డైలీ సీరియల్

పూర్వజన్మ సుకృతం.. భక్తి ( ప్రహ్లాదుడు -5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టలు తెంపుకున్న ప్రవాహం లాగా హిరణ్యకశిపునిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. వెంటనే కోపోద్రేకంతో ఎర్ర బడిన కనులతో చండామార్కులను చూశాడు. ‘ఏమోయి? నీవు భృగువంశ సంజాతుడవని నమ్మాను. శత్రువు స్మరణ, శత్రువు భజన చేసే నీవెలా నా దగ్గర కాలం గడుపుతున్నావు. నీ ఆయువు ఇంకా ఉందేమి? చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు నా ఇంట్లో శత్రువులను ఉంచుకుని నేను అమరావతిపై దండెత్తి ముల్లోకాలను జయించానని అనుకొన్నానా ? నీవు ఎంత దుర్మార్గమైన ఆలోచనలున్న బ్రాహ్మణుడివి. ఇన్నాళ్లు శాస్త్ధ్య్రాయనం చేయిస్తానని చెప్పి నాకుమారుడిని ఇంత శత్రువు గురించి చెప్పావా? నీవు నిజంగా బ్రాహ్మణుడివేనా? వారు ధర్మాన్ని తప్పరు కదా. దుర్మార్గులను వారి వారి పాపాల కారణంగా రుగ్మతలు వారిని పట్టిపీడిస్తాయి. కానీ నీలాంటి అధర్మపరులైన బ్రాహ్మణులను ఆ అధర్మమే ప్రాణాంతకంగా మారుతుంది. నీకిది తెలియనట్టు ఉంది అని ఆగ్రహావేశాలతో ఉడికిపోతున్న దానవేంద్రుడిని శాంతింప చేయడానికి రాజ పురోహితులు ఇలా అన్నారు.
‘మహారాజా! శాంతించండి. మేము సదా మీ మేలును శుభాన్ని కోరేవారిమే కానీ శత్రువులం కాదు. మీ రాజవంశ పురోహితులం మేము. భృగువంశీయులం. మేమెన్నటికీ మీకు వ్యతిరేకులం కాదు. మేమీ విద్యనేమీ మీ పుత్రునికి నేర్పివ్వలేదు. మేమే కాదు అసలు ఎవ్వరూ ఇతనికి శ్రీహరి గురించి చెప్పినది లేదు విన్నదీ లేదు. ఇతనికితడే ఇదంతా చెబుతున్నాడు. మా దగ్గర ఉన్నంత కాలమూ శాస్త్ధ్య్రాయనాలను సాగించాము, మీ ఉన్నతిగురించి చెప్పాము, ప్రహ్లాదునికి పుట్టిన బుద్ధి వల్లనే ఈ ప్రేలాపనలు చేస్తున్నాడు కాని ఇవి అంతా విన్నవి కాదు నేర్చుకున్నవీ అసలే కాదు మన్నించండి. మీరు పరీక్షించండి. పురోహితుల మాటలతో మరింత క్రోధం విజృంభించి ‘కుమారా! నిజం చెప్పు. నీకెవరు చెప్పారు? మన శత్రువును కీర్తించమని ఎవరు నేర్పారు నీవు చెప్పేదంతా అబద్ధాలు నీవు నిజం చెబితే నీకు ఎట్టి ఆపద కలుగకుండా నేను చూసుకొంటాను’ అన్నాడు హిరణ్యకశిపుడు
‘తండ్రీ! నీవెంత అమాయకుడివి. హరి ని కీర్తించాలన్నా, భజించాలన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలి కాని ఎవరైనా నేర్పితే వచ్చే చదువా ఇది? ఎన్నో జన్మల పుణ్యఫలంగా నాకు ఆ హరిపైన నమ్మకం హరిపైన ఇష్టమూ కలిగింది కానీ ఎవరికైనా హరిని గూర్చి వినాలని కాని, ఆయన గురించి భజన చేయాలని కానీ పూర్వజన్మ పుణ్యం లేశమంత లేకపోతే ఎక్కడైనా కలుగుతుందా? సుకృతి లేనట్టయితే మాయామోహంలో పడి ఈ జనన మరణ చక్రంలోనే కొట్టుకొంటూ ఉంటారు కానీ వారికి దీనినుంచి విడివడాలన్న కోరిక జనించదు. వారికై వారికి హరిభక్తి పుట్టనిదే ఎవరైనా చెబితే తలకెక్కదు. ఏదైనా ఆశచూపించినా కూడా వారికి హరిని భజించాలన్న తలంపు రాదు.
చీకటిలోంచి చీకటిలోకి వెళ్లినంత మాత్రాన వెలుగు వస్తుందా? ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి వెలుతురు చూపించగలడా నాన్న.. ఇదంతా కేవలం నీ భ్రమనే. నాకు ఇక్కడ ఎవ్వరూ శ్రీహరి గురించి చెప్పనేలేదు. నేనే ఇక్కడి చిన్న చిన్న బాలకులకు చెప్పితిని కానీ వారు మరలా అజ్ఞానంలోకి వెళ్లిపోతునే ఉన్నారు. ఎన్ని జన్మలనెత్తినా కూడా హరి పైన ప్రేమ పెంచుకొనని జీవి నరక బాధలను తప్పించుకోలేదు. రాక్షసరాజా! నేను అన్నీ శాస్త్రాలను పఠించాను. అన్ని విద్యలను చదివాను. కానీ నాకు ఎక్కడా చిత్త శాంతి లభించలేదు. కేవలం హరినామాన్ని ఉచ్చరించినపుడు మాత్రమే నాకు మనశ్శాంతిగా అనిపించింది. కనుక నేను నిజము చెబుతున్నాను. ఈ పదవులు, పౌరుషాలు, ఇదంతా మాయ నీవు, నేను ఇక్కడ ఉంటూ నీకీర్తి అని చెబుతూ వీరు పాడే నీ కీర్తనలు అంతా మాయ ఇవన్నీ నీటిబుడగ పగలిపోయి నీటిలో కలసిపోయినట్లుగా ఈ జగత్తు ప్రళయకాలంలో నాశనం అయ్యేటపుడు ఇవన్నీ అందులో కరిగిపోతాయి. నీకు కనిపించే ఈ జగత్తు అంతా మాయ.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి