డైలీ సీరియల్

విలువల లోగిలి-55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అలా అంటావేమిటి విశ్వా? కృషి అంతా నీది. ప్రోత్సాహం మాత్రమే నాది. గొప్పతనం అంతా నాకు ఆపాదించకు. ఇంకా కొద్దో గొప్పో చెందితే అది ఇద్దరి అమ్మలకు చెందాలి’’.
‘‘తెరవెనుకే మేము. తెరముందంతా విశే్వ కనిపించాలి. మాకు కావాల్సింది విజయం కానీ గుర్తింపు కాదు. విశ్వకి వస్తే మాకూ వచ్చినట్లే’’ అంటారు ఏకకంఠంతో వాళ్ళిద్దరూ.
వారలా మాట్లాడుతుంటే సూర్యచంద్రకి ‘‘అసూయలేని ఆడవాళ్ళు ఈ లోకంలో ఉంటారా?’’- తనింట్లో మాత్రం ఉన్నారని అందరకూ చూపించాలనిపిస్తుంది.
ఇదంతా ప్రక్కన పెడితే తమ స్కూలువల్ల ఎంతోమందికి ఉపాధి కలిగింది. ఎన్నో కుటుంబాలు హాయిగా గుండెలమీద చెయ్యి వేసుకుని నిశ్చితంగా జీవితాన్ని గడిపేస్తున్నారు. అది చాలు అంటారు నరేంద్రనాధ్.
ఇందరి మంచి మనసులమధ్య నివాసం ఏర్పరుచుకున్న నేను కదా అదృష్టవంతురాలినని ‘సరస్వతీదేవి’ మురిసిపోతోంది.
***
సాయంత్రం సమయం. రవి అలసిపోయిన కార్మికుడిలా ఎర్రనైన తన బింబాన్ని పశ్చిమ కనుమలలోకి దాచేసుకుందామని పరుగెడుతున్నాడు.
అది ప్రతిరోజూ చూసే దృశ్యమే అయినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది విశ్వకు.
అలా సూర్యుడు కనిపిస్తే చాలు కనుమరుగయ్యేదాకా అక్కడనుంచీ కదలదు.
ఉన్నంతవరకూ ఎంత బాగుంటుందో వెళ్లిపోయాక అంత వెలితిగా అనిపిస్తుంది.
ఆ ఆశ ఎంత ఇష్టమో ఈ నిరాశ అంత కష్టం అని తెలిసి కూడా అనుభవించటానికే ఇష్టపడే తన మనస్తత్వం తనకే అర్థం కాదు.
ఇంట్లోకి వెళ్లిపోదాం అనుకునేంతలో ఆమె దృష్టిని ఆకర్షించింది ఒక దృశ్యం.
ఒక త్రాగుబోతు రోడ్డుమీద అడ్డదిడ్డంగా తూలుతూ నడుస్తున్నాడు.
అతని ప్రక్కనుంచే లారీలు, బస్సులు దూసుకుపోతున్నాయి. అతను మాత్రం వాటితో తనకు ఏం సంబంధం లేనట్లు ఏదో ఖాళీ రోడ్డుమీద తను నడుస్తున్నట్లు రోడ్డుమధ్యలో నడుస్తున్నాడు. ఏ క్షణమైనా అతన్ని మృత్యువు కబళించవచ్చు.
అతన్ని చూస్తూ తను కంగారుపడుతోంది కానీ అసలు అతను ఈ లోకంలోనే లేనట్లు నడుస్తున్నాడు. అతని కళ్ళు తేలిపోతున్నాయి. కాళ్ళు సహకరించనంటున్నాయి.
తను వెళ్లి ప్రక్కకు తీసుకువచ్చే అవకాశంలేదు. రానని మొరాయిస్తే అతన్ని లాక్కురాగలిగేశక్తి తనకు లేదు.
‘‘శివా! శివా!’’అని గట్టిగా పిలిచింది విశ్వ.
‘‘ఏంటమ్మగారూ! అంటూ పరుగెత్తుకొచ్చాడు.
‘‘చూడు.. అతన్ని జాగ్రత్తగా పక్కకు తీసుకురా’’
‘‘అలాంటివాళ్ళని తీసుకుని వచ్చినా లాభం ఉండదమ్మా. మళ్లీ అటే వెళతారు. వాళ్ళు ఇంటికి వెళ్ళేదాకా చెప్పలేం ఉంటారో లేదో’’.
