డైలీ సీరియల్

విలువల లోగిలి-50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి అలవాట్లంటే ఈరకంగా ఉండాలి అని తెలియజేయటానికే ఇది ప్రారంభించాం అన్నది నెమ్మది నెమ్మదిగా హైస్కూలు, కాలేజీగా అభివృద్ధి చెయ్యాలి. మంచి స్ట్ఫాని నియమించటంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒకసారి వాళ్లను తీసుకున్నాక మళ్లీ మనం వాళ్ళెలా చేస్తున్నారని వెనక్కి తిరిగి చూసేట్లు ఉండకూడదు.
పిల్లలు ఆడుకోవటానికి చక్కని గ్రౌండు ఉండాలి. ఇలాంటిది అద్దెకు తీసుకున్నా ఫర్వాలేదు.
స్కూలుకి పేరేం పెడదాం? అంది అమృత తన అంగీకారాన్ని, ఉత్సాహాన్ని ఒకేసారి తెలియజేస్తూ.
‘‘లోగిలి’’
‘‘బాగుందమ్మా! చందూ ఇప్పుడు చెప్పు నీ అభిప్రాయం?’’
‘‘మీకంతా ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు’’.
‘‘సుగుణా! నువ్వేమంటావ్?’’ అడిగింది అమృత.
‘‘చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన విషయం. అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదనిపిస్తోంది’’ అందావిడ.
‘‘చందూ! ఆ బిల్డింగ్ లీజ్‌కిస్తారేమో కనుక్కో! లేదా అమ్మకానికేనా అన్నది తెలుసుకో అన్నారాయన.
‘‘విశ్వా! మనం అనుకునే స్కూలుకి అది బాగుంటుందంటావా?’’
‘‘అసలు ఆ బిల్డింగ్‌ని చూసినపుడే ఇలా చేస్తే బాగుంటుందనిపించింది’’.
‘‘విద్య సుగంధం లాంటిది. సర్వత్రా వ్యాప్తి చెందితేనే దానికి అందం, పరిమళం. అలాంటి మంచి పనికి అనుకోకుండా ఈ రోజు అంకురార్పణ చేశాం. అందరూ ఆనందంగా హాయిగా నిద్రపోండి’’ అంటూ వెళ్లిపోయాడు నరేంద్రనాధ్.
‘‘అందరికీ గుడ్‌నైట్’’ అంటూ అమృత ఆయన్ని అనుసరించింది.
సుగుణ కూడా వెళ్ళబోతుంటే ‘‘అమ్మా! నేను చెయ్యాలనుకున్న పని మంచిదేనా?’’ సందేహాన్ని వ్యక్తం చేస్తూ అడిగింది విశ్వ.
‘‘విశ్వా! ఏదైనా ప్రారంభించినపుడు అంతా సులభంగానే ఉంటుంది. సముద్రాన్ని దూరంనుంచీ చూస్తుంటే ఎంత బాగుంటుంది? ఒక్క అడుగు లోపలికి వెయ్యి. తడి తగులుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్లు. అప్పుడుగానీ దాని లోతు తెలియదు. అప్పుడే కష్టం తెలుస్తుంది. దానికి భయపడి వెనకడుగు వెయ్యకుండా ముందుకు సాగాలి. నీకు వందశాతం మంచిగా అనిపిస్తేనే ముందుకు అడుగువెయ్యి. ప్రక్కవారికి నచ్చిందా లేదా అన్నదాని గురించి పట్టించుకోకు. నన్నడిగితే నేనిచ్చే సలహా ఇదే’’ అని చెప్పి వెళ్లిపోయింది.
‘‘బాప్‌రే! అమ్మేనా అంత మాట్లాడింది?’’ ఆశ్చర్యపోతూ అన్నాడు చందూ.
‘‘అమ్మ అంటే ఏమిటనుకున్నావ్? నాకంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివింది. స్కూల్లో చదువుకోలేదు గానీ గ్రంథాలయంలో ఇంచుమించు అన్ని పుస్తకాలలు చదివేసింది’’.
‘‘ఇంకేం? ఇంట్లో ముగ్గురూ ముగ్గురే అన్నమాట’’
‘‘ఏదో మీరిద్దరూ కాదన్నట్లు’’
‘‘మీ ముందు మేమెంతలేమ్మా’’
‘‘అచ్ఛా! ఎంత అమాయకత్వం?’’
