డైలీ సీరియల్

కాలాన్ని చూసే కాలు దువ్వాలి ( వామనుడు - 3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలరీతిని ఎవరూ పసికట్టలేరు. కాలానికి ఎవరూ ఎదురువెళ్లలేరన్న నిజం తెలిసిన బృహస్పతి 34దేవేంద్రా! మనసును దిటవుపరుచుకో. ఎల్లవేళలా మంచినే జరుగదు. కాలవైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. నేడు బలికి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు దక్కాయి. వారి దీవెనల బలం పెరిగింది. అంతేకాక భృగువంశబ్రాహ్మణులు వీనికి శక్తినిచ్చారు. శుక్రాచార్యుని ప్రియశిష్యుడైనాడు. కనుక వీనిని విష్ణువు, శివుడు తప్ప నీకు కానీ నిన్ను మించిన ఎవరికి గానీ బలిని ఎదురించే శక్తి లేదిప్పుడు. అమరావతిని గెలిచానన్న పొగరు మెల్లగా బలిలో విజృభిస్తుంది. ఆ తరువాత బ్రాహ్మణులను అగౌరవపర్చడం, పెద్దలను, పిన్నలను తూలనాడడం వారిపట్ల క్రూరంగా ప్రవర్తించడం లాంటి అనైతిక పనులను చేయడానికి ప్రలోభపడుతాడు. అపుడు బలిలోని ఈ యాగశక్తి సన్నగిల్లుతుంది. ఆనాడు నీవు తిరిగి ఈ దేవలోకానికి రావచ్చు. అందాక నీవు మీ పరివారం అంతా మీకిష్టమైన రూపాలను ధరించి మీకిష్టమైన నెలవుల్లోకి వెళ్లి నివసించండి. మీకు కాలం అనుకూలించినపుడు తిరిగి మీ మీ నెలవుల్లోకి రావచ్చు22 అని బృహస్పతి ఇంద్రునితో చెప్పాడు.
గురువు మాట కాదనువారు ఎవరూ ఉండరు కనుక దేవతలంతా తమ కిష్టమైన రూపాలను ధరించి అక్కడనుంచివెళ్లిపోయారు. శత్రువులు వెళ్లిపోయారన్న విషయం తెలుసుకొన్న బలి కొంగొత్త ఉత్సాహంతో స్వర్గలోకంలోకి అడుగుపెట్టాడు. అమరేంద్రుని సింహాసనాన్ని ఆక్రమించాడు. శుక్రుని చేత ప్రేరేపితుడై బలి అనేక వేల యజ్ఞాదికాలు చేయడం ప్రారంభించాడు. యథేచ్చగా ముల్లోకాలను తిరిగేవాడు. దేవతలు పారిపోయారన్న విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని రాక్షసులంతా ఎంతో సంతోషంతో కాలం గడుపుతున్నారు. బలి ఏమరపాటు లేకుండా బ్రాహ్మణులకు దక్షిణలు ఇస్తున్నాడు. పెద్దలను గౌరవిస్తున్నాడు. రాజ్యంలోని అందరినీ ఏకతాటిపై నిలపాలని, అందరూ సుభిక్షంగా ఉండేలా చర్యలు తీసుకొన్నాడు. - అని అదితి కశ్యపునితో చెప్పింది. ఇది అంతా విష్ణుమాయ ఒక్కొక్కరూ విష్ణుమాయామోహితులు కావడంలో ఆశ్చర్యమేమీ లేదు కదా అన్నాడు కశ్యపుడు. ‘‘ నిజమే. కానీ అపుడే నా కుమారులైన దేవతలు తలో దిక్కుకు పారిపోయారు. అందుకే నేనాడు విచారగ్రస్తురాలైనాను. నా పాలిట పరంధాముడైన మిమ్ములనే శరణుఅని వేడుకున్నాను. నాడు మీరు నాపై అనుగ్రహాన్ని చూపారు. పయోవ్రతాన్ని ఉపదేశించారు. వాడిపోయిన నా వదనంలో మళ్లీ చిరునవ్వులు పూయించారు. ఇదిగో ఇపుడు ఆ దేవాదిదేవుడు, వైకుంఠనిలయుడు, హరి , మురారి, అచ్యుతుడు, అనంతుడు, అఖిలాండుడు, వరదుడు నేడు నన్ను కరుణించబోతున్నాడు. ఇక నా కుమారులకు నిలువ నీడ దొరుకుతుంది. ఆ పరమేశుని అండ లభ్యమవుతుంది2 అని కనుల నీరు ఒలికిపోతుండగా చెప్పింది అదితి.
