డైలీ సీరియల్

విలువల లోగిలి-54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదంతా తెలుసుకున్న ఆ ప్రేమజంట ‘‘ఇక తాము మీ ఇంటికి రామని చెప్పారు. మావల్ల మీరు అందరికీ దూరమవటం మాకిష్టంలేదు’’ అన్నారు.
అది వాళ్ళ సంస్కారం.
చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపించింది విశ్వకయితే.
‘‘అంత మాట్లాడింది, మిమ్మల్ని దూరం చేసుకోవటానికి కాదు. మనల్ని ఎవరు కాదన్నారో మళ్లీ వాళ్ళే మన దగ్గరకు రావాలి. మీరలా అనుకుని దూరమైతే మేమంతా బాధపడవల్సి వస్తుంది. మూర్ఖంగా వ్యవహరించినవాళ్ళు అందులోంచి బయటపడేవరకూ మనం వేచి చూడాల్సిందే. అంతకంటే చేసేదేం లేదు’’ అన్నాడు సూర్యచంద్ర స్పష్టంగా.
విశ్వ అయినా చందూ అయినా ఒకరు ఒక మాటంటే రెండోవారు దానికి కట్టుబడిపోతారు.
ఇంట్లో వాళ్ళంతా కూడా అదేమాట అనటంతో వారి రాకపోకలు మామూలయ్యాయి.
***
బయట కాకి ఓ అరుస్తోంది.
తనకి ఆకలి విషయం తెలియకపోయినా అది మాత్రం టైము తప్పకుండా ఠంచన్‌గా వచ్చేస్తుంది.
అదే తనకు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనుకుంది విశ్వ. అందరూ భగవంతుడికి ముద్ద పెడతారు. తను మాత్రం ఆయనకు నమస్కరించి ఆ ముద్దను పక్షికే పెడుతున్నాననుకుంటుంది. అమ్మ మాత్రం భగవంతుడే పక్షిరూపంలోవచ్చి తింటాడంటుంది. భావన ఏదయినా మనం చేసేది పక్షులకు ఆహారాన్ని అందించటమే గదా అన్నది తన వాదన.
అమ్మ అన్నా అనకపోయినా రోజూ ముద్ద పెట్టేముందు ఇదంతా గుర్తువస్తుంది. పక్షులకు దాహం వేసినపుడు నీళ్ళు దొరక్కపోతే మురికి కాలువలో కూడా దూరుతాయి. అందుకని ఒక గినె్నతో వాటికోసం నీళ్ళు కూడా పెడుతుంది. తమ ఊళ్ళో అయితే పావురాల కోసం జొన్నలుకూడా కొనేది. అవన్నీ తమ ఇంటి పక్షులులా నిర్భయంగా మా ఇంట్లో తిరిగేవి. అవి చేసే గున గున శబ్దాలు తనకు సంగీతంలా వినిపించేవి. కాసేపు వాటితో ఆడుకోవడం తనకి కాలక్షేపం కూడా! ఒకసారి ఒక పావురం గాయపడింది తమ ఇంటికివచ్చింది. అది తగ్గి మామూలుగా తిరిగేదాకా తన మనసు మనసులో లేదు. దానిని ఎక్కడికి తీసుకువెళ్లాలి తగ్గకపోతే అని. తనకా బాధ రానీకుండా దానికి తొందరగానే తగ్గిపోయింది. మరి పశువులకు వెటర్నరీ డాక్టర్లు ఉన్నట్లు పక్షులకెవరున్నారో తెలియదు.
ఏమిటో! ఏ నిముషాన ఏ ఆలోచనలు ఎటునుంచీ వస్తాయో తెలియదు. ఒక్క నిముషం కూడా మనని వదలనివి ఏవి అంటే ఈ ఆలోచనలే అని ఘంటాపథంగా చెప్పెయ్యవచ్చు.
రెండు కాకులు తను పెట్టిన ముద్దని కలిసి తింటున్నాయి. అది కూడా తనకు ఆశ్చర్యానే్న కలిగిస్తుంది. ప్రక్కవాడు ఎక్కడ పట్టుకుపోతాడో అని ప్రతి మనిషీ జాగ్రత్తగా అన్నీ తనకే దక్కాలి అన్నట్టు ప్రవర్తిస్తుంటే ఈ కాకి మాత్రం ‘కా! కా!’’ అని పిలిచి మరొకటన్నా వచ్చేదాకా ముద్దని ముట్టదు. ఒక్కటే వెళ్లి తింటుందేమో అని ఎన్ని రోజులు పరీక్షించిందో? తనే ఎప్పుడూ ఓడిపోయేది. ఎప్పుడైనా ఈ విషయంలో గెలుస్తానా అని ఇప్పటికీ అనుకుంటూ ఉంటుంది.
అడవుల్లో అయితే పండ్లు లాంటివి దొరుకుతాయి. ఇక్కడ అందరూ చెట్లను నరికేస్తూ ఉంటే వాటికి అలాంటివి ఎలా లభిస్తాయి? అందుకే ఒకదానికొకటి పిలిచి మరీ సహాయం చేసుకుంటాయేమో? వాటిని చూసి మన మనుషులూ అలా ఉండాలని బుద్ధితెచ్చుకుంటే ఎంత బాగుంటుంది?
‘‘ఆ! నువ్వు చెప్పావుగా. ఇక జనాలు అంతా వినేస్తారు. పద! పద! ఇప్పటివరకు చెప్పింది చాలు’’ అంది దబాయింపుగా అంతరంగం.
‘‘సరే లోపలికి వెళ్దాం. లేకపోతే దీని సతాయింపు భరించడం కష్టమయిపోతుంది. ఎన్ననుకున్నా ఇది మంచిదే. అలా తను కసరకపోతే లోపలికి వెళ్లి భోం చెయ్యాలి అన్న సంగతే గుర్తుకురాదు తనకు’’.
కాలర్ లేకపోయినా ఎగరేసింది మెచ్చుకున్నావని. మరి ఎప్పుడో కానీ మెచ్చుకోనుగా!
‘‘విశ్వా! ఎక్కడున్నావ్! భోజనానికిరా!’’ అత్తగారు పిలుస్తున్నారు.
‘‘ఆ! వస్తున్నానత్తయ్యా!’’ అంటూ సమాధానంగా తనే వెళ్లింది.
***
‘‘లోగిలి’’ ఇరవై సెక్షన్‌లలో క్లాసుకు ఇరవై ఐదు మంది పిల్లలతో పచ్చని చెట్టులా కళకళలాడుతోంది. వివిధ జిల్లాలనుంచీ వచ్చి అక్కడకు చేరిన పిల్లలు అక్కచెల్లెళ్ళలా, అన్నదమ్ముల్లా సఖ్యతగా పెరుగుతున్నారు. అక్కడ కల్మషం అంటే తెలియదు. తెలిసిందల్లా ఒక స్వచ్ఛతే. ఉండేదంతా అనురాగం, ప్రేమ. స్వార్థం అనే మాటే అక్కడ కనిపించదు. ఉన్నదంతా నిస్వార్థత. తరచి చూస్తే మానవత్వం. అలా ఎలా జరుగుతుంది అని అందరూ ఆశ్చర్యపడి గమనిస్తున్నారు. తాము చేయలేకపోయినా ఎదుటివారిలో ఏం తప్పు పడదామా అని ప్రక్కన కాచుకుని కూర్చునే వాళ్ళు ఎందరో ఉంటారు. అలాంటి వాళ్ళ చేత ఒక్కమాట కూడా పడకూడదని పకడ్బందీగా స్ట్ఫాని తన మనస్తత్వానికి దగ్గిరా వచ్చినవాళ్ళనే ఎంచుకుంది. వాళ్ళకు రకరకాల పరీక్షలు పెట్టి వందశాతం మార్కులు వచ్చిన వాళ్ళకే అవకాశం ఇచ్చింది. మధ్యలో వెళ్లిపోకుండా అగ్రిమెంట్ రాయించుకుంది. టీచర్ల మార్పులు పిల్లల్లో వారి మనస్తత్వాలులో కూడా మార్పు తెస్తాయని ఆమెకు ముందే తెలుసు. చక్కటి ప్రణాళికతో ముందుకు దూసుకుపోతోంది.
మంచి జీతాలు ఇస్తుండడంతో టీచర్లుకూడా పిల్లలపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బోధిస్తున్నారు. తాము తీసుకున్న జీతానికి వంద శాతం న్యాయం చేయగలిగేవారే అక్కడ బోధకులుగా నియమింపబడ్డారు.
చిన్నతనంలోనే తమ మీద నమ్మకంతో తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చినవారికి ఆ ఇద్దరి లోటూ కనిపించకుండా తీర్చిదిద్దుతున్నారు. భావితరానికి వీరంతా ఆదర్శం కావాలి కాబట్టి ప్రతీ విషయంలో జాగ్రత్త తీసుకున్నారు.
అంతటి కృషికి ఫలితమేనేమో విశ్వ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకోవటం. వారు మధ్యలో వచ్చి అన్నీ పరిశీలించుకుని వెళ్లి చివరకు నిర్థారించుకున్నట్లు తెలిపారు.
అన్ని పత్రికలూ ఆమెను ఆకాశానికి ఎత్తేసాయి. ఇంటర్వ్యూలు చేసాయి.
‘‘ఇదంతా నీ పుణ్యమే చందూ’’ అంటుంది విశ్వ అతని ఎద మీద వాలిపోతూ.

- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