Others

కేన్సర్‌ను తరిమికొడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేన్సర్ వ్యాధి నివారణకు ప్రపంచ ప్రజలంతా చైతన్యవంతం కావాలని శాస్తవ్రేత్తలు చాలాకాలంగా పిలుపుఇస్తూనే ఉన్నారు. ఆధునిక వైద్య విజ్ఞానం అందుబాటులోకి వచ్చినా ఈ వ్యాధి బారిన పడుతూ నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్ నివారణకు సమగ్ర కార్యాచరణను నిర్దేశించేందుకు 2000లో పారిస్‌లో మొదటి శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఏటా ఫిబ్రవరి 4వ తేదీన ‘ప్రపంచ క్యాన్సర్ నివారణ దినం’గా పాటించాలని ఆ సమావేశంలో తీర్మానించారు. 2020 నాటికి క్యాన్సర్ రోగుల సంఖ్య 20 మిలియన్లకు చేరగలదని అంచనా. ఏటా ఈ మహమ్మారి కారణంగా 8 మిలియన్ల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. రాబోయే పదేళ్లలో 84 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణించే ప్రమాదం వుందని డబ్ల్యుహెచ్‌వో ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధితో మరణించేవారిలో 70 శాతం రోగులు అతి తక్కువ లేదా మధ్యరకమైన జాతీయాదాయం కలిగిన దేశాలకు చెందినవారేనని ఓ అంచనా. ఆస్ట్రేలియాలో ఈ వ్యాధి నివారణపై చైతన్యం రగిలించేందుకు ఆగస్టు 25న ‘డఫోడిల్ దినం’ జరుపుకుంటారు. ఆ దేశంలో ‘క్యాన్సర్ కౌన్సిల్ ఫండ్’కు ప్రజలు యథాశక్తి విరాళాలను సమర్పించి, వ్యాధి నివారణకు జరిగే పరిశోధనలకు తోడ్పడతారు. వ్యాధిగ్రస్తులలో మనోధైర్యాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తారు.
హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం శాస్తవ్రేత్తలు క్యాన్సర్ వ్యాప్తిని నిరోధించే ప్రొటీన్‌ను కనుగొన్నారు. మొక్కలలోని పరాగ రేణువుల పెరుగుదలను నిరోధించే ఈ ప్రొటీన్, మాలిజ్నెంట్ క్యాన్సర్ కణాలను శరీరంలో ఒక భాగం నుంచి మరో భాగానికి వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం 8 లక్షల మంది క్యాన్సర్ రోగులు కొత్తగా నమోదవుతున్నారు. వాతావరణ కాలుష్యం, రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం, ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకం క్యాన్సర్ కారకాలుగా నిలుస్తున్నాయి. గొంతు, రక్తం, మూత్రపిండాలు, చర్మం, మహిళలలో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్‌లు సంక్రమిస్తున్నాయి. నిల్వవున్న ఆహారం, చెడిపోయిన మాంసాహారం తీసుకోవడంవల్ల కూడా క్యాన్సర్ సంభవిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజురోజుకూ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ వుంది. ఈ వ్యాధిగ్రస్తులు తమ వ్యాధి తగ్గడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కీమో థెరఫీ, రేడియేషన్ చికిత్స అందుబాటులో వుంది. అయితే, క్యాన్సర్‌ను నివారించే మందులు, రసాయనాల ధరలు మామూలు ప్రజలకు అందుబాటులో లేవు. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌ను పూర్తిగా తగ్గించే మందుల కోసం ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
ప్రాథమిక దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే మందులతో నయమవుతుంది. వ్యాధి ముదిరితే మందులు వాడినా మృత్యువు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. హైదరాబాద్, బెంగుళూర్, ముంబై, చెన్నై, ఢిల్లీ నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులలో సైతం క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో మాత్రం క్యాన్సర్ నివారణ మందులు లభించడం లేదు. ఈ వ్యాధిని తగ్గించే ‘ఆంకాలజీ’ వైద్యుల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆంకాలజీ వైద్యులు లేకపోవడం వల్ల ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వీరికి డిమాండ్ అధికంగా వుంది. మరోవైపు క్యాన్సర్ వ్యాధి సోకిన రోగులు మానసికంగా కుంగిపోతున్నారు. మందులు వాడుతున్నా మృత్యువుకి దగ్గరవుతున్నామనే భావన వారి మనసులో గూడుకట్టుకుని వుంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ రోగులకు అధునాతన వైద్యం అందించేలా కృషిచేయాలి. ఆరోగ్యశ్రీ పథకంలో ఈ వ్యాధిని చేర్చాలి. ప్రజలు కూడా మంచి ఆహారపు అలవాట్లను కలిగివుండాలి. ధూమపానం, మద్యపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా వుండాలి.
(రేపు ‘కేన్సర్ నివారణ దినం’)

-కె.సతీష్‌రెడ్డి