Others

డ్యాన్స్ థెరపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ నగరంలో డ్యాన్స్ థెరపీ విస్తరిస్తోంది. అబ్బో వ్యాయామమా, బోర్ అని అనుకోకుండా హుషారెత్తించే నాట్యరీతులలో శరీరాన్ని కదుపుతూ సాగే సరికొత్త టెక్నిక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికే డ్యాన్స్ థెరపీ అని పేరుపెట్టారు. ఈ పద్ధతిని నేర్పేందుకు అనేక చోట్ల శిక్షణా కేంద్రాలు సైతం వెలుస్తున్నాయంటే ఆశ్చర్యం కలిగించకమానదు. ఈ రోజుల్లో మహిళల్లో ఎక్కువమంది రొమ్ము క్యాన్సర్, ఊబకాయం, మెనోపాజ్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు అవసరమైన వ్యాయామం చేయటంలో మహిళలు ఆసక్తి చూపటం లేదు. దీంతో కొంతమంది ఔత్సాహికులు ముందుకువచ్చి ఓ గ్రూప్‌గా ఏర్పడి విభిన్న నృత్యరీతులలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఈ నృత్యాలను ప్రదర్శించటానికి కిట్టీ పార్టీలను వేదికగా చేసుకుంటున్నారు. శారీరక, మానసిక భావోద్వేగాల నియంత్రణలో డ్యాన్స్ ఎంతో ఉపకరిస్తుంది. ఇపుడు ఏ ఇంటిలో చిన్న పార్టీ జరిగినా మహిళలు హుషారుగా.. ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడ పండుగ వాతావరణం సృష్టిస్తున్నారు. పార్టీలకు వచ్చి పోచుకోలు కబుర్లు చెప్పుకునే బదులు ఈ ఇలాంటి నృత్యాలు చేస్తే ఆరోగ్యానికి ఎం తో మేలు అని వీరు భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కిట్టీ పార్టీలో పాల్గొన్న మహిళలు మాటలతో కాలాన్ని వృధా చేయకుండా డ్యాన్స్ చేస్తూ అక్కడివారికి ఆనందాన్ని పంచిపెట్టారు. ‘మేమందరం మధ్య వయసు మహిళలం. నృత్యంలో ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. నాట్యంలా శరీరాన్ని చిన్నపాటి కదలికలతో కదిలస్తూ ఆనందం పొందుతాం’ అని అంటున్నారు శశినెహత. ఇక్కడ మహిళలతో డ్యాన్స్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినవారిలో ఆమె ఒకరు. ‘ఆరు నెలల క్రితం ఓ పార్టీ లో మేమంతా కలిసాం. ఆ పార్టీలో మహిళలంతా కూర్చుని గాసిప్స్ కబుర్లతో కాలం వృధాచేయటం గమనించాను. డ్యాన్స్ నేర్చుకుని కిట్టీ పార్టీ ల్లో ప్రదర్శిస్తే తక్కువ మాటలు, ఎక్కువ పని చేసినట్లు ఉంటుంది. అం తేకాదు శరీరంలో పేరుకుపోయిన కేలరీలు ఖర్చవుతాయనే ఆలోచనతో ఇలా గ్రూప్‌గా ఏర్పడేటట్లు చేసింది’ అని శశి చెబుతున్నారు.