జాతీయ వార్తలు

దహీహండీలో పిరమిడ్‌ ఎత్తు పెంచేది లేదు : సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మహారాష్ట్రలో నిర్వహించే దహీ హండీ (ఉట్టికొట్టే పండగ)లో మానవ పిరమిడ్‌ ఎత్తు పెంచేది లేదని, ఇటీవల ఇచ్చిన తీర్పును పునరాలోచించేది లేదని సుప్రీంకోర్టు బుధవారం తేల్చి చెప్పింది.
18 ఏళ్లలోపు వయసు వాళ్లు ఈ ఆటలో పాల్గొనరాదని మానవ పిరమిడ్‌ ఎత్తు 20 అడుగులకు మించి ఉండకూడదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. మైనర్లపై నిషేధం ఉంది కాబట్టి.. పిరమిడ్‌ ఎత్తుపై మరోసారి ఆలోచించాలని ముంబయికి చెందిన కొందరు వ్యక్తులు పిటిషన్‌ దాఖలు చేశారు. పిరమిడ్‌ ఎత్తు కనీసం 25 అడుగులైనా ఉండేలా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయస్థానాన్ని కోరింది. గురువారం కృష్ణాష్టమి వేడుకలు జరగనున్న నేపథ్యంలో తీర్పును పునరాలోచించేది లేదని సుప్రీంకోర్టు చెప్పింది.