‘‘పోనీలే శివా! మన కళ్ళముందు అలా అతనుంటే ఎలా వదిలేస్తాం చెప్పు. వెళ్లి తీసుకురా. వచ్చాక ఆలోచిద్దాం ఏంచెయ్యాలో’’-
శివ ఇంకా రెండు అడుగులు వెయ్యనేలేదు, శరవేగంతో వెళ్తున్న ఓ లారీ అతన్ని గుద్దేసి వెళ్లిపోయింది. కనీసం ఆగనుకూడా ఆగలేదు. ఇంకా పైగా డ్రైవరు గట్టిగా తిట్టేసుకుంటూ వెళుతున్నాడు.
రక్తం మడుగులో అతను.
క్షణం క్రితం ప్రాణమున్న మనిషి. ఇప్పుడు నిర్జీవంగా.
అప్పటిదాకా అటూ ఇటూ పట్టించుకోకుండా నడుస్తున్న జనం అపుడు మాత్రం అతని దగ్గర చేరారు.
ఒకరు నాడి చూసి ‘పోయాడ్రా’ అన్నాడు.
అలాంటివాడిని ‘పాపం’అని కూడా ఎవరూ దయల్చరుగా.
కళ్ళముందు అలా యాక్సిడెంట్ అవటం చూడటంతో తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయింది విశ్వ.
‘‘అమ్మగారూ!’’అంటూ వెనక్కి వచ్చేశాడు శివ.
‘‘ఏమిటా కలకలం?’’ అని ఆఫీసులో వాళ్ళు తొంగి చూడటంతో విశ్వ పడిపోవటం గమనించి క్రిందకు పరుగెత్తారు అనాలోచితంగానే. క్షణాల్లో కబురు సూర్యచంద్రకి చేరటంతో కంగారుగా క్రిందకు వచ్చాడు. అప్పటికే విశ్వ ముఖం మీద నీళ్లు జల్లుతున్నాడు శివ.
అందరినీ తప్పుకుని వెళ్లి విశ్వను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకువచ్చి మంచంమీద తన గదిలో పడుకోబెట్టాడు.
వెంటనే డాక్టర్‌కి ఫోన్ చేసి రమ్మని పిలిచి శివను ఏం జరిగింది అడిగాడు.
శివ తనకి తెలిసిందంతా చెప్పాడు.
‘‘అందరూ తనకే కావాలంటుంది. ఏ నిముషాన ఏం ప్రాణం మీదకు తెచ్చుకుంటుందో అని కంటికి రెప్పలా కాపాడవలసి వస్తోంది. ఇంత సున్నితమైతే ఎలా? తను లేకపోతే నేను బ్రతకగలనా?’’
ఆ ఊహకే అతని గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంది.
వాడిపోయిన పూల రెమ్మలా ఉన్న విశ్వ దగ్గరే కూర్చుండిపోయాడు. ఫ్యాను గాలికి ఆమె ముంగురులు అటూ ఇటూ కదులుతున్నాయి తప్ప ఆమెలో చలనం లేదు.
డాక్టరు వచ్చి ప్రమాదం లేదని చెప్పేవరకు ఎవరికీ మనసు మనసులో లేదు.
ఆత్రంగా అందరూ ఆమె చుట్టూ గుమిగూడారు.
‘‘మీరంతా కాస్త దూరంగా జరగండి. ఆవిడకు గాలి తగలనీయండి’’ అని డాక్టరు చెప్పాక అందరూ ఇవతలకి వచ్చారు.
‘‘ఆవిడ కాస్త షాకయ్యరంతే. కాసేపటిలో మెలకువ వస్తుంది’’ అని ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లారాయన.
అప్పుడు ఏసి ఆన్ చెయ్యాలని గుర్తువచ్చింది చందూకి. విశ్వకేమయిందో అని కాసేపు మైండ్ పనిచెయ్యలేదు.
కాసేపు ఒంటరిగా విశ్వను వదలమని చెప్పినా వదలేదు. మెలకువ వచ్చేవరకూ అక్కడే ఉంటానని తన ప్రక్కనే కూర్చున్నాడు.
కాసేపటి తర్వాత కళ్ళు తెరిచిన విశ్వ తననే తదేకంగా చూస్తున్న చందూని చూస్తూ ఏమయింది? అంత కంగారుగా ఉన్నావేం?’’ అని అడుగుతోంది ఏమీ తెలియనట్లు.
‘‘ఏమయిందా? తమరు స్పృహ తప్పారు’’ అన్నాడు కాస్త కోపంగా.
అప్పుడు గుర్తువచ్చింది విశ్వకు జరిగిన సంగతంతా.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206