మంచి మాట

ఒక సిరా చుక్క.. లక్ష మెదళ్లకు కదలిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి తన ఆనందాన్ని, దుఃఖాన్ని వెళ్లగక్కడానికి రూపం ఏర్పరుచుకుంటే అదే కళగా భాసించింది. ఆ కళల్లో పాట, ఆట, మాట కలిసి ఉన్నదాన్ని నాటకం అన్నాం. దానే్న శాస్త్రం చదువుకున్నవారు సర్వకళల సమాహారం అన్నారు. నాటకం అత్యున్నతమైన కళారూపమే. కళారూప పరంపరలో నాటకం పదునైనది. పరమోత్కృష్టమైనది. విభిన్న రుచులుగల జనావళికి ఏక పత్ర సమారాధన చేసేది నాటకం అన్నారు కాళిదాసు.
జాతిని జాగృతం చేసేదీ జాతి జీవనాన్ని ప్రతిబింబించేదీ నాటకం అన్నారు.
విజ్ఞానం ప్లస్ వినోదం ఇంటూ సామాజిక స్పృహ కలసిన రూపమే నాటకం అన్నారు కొత్తగా ఆలోచించే వారు ఆ నాటకం హృదయ తంత్రు లను మీటడమే కాదు వారి ఆలోచనల్లో కొత్త దనాన్ని సంతరించేది. ఆలోచనల వేగం పెంచేది అంతే కాదు అసలు మనిషిని మనీషిగా తీర్చిదిద్దే ఒక శక్తిమంతమైన ఆయుధం నాటకమే. కదిలేదీ, కదిలించేదీ- నడిపించేదీ ముందుకు అడుగులు వేయంచేది కొత్తదనానికి దారులు వేసేదీ నాటకం.
జాగృతి తేవడంలో మున్ముందుఉండేది. చీకటినుండి వెలుతురు వైపునకు నడిపించేది నాటకం. ప్రజలను చైతన్యవంతులను చేసేది నాటకం. చిటికెడు సంతోషాన్ని, పిడికెడు విజ్ఞానాన్ని దోసెడు వినోదాన్నీ, చారెడు జ్ఞానాన్నీ అర్థం చేసుకోవడానికి ఆ దేశపు కళలు ఎంతగానో ఉపకరిస్తాయి’’అంటాడు యాగ్నెస్ డిమీల్లీ శాస్తక్రారుడు.
నాటకం సమకాలీనం, సార్వజనీనం, సార్వకాలికం. అయనా వేనవేల సంవత్సరాల వెనుక నున్న పుటలను కూడా మన కళ్లముందు పరిచేది నాటకం. గతంలోకి తొంగిచూసి అవరోధాలను, అసమానతలను, కలతలను, కన్నీళ్లను చూసి వాటికి పరిష్కారాలు చూపుతూ ఆ సమస్యలకు తిలోదకాలు ఇవ్వడానికి వేదిక నాటకం. మనిషితనాన్ని మనిషిలో తట్టిలేపడానికి విలువైన పదునైనఆయుధం నాటకం. చుట్టూ ఉన్న పరిస్థితులను నూతన దృష్టితో అవలోకింపజేయడానికి ప్రోత్సహిస్తాయి’’ అని అంటాడు బెర్నార్డ్ షా.
భారతీయ నాటకానికి ఒక విశిష్టమైన స్థానం ప్రపంచ చరిత్రలిఖించింది. భరతుడి నాట్యశాస్త్రం నాటక లక్షణాలకు దర్పణం పట్టింది. కాళిదాసు, భాస మహాకవి నాటకాలు భారతీయ ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయాయి.తొలి తెలుగు నాటక రచనకు నాందీ పూజ చేసిన మహానీయుడు కోరాడ రామచంద్రశాస్ర్తీ. తొలి తెలుగు స్వతంత్ర రూపకమైన మంజరీ మధుకరీయాన్ని 1960లో ఆయన సృష్టించాడు. ఆంధ్రా జాన్సన్ పేరు పొందిన కొక్కొండ వెంకటరత్నం పంతులు, వారణాసి ధర్మసూరి సంస్కృతంలో రచించిన నరకాసుర విజయ వ్యాయోగాన్ని, తెలుగులోకి అనువదించారు. వావిలాల వాసుదేవశాస్ర్తీ 1874లో సీజర్ చరిత్ర నాటకాన్ని, 1880లో ‘నందక రాజ్యము’ అనే స్వతంత్ర సాంఘిక నాటకాన్ని రచించారు. ఈ నాటకాలేవీ ప్రదర్శనకు నోచుకోలేదు. ఆధునిక యుగ వైతాళికుడైన కందుకూరి వీరేశలింగం తన హాస్య సంజీవనిలో ‘వ్యవహార ధర్మబోధిని’ రచించి ప్రచురించారు. ఈ నాటకాన్ని ఆయనే 1880లో రాజమహేంద్రవరం శ్రీ విజయనగరం మహారాజాగారి బాలికా పాఠశాలలో మొదటిసారిగా ప్రదర్శించారు. ధార్వాడ నాటక సమాజం రాజమహేంద్రవరంలో నాటకాలను ప్రదర్శించిన పాకలలో కందుకూరి తాను అనువదించిన ‘రత్నావళి’, ‘చమత్కార రత్నావళి’ నాటకాలను దిగ్విజయంగా ప్రదర్శించారు. నాటకం ప్రదర్శనకళ రచనా 1869లోనే పురుడు పోసుకున్నా ప్రదర్శనగా 1880లో రూపు దిద్దుకుంది. తెలుగు నాటకానికి ప్రదర్శన యోగ్యతని కలిగించిన కందుకూరి ఆద్యునిగా చరిత్ర పుటలలోనికి ఎక్కాడు. తొలి తెలుగు నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత కూడా వారిదే. అక్కడనుండి ప్రారంభమైన తెలుగు నాటక ప్రస్థానంలో ఎన్నో మలుపులు, మజిలీలున్నాయ. ఎన్నో సంస్కరణలకు బాటలు వేసింది. కొత్తఆలోచనల అంకురాలను మొలకెత్తించేదీ నాటకమే. కనుక నాటకాన్ని ప్రోత్సహిద్దాం. మన కళలను కాపాడుకుందాం.

- ఆర్. పురంధర్