డైలీ సీరియల్

విలువల లోగిలి-52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ ప్రదేశంలో చేపలు పట్టేవారు ఎక్కువ. అదే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళను ఒప్పించే సరికి తల ప్రాణం తోకకు వచ్చింది. మా పిల్లలకు చదువు అక్కర్లేదు అని కొందరు, ఇంట్లో సాయపడతారని ఇంకొందరు, మాకు తిండికి లేకపోయినా మా పిల్లలకు ఇంగ్లీషు చదువులే చదివిస్తామని మరికొందరు మాట్లాడుతుంటే విశ్వకు ఏం చెయ్యాలో తోచలేదు.
లాభం లేదని వదిలెయ్యటం తన పద్ధతి కాదు. వీళ్ళు రమ్మన్నా వచ్చి తను తయారుచేసిన సీడిని చూడరు. అందుకని వాళ్ళ దగ్గరికే దాన్ని తీసుకెళ్లి ఆడవాళ్ళందరినీ బలవంతంగా కూర్చోపెట్టి చూపించింది. అది వాళ్ళలో ఆలోచనను రేపింది. మగాళ్ళను సతాయించటం ప్రారంభించారు.
అదేమీ తెలియపోయినా ప్రయత్నలోపం తమవైపు లేదు కాబట్టి ఎదురుచూడటం తప్ప మరోదారి లేదనుకుంది విశ్వ.
‘‘నిరుపేదలున్న ప్రతి ప్రదేశాన్ని చుట్టివచ్చాం. ఒక మంచి పని చేస్తామంటే ఇదేనా ప్రోత్సాహం?’’ అని ఒకింత నిరుత్సాహపడింది అమృత.
సుగుణ మాత్రం నిరాశపడకండి, పిల్లలు తప్పక చేరుతారు, కాస్త ఆలస్యంగా అంతే అని ధైర్యం చెబుతూనే ఉంది వాళ్ళిద్దరికీ.
శివ, గంగ తమకి పిల్లలుంటే చేర్చేసేవాళ్ళమని వాపోయారు. అలా నెల గడిచిపోయింది ఎదురుచూపులతోనే.
ప్రతిరోజూ ఉదయం ఉషాకిరణాలు తనని తాకగానే ఈ రోజు ఒక విద్యార్థి అయినా తనకు దొరుకుతాడేమో అనుకునేది. ఆ రోజు గడిచిపోయేది. మళ్లీ తెల్లవారేది. కానీ ఫలితం మాత్రంలేదు. అలా మరో పదిహేను రోజులు గడిచిపోయాయి.
విశ్వకు భగవంతుని మీద చాలా కోపం వచ్చింది. ఎవరూ సహాయం చేయకపోయినా ఫర్వాలేదు. నీ బిడ్డకు నువ్వు కూడా ఆసరాగా నిలబడవా? మంచికి న్యాయం చేస్తావని నీమీద నమ్మకంతోనే నేను ప్రతి అడుగూ ముందుకు వేస్తాను. నువ్వు దగ్గరుండి నా చేతిని పట్టుకుని నడిపిస్తావని నమ్ముతాను. నా నమ్మకాన్ని ఇలా వమ్ము చేస్తావనుకోలేదు అని తీవ్ర స్థాయిలోనే ఆయన్ని దూషించింది. అలా పూజ గదిలో కూర్చుని విశ్వ మాట్లాడటం విన్న అమృత, సుగుణకి విశ్వను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు.
అలా అన్నదో లేదో గంగ బయటనుంచి ‘‘విశ్వమ్మగారూ! మీకోసం ఎవరో వచ్చారు’’ అని కేకేసింది.
వెళ్ళి చూస్తే బయట ఇద్దరు చిన్నారులు ‘‘మీ బడిలో చేరుతామంటూ అక్కడ నిలబడ్డారు.
ఇది నిజంగా తను ఊహించలేదు.
ఆ రోజు అమ్మ కొంగు చాటునుంచీ నిక్కి నిక్కి చూసిన చిన్నారులు, స్వచ్ఛందంగా, నిండు హృదయాలతో తనకు స్వాగతం పలుకుతున్నారు. ఇంతకంటే ఏం కావాలి?
వేయి అడుగుల ప్రయాణానికైనా ఒక అడుగు వేస్తేనే ముందుకు కదిలేది అనే పెద్దల మాట గుర్తుతెచ్చుకుంది.
వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకుంది.
అమ్మను తీసుకువస్తాం అని చెప్పి సముద్రం వైపు పరుగెత్తారు. అరగంటలో వాళ్ళ అమ్మలను తీసుకువచ్చారు.
వాళ్ళూ పిల్లలను చేర్చటానికి సంతోషంగా ఒప్పుకున్నారు. వాళ్ళను తొలి విద్యార్థులుగా స్కూలులో నమోదు అయ్యారు. వారికి మొట్టమొదటి క్లాసు తనే తీసుకుంది. అ.. ఆలతో వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసింది.
పిల్లలు ఇద్దరే అయినా మాష్టర్లు తమ పని ప్రారంభించారు.
అదే రోజున ‘టైలర్’ వచ్చి వారి కొలతలు తీసుకుని సాయంత్రంకల్లా డ్రస్సు కుట్టి తీసుకువచ్చాడు.
ఆకుపచ్చరంగు లంగా, తెలుపురంగు జాకెట్టు, కాషాయరంగు కాలర్‌తో భారతదేశపు జెండాను ప్రతిబింబింపచేస్తూ తయారైనవాటిని ముద్దుపెట్టుకుంది విశ్వ.
తన దేశభక్తి చాటుకున్న సైనికుడిలా మురిసిపోయింది. పిల్లలకు వాటిని అందజేసింది. రేపు వచ్చేటప్పుడు అవే వేసుకురమ్మంది. తను తెప్పించిన చెప్పులు కూడా వాళ్ళకాళ్ళకు తొడిగింది.
అందం కోసం చిన్నారుల పాదాలు షూస్‌లో మగ్గిపోవటం ఇష్టం లేకపోవడమే దానికి కారణం.
మల్లెపూవుల్లాంటి తెల్లటి రిబ్బన్లుకూడా వాళ్ళ చేతుల్లో పెట్టింది. ఒక సంచిలో మరో జత డ్రెస్సులు జత రిబ్బనులు పెట్టి ఉంచి వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరైనా వచ్చి తీసుకెళ్ళమని వారికి చెప్పి పంపింది. వారు ఆనందంగా తిరిగి వెళ్ళటం ఆమెకు ఎంతో మనశ్శాంతిని కలిగించింది. గత కొద్ది రోజులుగా అదే కరువయ్యింది ఆమెకు.
ఆ రోజు మొదలు ఒకరో, ఇద్దరో చేరుతూనే ఉన్నారు. అలా అన్ని స్కూల్స్ ప్రారంభమయ్యే సమయానికి పాతిక సంఖ్యలో పిల్లలు తన స్కూల్లో ఉండటంతో సంతృప్తిపడింది.
విశ్వ చేసే ఈ ప్రయత్నం మరుగున పడ్డ మాణిక్యంలా ఉండకూడదనిపించి విశ్వ పేరుతో ఓ వెబ్‌సైట్ ప్రారంభించి అందులో ఆమె చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రెజంట్ చేసాడు చందూ. వాటికి ఫొటోలు జత చేశాడు.
దీనికి విశ్వ ససేమిరా ఒప్పుకోలేదు.
‘‘నా మాట విను విశ్వా. ఇది మనకు ప్రాపగాండా చేసుకోవటం కాదు. మనతో ఇలాంటి కార్యక్రమాలకు ముగింపు పలకుండా మరికొందరు అలాంటి పనులను ఉత్సాహంగా చేసుకోవటానికి మార్గదర్శిగా మనం నిలబడాలని. ముందుముందు దీని ఉపయోగమేమిటో నీకే తెలుస్తుంది. ఈ ఒక్కసారికి నా మాట విను’’ అని బలవంతంగా ఆమెను ఒప్పించాడు.
కానీ తర్వాత తెలిసింది అదెంత మంచిపనో?
వెబ్‌సైట్‌లో చూసిన వాళ్ళెందరో స్పందించారు. హాస్టల్ వసతి కల్పించగలిగితే మా పిల్లల్ని నిరభ్యంతరంగా మీ దగ్గరకు పంపుతామని సూచించారు. మాతృభాషమీద మమకారం, బరువుల చదువులమీద విరక్తి దానికి కారణం.
అలా వచ్చిన మెయిల్స్‌ని చూసి విశ్వ చాలా ఆనందపడింది. ఇంకా సెక్షన్లు పెరిగినా ఫర్వాలేదు. స్కూలుకు మంచి పేరు రావాలి. పిల్లలు అభివృద్ధిలోకి రావాలి. దానికోసం ఎంతైనా కష్టపడగలను అని నిశ్చయించుకున్నాక ఆ ప్రతిపాదనకు కూడా పచ్చజెండా ఊపారు.
ఉచితంగా ఇంత పెద్ద ప్రాతిపదికలో చేస్తున్న ఆ కుటుంబ యత్నానికి చేయూతనిస్తామని ఎందరో ముందుకువచ్చారు. విరాళాల వెల్లువ మొదలైంది. వాటన్నింటిని సక్రమంగా వాడటం, లెక్కలు చూసుకోవటం సుగుణకి అప్పజెప్పింది. ఎలాగూ స్కూల్లో క్లర్క్‌ల సహయం ఉంటుంది. ఒకరి చేతులమీదే ఆ అకౌంట్ నడవాలన్నది ఆమె ఉద్దేశం.
- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ, 9247260206