డైలీ సీరియల్

విలువల లోగిలి-56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అలా కళ్లముందు అతను యాక్సిడెంటయ్యి చచ్చిపోతే చూడలేకపోయాను చందూ. అప్పటికే అతనికేమవుతుందో అని ఆరాటపడుతున్నాను. అదే సమయంలో అలా జరిగేటప్పటికి తట్టుకోలేకపోయాను’’.
‘నీకేమయినా అయితే మా సంగతి ఏమిటి అని ఒక్కసారి కూడా ఆలోచించవా?’’ గట్టిగానే అడిగాడు.
చందూకి ఇంకా కోపం తగ్గలేదు.
పెళ్ళయ్యాక ఇదే మొదటిసారి అతన్ని అంత కోపంగా చూడటం.
భయం వేసింది విశ్వకు. బెదిరిపోయింది.
లేడిపిల్ల కళ్ళలా ఆమె కళ్ళు కలవరంగా అటూ ఇటూ కదిలాయి. ఆమెలో బెదురుచూశాక గానీ తను ఎంత ఆవేశంగా అరిచాడో అర్థంకాలేదు చందూకి.
‘‘సారీ!’’ అంది దీనంగా ముఖంపెట్టి.
‘‘నేనే చెప్పాలి నీకు సారీ. నాకేమయిందో నాకే తెలియదు.
నీకేమయిందో అనే కంగారులో అలా మాట్లాడేశాను.
‘‘నేను కావాలని చెయ్యలేదుగా’’.
‘‘అయినా.. వ్యసనపరుల గురించి కూడా ఆలోచించాలా?’’
‘‘వాళ్ళుకూడా మనుషులేగా చందూ. వాళ్లను మార్చాల్సిన బాధ్యత మన మీద లేదా?’’ అంది విశ్వ.
‘‘మళ్లీ అదే మాట. నిజంగా బాధ్యత వున్న వాళ్ళయితే తను చచ్చిపోతే కుటుంబం పరిస్థితి ఏమిటని ఆలోచిస్తాడు. ఆ ఆలోచన వస్తే మద్యం జోలికిపోలేడు’’.
‘‘అసలు మద్యం దొరక్కపోతే ఈ గొడవే ఉండదుగా’’
‘‘అది జరగని పని. దీనివల్ల ఎన్ని కుటుంబాలు ప్రేమానురాగాలను కోల్పోతున్నాయో! మరెందరో ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్నారు. ఇంకొందరు ప్రాణాలను కూడా. మద్యం త్రాగి రోడ్డుమీద కార్లను నడపి జనాలమీద ఎక్కించేసిన కేసులు రోజూ ఎన్ని చూడటంలేదు?’’
‘‘అదేకదా నా బాధ’’
‘‘ఇదంతా ఎవరికి తెలియదు చెప్పు. మద్యం అమ్మటానికి లైసెన్సు ఇచ్చిన వాళ్ళకు తెలుసు. అమ్మేవాళ్ళకు తెలుసు. తాగే వాళ్ళకు కూడా తెలుసు. అయినా ఏం చెయ్యలేకపోతున్నాం. సరే.. ఇవన్నీ ఇపుడు ఎందుకు? కాసేపు ప్రశాంతగా నిద్రపో’’ అన్నాడు. గదిలోంచి మాటలు వినిపించడంతో విశ్వకి మెలుకువ వచ్చిందని అందరూ లోపలికి వచ్చారు.
తనకు బాగుందని చెప్పాక అందరూ బయటకు వెళ్లారు, తల్లి తప్ప.
వాళ్ళందరికి తన మీద వున్న అభిమానానికి ఒక క్షణం మూగబోయింది మనసు.
తల్లి అయితే తన చేతిని విడిచిపెట్టడంలేదు. ఈ లోకంలో ఆమెకు తను తప్ప ఎవరూ లేరు.
చందూ వాళ్ళంతా లేరా అంత బాధలోనూ అంతరంగం ప్రశ్న.
వౌనంగా తల ఊపింది అది అడ్డమో, నిలువో తనకే తెలియదన్నట్లు. తనకు చిన్నతనంనుంచీ ఇతరులు బాధపడుతుంటే చూడలేకపోవటం, చేతనయినంత సాయం చేయటం, చుట్టుప్రక్కలవారి గురించి, వారి బాగోగుల గురించి ఆలోచించటం అలవాటయిపోయింది.
పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు అంటారు. ఈ విషయంలో తాను అశక్తురాలినని చందూకి ఎలా చెప్పాలి? చెప్పి తనను ఇంకా బాధపెట్టాలా?