‘‘ప్రియా! ఊరడిల్లుము. మంచి రోజులు నీకు, నీకుమారులు వచ్చి తీరుతాయి. భగవంతుడే నీ కొమరుడై జన్మించబోతున్నాడు కదా. ఇక నీకొచ్చిన కష్టమేమున్నది. ఏ పూర్వజన్మ పుణ్యఫలమో నేడు మనజన్మ తరించబోతున్నది. ఆ చతుర్భుజుడు చిన్ని చిన్ని చేతులతో ముద్దుగారే మాటలతో మనలను అమ్మా నాన్న అని పిలవబోతున్నాడు. సర్వ మానవాళికీ శుభం జరుగుతుంది ’2అని కశ్యపుడూ ఆనందించాడు. కొద్దిరోజుల్లోనే అదితి చూలాలైంది. ఆమె వదనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆమె గర్భంలో విశ్వగర్భుడు కుదురుకున్నాడు. కశ్యపుని ఆశ్రమంలోని వారంతా ఎంతో సంతోషించాడు. కశ్యపుడు తండ్రి కాబోతున్నాడన్న వార్త వ్యాపించింది. దితి వచ్చి చెల్లెలికి దీవనలందించింది. దేవతలంతా అదితిని దీవించారు. సాధువులు సజ్జనులు అదితి సంపూర్ణాయుష్షు కలగాలని ఆయురారోగ్యాలతో ఉండాలని దేవదేవుడైన వైకుంఠుణ్ణి కశ్యపుని పుత్రునిగా చేయాలని దీవించారు.
అదితికి ఏడవ నెల సమీపించింది. ఆశ్రమంలోని వారంతా అదితికి శ్రీమంతం చేశారు. అదితి నొసట విభూతిని ధరింపచేసారు. తిలకం దిద్దారు. పసుపుతో చేసిన కుంకుమను తీర్చారు. రంగురంగుల వస్త్రాలను కట్టబెట్టారు. ముతె్తైదువులంతా వచ్చి దీవించి మంగళకరాలను గాజులను తొడిగారు. కశ్యపుని పాదాలను స్పృశించి నమస్కారం చేయడానికి అదితి కష్టపడుతుంటే కశ్యపుని చిరునవ్వుతో, లేవనెత్తి అఖండైశ్వర్యాలు కలగాలని ముద్దుగారే తనయుడిని ఎత్తుకోవాలని దీవించాడు.
సూర్యచంద్రులు గతి తప్పకుండా తమ పనులను తాము చేస్తూన్నారు. అందరి దీవెనలందుకున్న అదితి ముఖం నెలలు నిండిన శరీరాన్ని మోయలేక వాడిపోయింది. విశ్వానే్న తన కుక్షిలో ఉంచుకున్న విష్ణువును తన బొజ్జలో మోస్తున్న అదితిని చూసి ఎంత చిత్రం విష్ణుమాయ అని అనుకోకుండా ఉండలేకపోయాడు కశ్యపుడు.
అంతలో తారాపథంలో శుభగ్రహాలు ఒక్క చోట చేరాయి. అదితి గర్భంలో కదలాడుతూ ఉర్విలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న ఉపేంద్రుని చూశాడు.

- డా. రాయసం లక్ష్మి. 9703344804