Others

అశ్వత్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెట్లను పుట్లను పూజించడం అనాదిగా వస్తున్నదే.సింధునాగరికతాకాలంలో కూడా ఈ చెట్లను పూజించడం ఉన్నట్లు పురాతత్వశాస్తజ్ఞ్రులు చెబుతున్నారు. చెట్లు ప్రాణవాయువునిస్తాయి. కనుక చెట్లను దైవ స్వరూపంగా భావించాలని శాస్త్రాల్లోని అంతరార్థం అనీ అంటారు.చెట్లు అనేకవిధాలు మానవునికి ఉపయోగపడడం ఆధునిక కాలంలోను జరుగుతున్నదే కదా. రావిచెట్టునే అశ్వత్థాము అని పిలుస్తుంటారు. దీనికి సంబంధించి ఓ పురాణ కథ ఉంది. పూర్వకాలంలో పిపాల, అశ్వత్థ అనే ఇద్దరు రాక్షస సోదరులుండేవారట. రాక్షసులు కామరూపం తెలిసిన వారు కనుక అశ్వత్థుడు వృక్షరూపం ధరించి నిల్చునేవారట. పిపాల అనే సోదరుడు బ్రాహ్మణుడి వేషం వేసుకొని ఆ వృక్షాన్ని పూజిస్తూ ఉండేవారట. ఆ దారిన పోయేవారిని పిలిచి ఈ చెట్టును తాకి దణ్ణం పెట్టుకోండి పుణ్యంవస్తుంది అని చెప్పేవాడట. ఊరికే పుణ్యం వస్తుంది కదా అని చాలామంది అశ్వత్థవృక్షాన్ని తాకడానికి వెళ్లేవారట .
వారు దగ్గరకు రాగానే అశ్వత్థ రూపంలో ఉన్న రాక్షసుడి వారిని భక్షించివేసేవాడట. ఇలా వారిద్దరూ ప్రజలను తినడం ఆరంభించారు.
ఈవిషయం శనేశ్వరునికి తెలిసింది. శని దోషకారుడుగా పేరున్నా కూడా ఈ రాక్షసులు చేసే దాన్ని చూసి కోపం తెచ్చుకుని వారిని సంహరించాడట. అప్పట్నుంచే రావి చెట్టుకు అశ్వత్థ వృక్షం అని పేరు వచ్చింది అంటారు. శనివారం నాడు ఈ అశ్వత్థవృక్షాన్ని పూజించినవారికి శని దోషం రాదని ఐతిహ్యం. శనివారం నాడు ఈ రావిచెట్టులో లక్ష్మీ దేవి అంశ ఉంటుందని కూడా చెబుతారు. అశ్వత్థం నారాయణ స్వరూపమని అంటారు. దీనికి సంబంధించి మరోకథనం ఉంది.
సంతానం లేనివారు శనివారం నాడు రావిచెట్టును పూజించిస్తే సంతానవంతులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మాండ పురాణంలో, పద్మపురాణంలోకూడా అశ్వత్థ వృక్ష ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. రావిచెట్టు త్రిమూర్తుల రూపమని రావి వేర్లు బ్రహ్మ స్వరూపమని, కాండం విష్ణుస్వరూపమని, ఆకులు కొమ్మలు శివస్వరూపమని చెబుతారు.
గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది రావిచెట్టు నీడలోనే. ఈ రావిచెట్టునే బోధివృక్షం అని కూడా సంబోధిస్తారు. రావి చెట్టును క్రీ.పూ. మూడవ శతాబ్దంలో బౌద్ధ్భిక్షువులు భారత దేశణనుండి శ్రీలంకకు తీసుకొని వెళ్లి అక్కడ నాటారట. ఆ మొక్క నేటికి పెద్ద వృక్షమై శాఖోపశాఖలతో విస్తరించి ఉందట. దాని వయస్సు సుమారుగా 2000 సంవత్సరాలకు పైగానే ఉంటుందని నిర్ధారించారు. దీర్ఘకాలం ఉండే ఈ చెట్టును హైందవులంతాపూజిస్తుంటారు. రావిచెట్టునుస్ర్తి స్వరూపంగాను, మర్రిచెట్టును పురుషస్వరూపంగాను భావిచడం కద్దు.