డైలీ సీరియల్

బడబాగ్ని 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మెలికలు తిరిగింది చాలు. నీ వాలకం చూస్తూంటే.. ఏదో తేడాగా కనబడుతోంది.. ఇంతకీ ఎవరా అమ్మాయి..’’ సీరియస్‌గా అడిగాడు అజిత్.
‘‘మన.. మన క్లాస్‌లో ‘మహిమ’ కొంచెం సిగ్గుపడుతూ చెప్పాడు..’’’
‘‘వార్నీ.. ఆ ఫైర్‌బ్రాండా... నువ్వు చూస్తే నోట్లో వేలుబెడితే కొరకలేనట్లుంటావ్.. ఆ అమ్మాయి ఆవలించకుండానే పేగులు లెక్కపెట్టే రకం. మీ ఇద్దరికీ ఎలా కుదిరిందిరా.. ఇంతకీ చెప్పావా.. ఒన్ సైడ్ లవ్వా..’’ ఈసారి అనే్వష్ అడిగాడు.
‘‘పాపం.. మంచిదిరా..’’
‘‘అబ్బో అంతా ప్రేమే.. ఇంతకూ చెప్పావా, లేకపోతే ఏ శుభలేకో చేతిలో పెడుతుంది.. నువ్వు దేవదాస్‌లాగా విరహ గీతాలు పాడుకోవాలి’’ వెక్కిరింపుగా అన్నాడు అజిత్.
‘‘అవి విరహ గీతాలు కాదురా విషాద గీతాలు’’ సరిదిద్దాడు అనే్వష్.
‘‘్ఛ.. పొండిరా తనే ప్రపోజ్ చేసింది..’’ కొంచెం వుడుక్కుంటూ చెప్పాడు అరుణ్.
‘‘అదీ సంగతి.. పోనీ ఎస్ చెప్పావా, సిగ్గుపడుతూ తల దించుకున్నావా’’ ఏడిపించడం మొదలుపెట్టాడు అజిత్.
‘‘చ్చా.. వూరుకోండిరా.. పాపం అమాయకుడిని చేసి..’’ వెనకేసుకొచ్చాడు అమర్.
‘‘అదే మరి.. వాడు అమాయకుడా.. సైలెంట్‌గా ఆ అమ్మాయిని బుట్టలో పడేసి.. పాపం ఈ అనే్వష్‌గాడు చూడు ఏడాదిగా నమిత కోసం అష్టకష్టాలు పడుతున్నాడు. ఇంతవరకూ రిజల్ట్ లేదు.. పైగా వాడు ఫాస్ట్ అని పేరొకటి..’’ అనే్వష్‌ని వెర్రెక్కించడం మొదలుపెట్టాడు అజిత్...
నవ్వుతూ అన్న అమర్ మాటల్లో అర్థం యిదా.. పైకి నవ్వినా వాడి మనసులో ఇంత బాధ వుందన్నమాట.. ప్చ్.. అనే్వష్ నిద్రలో ఉన్నాడనుకుని రాహుల్ చాలా రిలాక్స్‌డ్‌గా తన సూట్‌కేసును తెరిచి అందులో భద్రంగా వున్న ఒక బాక్స్ ఓపెన్ చేసి అందులోనుంచి ఒక బాటిల్ ఒక డిస్పోజబుల్ సిరంజ్ తీసి ఖుషీగా ఒక పోటు పొడుచుకుని టాయిలెట్‌లో ప్లష్ చేసేశాడు ఆ రెండింటినీ.. ఆరి దుర్గార్గుడా అయితే నా అనుమానం నిజమేన్నమాట.. చాప కింద నీరులా ఉంటూ ఎంత పని చేసావ్..
ఏమిటి.. వీడు బాత్రూంలోకి వెళ్లి యింత సేపయినా ఇంకా రావడంలేదు.. చూద్దాం.. కీ హోల్ గుండా మెల్లిగా చప్పుడు కాకుండా చూసిన అనే్వష్‌కి ఆనందంతో మతిపోయింది.. వాడు అక్కడ స్నానాల బల్లమీద కూర్చుని తన కుడిపాలు పాదం ఆర్ట్ఫిషియల్ లింబ్ ఊడబెరికి డెట్టాల్‌తో క్లీన్ చేసి శుభ్రపరచి పౌడర్ జల్లి మళ్లీ దానిని యధాతథంగా పెట్టుకుంటున్నాడు..
అమర్.. నిండు నూరేళ్లు హాయిగా ఉండవలసిన వాడివి ఎంత అన్యాయం అయిపోయావ్.. అది కూడా తన శత్రువుని హత్య కేసులో ఇరికించడం కోసం ఏ శత్రుత్వం లేని నిన్ను చంపడం ఎంత అమానుషం.. అన్యాయం.. ఈ రాహుల్ గాడిని ఎలాగైనా దోషిగా పట్టించి శిక్ష పడేటట్లు చేసి నీ ఆత్మకి శాంతి కలిగిస్తా.. మన స్నేహం సాక్షిగా చెబుతున్నా.. అశాంతిగా తల రుద్దుకుంటూ పొర్లుతున్న అనే్వష్, బాత్‌రూం తలుపు తీసిన చప్పుడికి చటుక్కున నిద్ర నటించసాగాడు.
