జాతీయ వార్తలు

జగదీశ్ టైట్లర్‌పై యువకుడి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: కాంగ్రెస్ సీనియర్ నేత జగదీశ్ టైట్లర్‌పై ఒక సిక్కు యువకుడు దాడికి పాల్పడ్డాడు. అయితే టైట్లర్ ఆ యువకుడి దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. దక్షిణ ఢిల్లీలోని చత్తార్‌పూర్‌లో జరిగిన వివాహానికి ఆయన హాజరయ్యారు. అక్కడ శెహాజ్ ఉమాంగ్ భాటియే అనే సిక్కు యువకుడు (23) ఆయనపై దాడికి పాల్పడ్డాడు. వెంటనే ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 1984 సిక్కుల ఊచకోత కేసులో టైట్లర్ పాత్ర ఉన్నట్లు అభియోగాలున్న విషయం తెలిసిందే. గత రాత్రి ఒక వివాహానికి హాజరైన టైట్లర్‌పై సిక్కు యువకుడు దాడికి పాల్పడ్డాడని, ఒక గ్లాస్‌ను ఆయనపై విరసగా, తృటిలో తప్పించుకున్నారని, ఆయనను సురక్షితంగా తరలించామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సిక్కుల ఊచకోత కేసులో మళ్లీ దర్యాప్తు జరపాలని ఢిల్లీ కోర్టు సిబిఐని ఆదేశించిన మరుసటి రోజే ఈ సంఘటన జరగడం గమనార్హం.