అలా అని తనను తాను మార్చుకోలేదు.
‘పిచ్చిముఖంలా ఉన్నావే! నీకేదో అయిందని బాధలో అలా అన్నాడేకానీ నిన్ను మారమని తను అనడు. నీ కోసం తనే మారుతాడు గానీ’ అని బుజ్జగించింది అంతరంగం.
‘‘విశ్వా! కాసేపునిద్రపో.. అంతా సర్దుకుంటుంది’’ అంది సుగుణ. అమ్మ చెబితే అలాగే జరుగుతుంది. అందుకే అమ్మ మాట ఎప్పుడూ జవదాటదు. అమ్మకు చెప్పకుండా ఏ పనీ చేయదు. అమ్మను దేవతలా పూజించాలి అని పెద్దలు చెప్పిన ‘మాతృదేవోభవ’ అనే తొలి పాఠాన్ని ప్రాణం పోయేదాకా మరచిపోదు. తనే కాదు అందరూ ఎప్పటికీ తల్లిని అలా ప్రాణంలా చూసుకోవాలని కోరుకుంటుంది.
అసలు తనకెందుకు ఇపుడు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయో అర్థం కావటంలేదు.
‘అదెందుకో నాకు తెలుసు. ఇందాక యాక్సిడెంట్ నువ్వుచూసినపుడు ఒక క్షణం నీ గుండె ఆగిపోయిందేమో అనిపించింది. అందుకే ఇలా అప్పగింతలు పెడుతున్నావు అంది అంతరంగం.
తల్లి ఒడిలోకి చేరిపోయింది.
లోకంలో ఎక్కడా లేని ప్రశాంతత తనకు ఆమె ఒడిలో లభ్యం అవుతుంది.
ఆమె చల్లని ఒడిలో సేద తీరాక కానీ విశ్వ మామూలు మనిషి అవ్వలేదు. విశ్వ గదిలోంచి బయటకు వచ్చాక గానీ అందరి ప్రాణాలు కుదుటపడలేదు.
ఆమె మామూలుగా మాట్లాడుతూ ఉండటంతో ఎవరి పనులలోకి వారు వెళ్లిపోయారు.
‘‘అందరినీ కంగారు పెట్టేశానా అత్తయ్యా!’’ అంది అరగంట తర్వాత అమృతతో.
‘‘మామూలుగా కాదు. బాగా కంగారుపెట్టావు. నీకేమయిందో అని నేనెంత బెంబేలుపడియానో నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు మాలో ఒకదానివి అయిపోయావు. అలాంటిది నీకేమినా అయితే మేము తట్టుకోగలమా’’ అందావిడ విశ్వను దగ్గరగా తీసుకుంటూ.
కోడళ్ళని ఎలా తగలబెడదామా అని ఆలోచించే అత్తలందరూ తన అత్తగారిని ఆదర్శంగా తీసుకోమని ఎలుగెత్తి అరవాలనిపించింది ఆమెకు ఒక్క క్షణం.
‘‘అమ్మగారూ! ఎవడికి వాడు నాకెందుకు అని ప్రక్కవాడిని గురించి పట్టించుకోని ఈ రోజుల్లో మీకెందుకమ్మా ఈ తాపత్రయం? అంటున్నానని కోప్పడకండేం’’ ఏమంటుందో అనే భయంతోనే గంగ చెప్పింది.
‘‘అలా అందరూ అనుకుంటే సమాజం ఎప్పుడు బాగుపడుతుంది గంగా?’’ మన వంతు కృషి మనమెప్పుడూ చెయ్యాలి. అలా కొద్దిమందైనా ప్రయత్నిస్తూ ఉండటంవలనే మంచితనం కొంతైనా మిగులుతుంది మనుషుల్లో ఈనాడు.
‘అలా అంటారా!’ అంటూ లోపలికి వెళ్లిపోయింది.
శివ ఏదో చెప్పాలనుకున్నాడు గానీ మళ్లీ ఎందుకో వౌనం వహించాడు.
***
‘‘విశ్వమ్మా! అమ్మ వృద్ధాశ్రమం నుంచీ ఫోను’’ అని శివ చెప్పటంతో చేస్తున్న పనిని అక్కడ పెట్టి వెళ్లి ‘హలో’ అంది.
‘‘విశ్వగారా! మీ శ్రమ వృధాపోలేదమ్మా. ఈనెల ఇద్దరు వృద్ధులను వారి పిల్లలు వచ్చి తీసుకుని వెళ్ళారు.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206