‘‘నీ గడసరితనంముందు నిజంగా నేను అమాయకుడినే’’
‘‘అవును మరి. నోట్లో వ్రేలు పెట్టినా కొరకలేరు’’
‘‘పెట్టి చూడవచ్చుగా’’
‘‘నేనేం చూసి తెలుసుకోనక్కర్లేదు. నాకు నొప్పి పుడుతుందని నా వేలైతే అస్సలు కొరకరు. అంత వరకూ ష్యూర్’’
‘‘ఎంత నమ్మకమో! సరే! పద! నిద్రకు వేళాయెరా అంటోంది మనసు.
‘‘నాకయితే నిద్రపట్టేట్లు లేదు. అత్తయ్య, మామయ్యలు ఇంత తొందరగా నా ప్రపోజల్‌కి అంగీకరిస్తారనుకోలేదు. నా భావాలు వారితో పంచుకోవటంలో తప్పులేదన్నట్లు చెప్పానంతే!’’
‘‘ఏ పనయినా నిస్వార్థంగా ఆలోచించి చెయ్యాలని అనుకుంటే పనులన్నీ వాటికవే అయిపోతాయి’’
‘‘ఇదంతా నాకు కలగా ఉంది’’
‘‘రేపుశివను పంపి ఆ బిల్డింగ్ ముందు ‘టు సేల్’ బోర్డుమీదున్న నెంబరు రాసుకుని రమ్మను. విషయం కనుక్కుందాం. ఇప్పుడే మాట్లాడి ఉండేవాడ్ని. బాగా రాత్రయింది. ఇప్పటికే వాళ్ళంతా మంచి నిద్రలో ఉంటారు. అందుకే రేపు మాట్లాడుదామంటున్నా’’
‘‘నాకు తెలుసు’’
‘‘మరింకేం జాగారం మానేసి హాయిగా నిద్రపో. నేను జోకొడతాగా’’ అపుడు తనకు తెలియకుండా తనే నిద్రలోకి వెళ్లిపోతుంది అనుకుందామె.
***
‘‘హలో!’’ అన్నాడు సూర్యచంద్ర.
‘‘హలో!’’ అటునుంచీ సమాధానం వచ్చాక మేము ప్రక్క బిల్డింగ్ ‘‘అమృత సాఫ్‌టెక్ సొల్యూషన్స్’’ సిఇఓని మాట్లాడుతున్నానండీ. మీ బిల్డింగ్ అమ్ముతారని బోర్డుపెట్టారు గదా. ఎంతకిస్తారు? లీజ్‌కేమయినా అవకాశం ఉందా అని అనుక్కోవటానికి చేసానండీ’’.
అటువైపు నుంచీ సమాధానం లేదు.
‘‘ఏంటండీ! మాట్లాడటంలేదు?’’
వీడు ఎవరో వచ్చారని బయటకు వెళ్లటం మంచిదయింది. హడావిడిలో సెల్ మరిచిపోయినట్లున్నాడు. నాకు తెలియకుండా నా ఇంటినే అమ్మేద్దామనుకున్నాడన్నమాట. లేకపోతే తనకీ విషయం తెలిసేదే కాదు. వీడి పని చెబుతానుండు అనుకున్నాడు ఆయన మనసులో.
‘‘హలో! సార్! మాట్లాడరేమిటండీ?’’ అవతలి నుంచీ సూర్యచంద్ర మళ్లీ రెట్టించాడు.
‘‘నేనే మీ దగ్గరికి వస్తున్నాను’’ అని ఫోను పెట్టేశాడు
ఆయన ఎవరో ఏమిటో చెప్పరేం?
ఎన్నిసార్లు అడిగినా మాటేలేదు.
సర్లే! వస్తానంటున్నారుగా అప్పుడే మాట్లాడవచ్చు. అరగంటలో సూటుబూటులో ఒక పెద్దాయన వచ్చి తలుపు తట్టాడు.
గంగ వెళ్లి తలుపు తీసింది.
‘ఎవరండీ మీరు’ అని అడిగింది.
‘్ధన్‌రాజ్’ వచ్చాడని ఇంట్లో చెప్పు అన్నాడాయన.
‘‘ఎవరు గంగా?’’ అంటూ ఈలోపువిశ్వ హాలులోకి వచ్చింది.
‘‘ఎవరో ధన్‌రాజ్‌గారటమ్మా!’’
‘‘లోపల కూర్చోబెట్టు. మామయ్యగారికోసం వచ్చి ఉంటారు’’ అంది.
‘‘రండి సార్! ఇలా వచ్చి కూర్చోండి’’ అని సోఫా చూపించింది.
‘‘మామయ్యా! మీ కోసం ధన్‌రాజ్ గారు వచ్చారు’’ అంది లోపలికి వెళ్లి.
‘‘అలాంటి పేరున్న వాళ్ళెవరూ నాకు తెలియదే. చందూ కోసం వచ్చారేమో’’ అంటూ బయటకు వచ్చారు.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206