్ 27: ఏకగ్రీవ ఎన్నికలు మంచి సంప్రదాయమని, ఇలాంటి ఎన్నికలను ప్రోత్సహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి రవీంద్రబాబు అన్నారు. మచిలీపట్నం న్యాయవాదుల సంఘానికి ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికలు జరగటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. న్యాయవాదుల సంఘ భవనంలో బుధవారం జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రవీంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకరించాలని కోరారు. దేశంలో న్యాయస్థానాల సంఖ్య తక్కువగా ఉందని, పెండింగ్ కేసుల సంఖ్య ఎక్కువైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని ఆయను గుర్తుచేశారు. జల్లా కోర్టు ప్రాంగణంలో క్యాంటిన్ కోసం పక్కా భవన నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు రవీంద్రబాబు తెలిపారు. బార్ నూతన అధ్యక్షులు కూనపరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘ నిధులను దుర్వినియోగం చేయకుండా సొంత ఖర్చులతో సంఘ కార్యక్రమాలను నిర్వహిస్తానన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడను ఆహ్వానించి నూతన న్యాయస్థానాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. సంఘ మాజీ అధ్యక్షులు తాతా దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పదో అదనపు జిల్లా జడ్జి జి స్వర్ణలత, ఆరో అదనపు జిల్లా జడ్జి మల్లిఖార్జునరావు, ఇతర న్యాయమూర్తులు, నూతన ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుమ్మడి సుబ్బారావు, తుంగల హరిబాబు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన వి శివరాం నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు.