డైలీ సీరియల్

బడబాగ్ని 46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆ బాబు భలే సరదా అయిన మనిషి.. ఎప్పుడూ అందరితో కలివిడిగా జోకులేస్తూ నవ్వుతూ, నవ్విస్తూ ఉన్నాడు ఆ వారం రోజులూ. ఇంక రేపు ప్రయాణం అనగా ఆ ఘోరం జరిగిపోయింది. చిత్రంగా ఏ ఆధారం దొరకలేదు. పోలీస్ కుక్కలు కూడా ఏం కనుక్కోలేకపోయాయి.. ఆయన వంటిమీద ఏ వేలిముద్రలూ దొరకలేదు. కానీ గొంతు తాడుతో ఉరేసి చంపినట్టు మాత్రం తెలిసింది. ఊరుగాని ఊరులో యిక్కడ ఆయనకి శత్రువులెవరుంటారు.. అలా అని ఆ హత్య సొమ్మకోసమో, అతని భార్యా, ఆడబిడ్డల కోసమో జరగలేదు.. అసలు వాళ్ళు లేచేసరికి ఆయన జాగింగ్ నుండి వచ్చే దారిలో యింకా కాటేజ్ ఫర్లాంగ్ దూరాన ఉండగా జరిగింది.
‘‘్ఫర్లాంగ్ దూరంలోనే జరిగిందని ఎలా చెప్పగలవ్... చంపి తెచ్చి అక్కడ పడేసి పోవచ్చుగా’’ అడిగాడు భగవాన్..
‘‘ముందుగా శవాన్ని ఎవరు చూశారు...’’
‘‘అదిగో ఆ గార్డన్ రిసార్ట్స్‌లో వున్న పోలీస్‌సార్ చూశాడు.. కాని ఆయన చూసేటప్పటికే ప్రాణం పోయి ఉంది.. ఆయనే బిగ్గరగా అరచి అందరినీ పోగేశాడు.
‘‘ఒకవేళ ఆ సారే చంపి ఉండచ్చుగా’’ మిస్సైల్‌లా దూసుకువచ్చిందా ప్రశ్న రాహుల్ నోటినుంచి.
‘‘్ఛ.. ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్.. ఆయనకేం అవసరం.. ఒకవేళ ఆయనే చంపి ఉంటే ఆయనే ఎందుకు అందరినీ కేకేస్తాడు..’’ నొచ్చుకున్నాడు అతను.
‘‘సరే.. నువ్వా సారుని చూస్తే గుర్తుపట్టగలవా’’ మళ్లీ రాహులే అడిగాడు.
‘‘ఎందుకు గుర్తుపట్టలేను సారు.. ఆ సార్లు అస్తమానం ఇక్కడికి వస్తానే ఉంటారు. కొత్తగా ట్రైనింగ్ అయ్యే పోలీస్ సార్లందరికీ ఎప్పుడూ యిక్కడికి తెస్తానే ఉంటారు కదా...’’
‘‘అంటే ఆ సార్ నీకు తెలుసన్నమాట... ఆయన పేరు..’’
‘‘తెలుసా అంటే కొంచెం తెలుసు.. అంతా ఆయన్ని ‘సాహూ సార్’ అంటారు.. మంచాయన.. ఎప్పుడొచ్చినా మా అందరికీ మిఠాయి తినిపిస్తుంటాడు’’ చెప్పేడతను.
‘‘అంటే ముందుగా శవాన్ని సాహు సారే చూసాడంటావ్.. అతను ఒక్కడే ఉన్నాడా.. కూడా ఇంకాఎవరైనా ఉన్నారా..’’
‘‘కూడా ఎవరూ లేరు సార్.. ఆ సారే చూసి పరీక్ష చేసి అప్పటికే చచ్చిపోయాడని చెప్పేడు సార్.’’
‘‘చూడు.. ఆ సాహు సార్ ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇక్కడకు వచ్చేవాడన్నావ్, ఇంతకుముందు యిలా ఎప్పుడైనా జరిగిందా..?’’
‘‘లేదు సార్.. అసలు యిక్కడ యిలా హత్య జరగడమే మొదటిసారి’’.
‘‘సరే అవసరమైతే నిన్ను కోర్టులో సాక్ష్యం చెప్పడానికి పిలుస్తారు.. యిప్పుడు చెప్పిందే అక్కడా చెప్పు.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు..’’ రాహుల్ మాటలికి భగవాన్ తల పంకిస్తూ నవ్వేడు చిన్నగా.
ఇద్దరు తిరుగు ప్రయాణం అయ్యేరు.. దారిలో ఎవ్వరూ ఏం మాట్లాడలేదు.. ఎవరి ఆలోచనలలో వాళ్ళు ఉండిపోయారు.
ఇంటికి రాగానే భగవాన్ అడిగాడు ‘‘నువ్వు సాహూని అనుమానిస్తున్నావ్ కదా..’’
రాహుల్ నవ్వేడు.. అనుమానం ఏం లేదు, అతనే చేసాడు...’’
‘‘వాట్.. అంత రూఢీగా ఎలా చెప్పగలవ్’’ అదిరిపడి అడిగాడు.
‘‘చెబుతా, సర్ మనం ముందుగా ఓ కప్పు వేడి వేడి కాఫీ తాగితే బాగుంటుందేమో..’’
‘‘నారాయణ.. నారాయణా మంచి స్ట్రాంగ్ కాఫీ పట్రా యిద్దరికీ’’ గట్టిగా కేకేసి చెప్పాడు.
‘‘సార్.. మీకేమనిపిస్తోంది.. సాహూ చంపినట్టు అనిపించడం లేదా.. బై ద బై మీరు ఎన్నో ఏళ్ళు నుంచి యిక్కడే సెటిల్ అయిపోయారు కదా, మీకు అతను గాని ఫ్రెండ్ కాదు కదా..’’
‘‘ఫ్రెండ్ కాదు కానీ పరిచయస్తుడే.. ఆఫీసర్స్ క్లబ్‌లో పరిచయం. ఎంతైనా ఒక గూటి పక్షులం కదా..’’
‘‘ఒకవేళ అతనే ఈ హత్యలు చేసేడు అని ప్రూవ్ అయితే.. మీరేం చేస్తారు.. అతని వైపు వాదించి అతనిని రక్షిస్తారా’’ తమాషాగా అన్నట్టు అడిగాడు.
‘‘నెవర్.. దోషి ఎవరైనా, ఎంత పెద్దవాడైనా అతను నేరం చేసాడు అంటే అతనిని పట్టించడమే కానీ పట్టించుకోడం ఉండదు..’’ సీరియస్‌గా చెప్పేడాయన.
‘‘సరే యిప్పుడు మీకు ఈ కేస్‌లో కొన్ని ఆధారాలు దొరికాయనుకోండి.. మీరు ఎలా రియాక్ట్ అవుతారు.. ఐ మీన్ ఎలా ప్రొసీడ్ అవుతారు..’’ కుతూహలంగా అడిగినట్లు అడిగాడు.
‘‘నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని నాకు అర్థం అయిపోయింది. యింక డైరెక్ట్‌గా విషయంలోకిరా’’.
‘‘ఒక్క క్షణం.. ’’ లేచి తన రూంలోకి వెళ్లి కమల్ లాప్‌టాప్‌తో తిరిగి వచ్చాడు.
‘‘సార్ ఈ రూంలోకి ఎవరూ రారు కదూ’’ ముందు జాగ్రత్తగా అడిగాడు.
‘‘నేను పిలిస్తే తప్ప ఎవరూ రారు..’’
‘‘గుడ్’’ ముందు యిది వినండి, తరువాత నేను మొత్తం విషయం చెబుతాను...’’ కమల్.. మహేష్‌ల సంభాషణ వినిపించాడు.

-ఇంకాఉంది