డైలీ సీరియల్

అందు ఇందు అన్న సందేహమేల? (ప్రహ్లాదుడు -13)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు మన హృదయంలోనే ఉంటాడు. భక్తులు ఎవరు ఎక్కడ ఏ రూపంలో కావాలంటేవారికి ఆరూపంలోనే కనిపిస్తాడు. రూపాలన్నీ ఆయనవే కనుక ఏరూపం లో కావాలంటే ఆ రూపంలో కనిపిస్తాడు. ఇందులో నీకు ఏమాత్రం సందేహం అక్కర్లేదు తండ్రీ అని మరోసారి బుద్ధి చెప్పాడు.
అంతేకాదు తండ్రీ! నీముందు వీరంతా చిత్తం చిత్తం అని అంటున్నారు. ఇదంతా కేవలం నటన. అసలు నీకు శత్రువు నీ మనస్సే. నీ మనస్సును ప్రశాంతం చేసుకొని నేనుచెప్పేది ఆలకించుము. హరికోసం ఎక్కడెక్కడో వెదకాల్సిన పనిలేదు. నీముందే నీ లోనే హరిని చూసే నేర్పును నీవు అలవర్చుకొనుము అని గట్టిగా చెప్పాడు. ఇట్లా ప్రహ్లాదుడు ఎంతగా చెప్పినా మూర్ఖుడైన హిరణ్యకశిపుడు ఒప్పుకోక హరి లేనేలేడని వాదించసాగాడు. అక్కడున్నఅందరూ తండ్రీ కొడుకు వాదోపవాదాల్లో ఎవరు నిజం చెబుతున్నారో ఎవరు అబద్ధం చెబుతున్నారో తెలుసుకోలేనంతగా మ్రాన్పడి చూస్తున్నారు. అంతలో ప్రహ్లాదుడు తండ్రీ మహావిష్ణువు ఎల్లెడలా వ్యాపించి ఉన్నాడు.. హరి లేని చోటు ఎక్కడాలేదు. నీవు ఎక్కడ చూస్తే అక్కడే కనిపిస్తాడు అని చెప్పాడు.
తన్ను తాను సృజియించుకునే భగవంతుడు తన నిశ్చల నిర్మల భక్తుడు తనకోసం తన తండ్రితోనే వాదిస్తున్నాడని చూస్తున్నాడు. ప్రహ్లాదుని మాటలు నిజం చేయడానికీ, హిరణ్య కశిపుని వరాలు నిజం చేయడానికీ మహావిష్ణువు నరసింహ రూపంలో లోకం అంతా దిక్కులన్నీ విస్తరించి ఉన్నాడు.
హిరణ్యకశిపునికి ఆగ్రహం మితి మీరి పోయంది.
తండ్రీ! నీవు శాంతించు. మనస్సును నిశ్చలం చేసుకో! హరి లేని చోటు ఎక్కడా లేదు. ఈ విశ్వమంతానిండి ఉన్నవాడు సముద్రంలోను, ఆకాశంలోను, సూర్యునిలోను, చంద్రునిలోను, గాలిలోను, శూన్యంలోను, ఓంకారంలోను, త్రిమూర్తులల్లోను, స్ర్తి పురుష నపుంసక వ్యక్తుల్లోను ఉన్నాడు. ఈ చరచరా జగత్తునంతా నిండి ఉన్నవాడిని వెదకాల్సిన అవసరం లేదు. నీవు ఎక్కడ చూడాలనుకొంటే అక్కడే ఆ మహావిష్ణువు నీకు కనిపిస్తాడు. నీవేరూపంలో కావాలనుకొంటే ఆరూపంలోనే దర్శనమిచ్చే ఆ దేవాదిదేవుని గురించి ఒక్కక్షణం ఆలోచించుకో. అందరియెడ సమదృష్టిని అలవర్చుకో అన్నాడు.
దానితో మరింతగా కోపావేశం పొందిన హిరణ్యకశిపుడు ‘ఓహో! అన్నిచోట్ల ఉంటాడని చాలా గొప్పలు చెబుతున్నావే. ఇదిగో ఈ స్తంభంలో చూపగలవా? ఒకవేళ నీకు చూపించలేకపోతే నీ తల త్రుంచివేస్తాను. అపుడు నిన్ను రక్షించడానికి ఆ అంబుజాక్షుడు అడ్డుపడుతాడని భ్రమించకు. నీకు నాచేతిలోనే చావు మూడింది’అని పెద్ద పెద్దగా రంకెలు వేసాడు.
అక్కడున్న వారంతా దిగ్భ్రాంతి చెంది చూస్తున్నారు. అయ్యో ఏమిటి అవబోతోంది. పోగాలము వచ్చిన వారికి కన్ను మిన్ను తెలియదంటారు కదా వీరిద్దరినీ చూస్తే ఇలానే ఉంటుందేమో అనిపిస్తోంది అనుకోసాగారు. వారందిరికీ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. కళ్లు అప్పగించి మరీ చూస్తున్నారు. కనురెప్పవేయడం కూడా మరిచినట్లు అందరూ నిలబడి పోయి ఉన్నారు.
హిరణ్యకశిపుని మాటలు విని ప్రహ్లాదుడు చిన్నగా నవ్వి ‘తండ్రీ! బ్రహ్మ దగ్గర నుంచి గడ్డి పరక వరకూ అసలు ఈ లోకంలో ప్రాణంతో ఉన్నవాటిల్లోను, ప్రాణం లేనివాటిల్లోను వ్యాపిం చి ఉన్న పరంధాముని గూర్చి నీకు ఇంకా శంకెందుకు? నిశ్చలమనస్కుడివై ఒక్కసారి చేతులు జోడించి ఆ నారాయణుని పిలువు క్షణాల్లో నీచెంత నిలుస్తాడాయన’ అన్నాడు.
‘ఏమీ నేను చేతులు జోడించితే వస్తాడంటావా? ఎవరనుకొన్నావు నన్ను. ఇదిగో ఈ స్తంభంలో చూపించు లేకపోతే .. అంటూ ఒక్క ఉదుటన లేచి ముందు కురికి వచ్చి తన చేతిలో నున్న ఖడ్గాన్ని ఝళిపిస్తూ ‘ఇందులో హరిని చూపరా’ అంటూ తన అరచేతితో సభామంటప స్తంభాన్ని గట్టిగా మోదాడు.
- ఇంకాఉంది