రాహుల్ అనే్వష్ కేసి ఓరకంట చూసి నవ్వుకున్నాడు.. నీ వేషాలు నా దగ్గరా అన్నట్టు. ఎప్పుడు తెల్లవారుతుందా తను కనుగొన్న విషయం ఎప్పుడు లాయర్ భగవాన్‌కి చెబుదామా అని తెగ ఆరాటపడిపోయి నిద్రపట్టక తెల్లవారు జాము పడుకున్న అనే్వష్ జాము పొద్దెక్కాక లేచాడు.. లేస్తూనే తన తల దగ్గర ఉన్న ఒక బుక్‌లో చిన్న కాగితం చూసాడు. అందులో...
‘‘అనే్వష్ ఏమిటి, నువ్వు చూసినవి, కనిపెట్టినవి చెప్పేసి, ఆధారాలతో సహా నిరూపించి నన్ను ఉరికంబం ఎక్కించి ఆ అజిత్‌గాడిని రక్షించుకుందామనే.. ఆశ.. దోసె.. అప్పడం.. వడ.. నువ్వు నా రూంలో అరెస్ట్.. బాగా రెస్ట్ తీసుకో.. ఆ కేసు క్లోజ్ అయి అజిత్‌గాడికి శిక్ష పడ్డాకనే నీకు ఇక్కడనుంచి విముక్తి.. బై.. బై ది బై నువ్వు ఫోన్ చేసి శ్రమపడకుండా నీ ఫోన్ నేను పట్టుకెళుతున్నా.. ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోక హాయిగా రిలాక్స్‌కా..
సంతకం లేని ఆ చీటి చూసి వళ్ళు మండిపోయింది.. వచ్చిన పని పూర్తి చెయ్యకుండా.. హాయిగా ఒళ్లు మరచి నిద్రపోయిన తనని తనే తిట్టుకున్నాడు..
‘‘ఎలా.. ఇక్కడనుంచి ఎలా బయటపడాలి..? ఎలా రాహుల్ అసలు స్వరూపం కోర్టులో చూపించాలి? సరే.. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ కూర్చునే కన్నా.. ప్రస్తుతం దొరికిన సమయం సద్వినియోగం చేసుకుంటే బెటర్.. చటుక్కున లేచాడు.. రాహుల్ నిన్న డ్రగ్ బాటిల్ గట్రా తీసిన పెట్టె దగ్గరికి వెళ్లాడు.. లక్కీగా.. ఎటూ గదిలో పెట్టి తాళం వేశాంగా.. ఇంక వీడేం చేస్తాడులే అనుకున్నాడే ఏమో.. పెట్టి తాళం తీసే ఉంది.. నెమ్మదిగా బట్టలు తొలగించి చూసేడు.. పెట్టె అడుగున బట్టల కింద ఒక చిన్న బాక్స్.. ఓపెన్ చేసి చూస్తే అందు చిన్న చిన్న బాటిల్స్ బోలెడు ఉన్నాయి.. దేనిమీదా లేబిల్స్ లేవు.. అన్ని డ్రగ్స్ ఒకచోట ఉన్నాయంటే వీడికి ఈ అలవాటు ఇప్పటిది కాదన్నమాట.. పక్కనే డిస్పోజబుల్ సిరంజీలూ... గురుడు రోజూ తీసుకుంటాడులా ఉంది.. అనుకుంటూ ఆ సీసాలు తీసి ఒక చిన్న కవర్‌లో వేసుకున్నాడు.. వేసుకునేటప్పుడు.. గమ్మున ఆ రోజు భగవాన్ చెప్పిన మాట గుర్తొచ్చి చేతితో తాకుండా వాటిని పెట్టెతోనే కవర్‌లో వంపేశాడు.. సరే వాడు ఎందుకోసం చేసినా ఇది ఒకందుకు మంచిదే.. ఈ సమయం మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి.. అనుకుంటూ బ్యాగ్‌లోంచి సిసి కెమెరా తీశాడు.. వాడు, వాడి కాలు ఎక్కడ డ్రెస్సింగ్ చేసుకుంటున్నడో తెలిసిందిగా.. అక్కడ దీన్ని ఫిక్స్ చేద్దాం.. యిప్పుడు కాకపోతే ఇంకాసేపట్లో, ఈవేళ కాకుంటే ఇంకోనాడు రాక ఎక్కడకి పోతాడు.. వస్తాడు..

- ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్