కృష్ణ

పర్యాటక కేంద్రంగా ‘రివర్ ఫ్రంట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: నవ్యాంధ్ర రాజధానిలో స్థానికులను, పర్యాటకులను ఆకర్షించే విధంగా రివర్ ఫ్రంట్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి ప్రతిపాదనలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరు తన క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖ సంచాలకులు హేమన్ష్ శుక్లా, సంబంధిత శాఖ అధికారులతో జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతన రాజధాని అమరావతిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ప్రతి రోజు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. ముఖ్యంగా రివర్ ఫ్రంట్ ప్రాంతాన్ని దశలవారీగా అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా కృషి జరుగుతోందన్నారు. దీనిలో భాగంగా దుర్గాఘాట్ వద్ద అంతర్జాతీయ స్థాయిలో వాటర్ ఫౌంటెన్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. పర్యాటకులు ఎక్కువ మంది పద్మావతి ఘాట్‌ను సందర్శించే విధంగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు. వీటిని రానున్న మూడు మాసాల్లో పూర్తి చేసే విధంగా పర్యాటక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వివిధ దశల్లో ఉన్న హంసలదీవి, జగ్గయ్యపేట, కొండపల్లి, పెడనలలో జరుగుతున్న అభివృద్ధి పనులను చర్చించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గాంధీ హిల్ కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణవేణి, పద్మావతి ఘాట్లకు బ్యారేజీ నుంచి కావలసిన నీటిని విడుదల చేయాలని, కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీరు వైఎస్ సుధాకర్‌కు సూచించారు. విజయవాడ నగర పాలక సంస్థ ఘాట్‌లను పరిశుభ్రం చేసే చర్యలు చేపడుతుందని , అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. సమావేశంలో టూరిజం ఇడి మల్లికార్జునరావు, పర్యాటక శాఖ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.

జిల్లాకు రెండోసారి దక్కిన పదవి!
విజయవాడ (క్రైం), మార్చి 22: ప్రభుత్వ శాఖల్లో ప్రాముఖ్యత కలిగిన పోలీసు శాఖకు కీలకమైన హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రెండోసారి జిల్లాకు దక్కింది. అప్పుడెప్పుడో అన్నగారి హయాంలో, మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి కృష్ణా జిల్లా ప్రాతినిధ్యం వహించనుంది. ప్రభుత్వ శాఖల నామినేటెడ్ పోస్టుల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పదవి నగరానికి చెందిన అధికార తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కె నాగుల్‌మీరాను వరించింది.
నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణా జిల్లాకు చెందిన కంభంపాటి రామ్మోహనరావును కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. ఈ పోస్టులో తొలిసారి అప్పుడు ఆయన, మళ్లీ ఇప్పుడు నాగుల్‌మీరా. అదికూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోనే రెండుసార్లూ ఈ పదవిలో జిల్లాకు చెందిన నాయకులకు అవకాశం దక్కింది. నాగుల్‌మీరా గత 20ఏళ్ళుగా టిడిపికి సేవ చేస్తున్నారు. ఎట్టకేలకు తనను గుర్తించిన అధిష్ఠానం ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుకు ఎంపిక చేయడం పట్ల మీరా వర్గం హర్షం వ్యక్తం చేస్తోం ది. పార్టీని నమ్ముకున్నవారికి అన్యా యం జరగదనే వాస్తవం తన నియామకం పట్ల రుజువైందని మీరా చెపుతున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు గాని అవకాశం రావ డం ఒకింత అసంతృప్తికి గురిచేస్తోందంటూ మీరాను అమితంగా అభిమానించే కార్యకర్తలు అంటున్నారు. ఏదిఏమైనా జిల్లాకు రెండోసారి పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడం పట్ల జిల్లా, నగర టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగానూ కొనసాగుతున్నారు. చైర్మన్‌గా ఈయన నియామకానికి సంబంధించి ఇటీవలే జీవో కూడా విడులైంది. దీంతో మీరా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
* 24న ప్రమాణస్వీకారం
ఏపి రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నాగుల్‌మీరా ఈ నెల 24న శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. పశువుల ఆస్పత్రి రోడ్డులోని కార్యాలయంలో ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. కేశినేని భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మీరా మాట్లాడుతూ ఈ సందర్భంగా అర్బన్ టిడిపి ఆధ్వర్యాన భారీ నిర్వహించనున్నట్లు చెప్పారు. కేశినేని భవన్ నుంచి ర్యాలీ బయలుదేరి బందరురోడ్డు మీదుగా పటమటకు చేరుకుని అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తామని, అనంతరం తిరిగి విజయవాడ డివిజనల్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయం లో బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. కార్యక్రమానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, హోంమంత్రి చినరాజప్ప, డిజిపి నండూరి సాంబశివరా వు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు హాజరవుతారని చెప్పారు. ఏపి పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా తాను నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానని చెప్పారు. విలేఖరుల సమావేశంలో ఏపి మైనార్టీ ఫై నాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మొహిద్దీన్, కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య, ఉమ్మడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.